మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎంఓఈ ఇన్నోవేషన్ సెల్, ఏఐసీటీఈ, బీపీఆర్&డీల 'మంథన్-2021' హ్యాకథాన్ ప్రారంభం
- జాతీయ నేషనల్ సెక్యూరిటీ న్యూఢిల్లీకి సరికొత్త యువ వినూత్న మేథస్సులు, స్టార్టప్‌లు దేశీయ పరిష్కారాలను కనుగొననున్నాయి
Posted On:
26 AUG 2021 4:04PM by PIB Hyderabad
'బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్' (బీపీఆర్ & డీ) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ నీరజ్ సిన్హా, 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్స (ఏఐసీటీఈ) చైర్మెన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుధేలు సంయుక్తంగా ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 'మంథన్-2021' హ్యాకథాన్‌ను ఆవిష్కరించారు. 'మంథన్-2021' హ్యాకథాన్‌ను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్ & డీ) విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఏఐసీటీఈ ఇన్నోవేషన్ సెల్ సౌజన్యంతో నిర్వహిస్తుంది. 'మంథన్-2021' హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమంలో ఎస్‌హెచ్ నీరజ్ సిన్హా మాట్లాడుతూ 'మంథన్-2021' కోసం బీపీఆర్ & డీ సంస్థ 20 కీలక సవాళ్లతో కూడిన అంశాల్ని విడుదల చేసిందని అన్నారు. ఇవి మన దేశ యువకులు విస్తృతంగా బయట నుండి ఆలోచించడానికి మరియు మన భద్రతా సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ భయపెట్టే సమస్యలను పరిష్కరించడానికి తగిన వినూత్న భావనలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయని చెప్పారు. ఈ అంశాలపై కృషి చేసిన సంస్థలు, వ్యక్తులు సరికొత్త ఆలోనలతో ముందుకు రావాలని కోరారు. ఆయా ఆలోచనలు నచ్చితే, మేము ఆ బృందాలతో కలిసి
పని చేస్తామని తెలిపారు. వాటి అమలుకు కూడా తగిన విధంగా తాము మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుధే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి, విద్యార్థులు వివిధ అంశాలలో పని చేయడానికి, పరిష్కారాలు కనుగొనేలా నిజజీవిత సవాళ్లు లేదా సమస్యలను అందించేందుకు ఆసక్తిగా కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. వివిధ ఏజెన్సీలకు సహకరించడం ద్వారా అనేక జాతీయ మరియు అంతర్జాతీయ హ్యాకథాన్‌లను నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు మన దేశ కీలక సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఆ కోణం నుండి ఈ మంథన్ హ్యాకథాన్ చాలా కీలకమైనదని తాము నమ్ముతున్నామని అన్నారు. ఎందుకంటే ఇది మన జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ప్రత్యక్షంగా తోడ్పాటును అందిస్తుందని వివరించారు. తాము చేప్పటిన ఈ చొరవలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటారని మరియు మన దేశం నుండి ఉత్తమమైన మేథస్సులను మరియు ఆలోచనలను గుర్తించడానికి బీపీఆర్ & డీ కి సహాయపడుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు దశలలో 'మంథన్-2021'..
'మంథన్-2021' రెండు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశలో పాల్గొనే వారు.. తాము పరిష్కరించాలనుకుంటున్న సమస్య ప్రకటనల విషయమై స్పందిస్తూ తమతమ భావనలను, ఆలోచనలను సమర్పించనున్నారు. ఈ సమర్పించిన ఆలోచనలను ఈ రంగంలోని నిపుణుల బృందం విశ్లేషిస్తుంది. వినూత్నమైన ఆలోచనలు మాత్రమే గ్రాండ్ ఫినాలే లేదా 2021 నవంబర్ 28 నుండి షెడ్యూల్ చేయబడిన.. 2వ రౌండ్‌కు ఎంపిక చేయబడతాయి. ఈ గ్రాండ్ ఫినాలే సమయంలో ఎంపికై పాల్గొనేవారు తమ భావనలను ప్రదర్శించడానికి మరియు వారి ఆలోచనలు సాంకేతికంగా సాధ్యమేనని, మరింత ముఖ్యంగా అమలు చేయగలగినవేనని కార్యక్రమం జ్యూరీలకు నిరూపించడానికి పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది.
ఉత్తమ ఆలోచనలను విజేతలుగా ప్రకటించబడతాయి..
మన దేశ నిఘా సంస్థలు ఎదుర్కొంటున్న 21వ శతాబ్దపు భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న భావనలు మరియు సాంకేతిక పరిష్కారాలను గుర్తించడానికి వీలుగా ఈ హ్యాకథాన్ "మంతన్ 2021" ఒక ప్రత్యేక జాతీయ చొరవ. నవంబర్ 28 నుండి 2021 డిసెంబర్ 1 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ 36 గంటల ఆన్‌లైన్ హ్యాకథాన్‌లో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నుండి ఎంపికైన యువకులు మరియు రిజిస్టర్డ్ స్టార్టప్‌లు తమ సాంకేతిక నైపుణ్యం మరియు వినూత్న నైపుణ్యాలను ఉపయోగించి బలమైన, సురక్షితమైన మరియు సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారాలను కనుగొనే విషయంలో పాల్గొంటాయి. విజేత జట్టులకు మొత్తం రూ.40 లక్షలు బహుమతి రుసుము ప్రకటించారు. పార్టిసిపెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలను ఉపయోగించి ఈరోజు విడుదల చేసిన 20 విభిన్న ఛాలెంజ్ స్టేట్‌మెంట్‌ల కోసం 6 థీమ్‌ల కింద డిజిటల్ సొల్యూషన్స్‌ని అభివృద్ధి చేసేందుకు వెసులుబాటు ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా సంబంధిత సవాళ్లు, ఇందులో ఫోటో/వీడియో విశ్లేషణ, నకిలీ కంటెంట్ గుర్తింపుతో పాటు సృష్టికర్త, ప్రిడిక్టివ్ సైబర్ క్రైమ్ డేటా అనలిటిక్స్ మొదలైనవి ఉంటాయి. ఈవెంట్‌లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 26, 2021 నుండి అధికారిక వెబ్‌సైట్ https://manthan.mic.gov.in లో ప్రారంభమవుతుంది.
***
(Release ID: 1749354)
Visitor Counter : 205