నీతి ఆయోగ్
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సిస్కో తో కలిసి పనిచేస్తున్న నీతీ ఆయోగ్
భారత అంకుర సంస్థల అనుభవాన్ని సాంకేతికతను అందించి మరింత ఎక్కువ మంది మహిళలు వ్యాపార రంగంలో ప్రవేశించడానికి మహిళా వ్యవస్థాపకత వేదికను ఏర్పాటు చేసిన నీతీ ఆయోగ్
Posted On:
26 AUG 2021 1:55PM by PIB Hyderabad
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు సహకారం అందించడానికి సిస్కో తో కలసి నీతీ ఆయోగ్ ' వెప్ నెక్స్ట్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నీతీ ఆయోగ్, సిస్కో లు మహిళా వ్యవస్థాపకత వేదిక (డబ్ల్యుఈపీ)ను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో మరిన్ని వ్యాపార సంస్థలు ప్రారంభం అయ్యేలా చూడడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి డబ్ల్యుఈపీ నెక్స్ట్ పేరిట తాజాగా ప్రారంభించాయి. దేశంలో అంకుర సంస్థల నిర్వహణ ప్రారంభంలో సిస్కో సాధించిన అనుభవాన్ని నీతీ ఆయోగ్ మహిళలకు అందించి వారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తుంది.' వెప్ నెక్స్ట్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ (సీఈఓ నీతీ ఆయోగ్), అన్నా రాయ్ (సీనియర్ సలహాదారు నీతీ ఆయోగ్), మార్టినెజ్ ( సిస్కో, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ), డైసీ చిట్టిలపిల్లి (ప్రెసిడెంట్, సిస్కో ఇండియా అండ్ సార్క్) హరీష్ కృష్ణన్, (పబ్లిక్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ , సిస్కో ఇండియా మరియు సార్క్) పాల్గొన్నారు.
2017లో నీతీ ఆయోగ్ డబ్ల్యుఈపీ ని ప్రారంభించింది. విభిన్నమైన నేపథ్యాలు కలిగిన మహిళలను ఒకచోట చేర్చి వారికి అవసరమైన వనరులు, సహకారం, శిక్షణ అందించాలనే లక్ష్యంతో డబ్ల్యుఈపీ తొలి ఏకీకృత పోర్టల్ గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి డబ్ల్యుఈపీ నెక్స్ట్ ను ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు అవసరమైన సౌకర్యాలు, సహకారంపై నీతీ ఆయోగ్ అధ్యయనం నిర్వహించింది. సామాజిక సహకారం, నైపుణ్యం, అంకుర సంస్థల స్థాపన, వాటి అభివృద్ధి అంశాలతో పాటు వారికి అవసరమైన ఆర్థిక, మార్కెటింగ్ సహకారం కోసం డబ్ల్యుఈపీ నెక్స్ట్ తోడ్పాటు అందిస్తుంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సహకారం అందించడానికి కార్యకమాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది.
వ్యకిగతంగా సంస్థాపరంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి నాస్కామ్ ఫౌండేషన్, సత్వ కన్సల్టింగ్ మరియు డీఅస్రా ఫౌండేషన్‌తో కలిసి సిస్కో సాంకేతికత-ఆధారిత సహకారాన్ని అందించి వారి పురోభివృద్ధికి సహకరిస్తుంది.
"ఆరవ ఆర్థిక గణన ప్రకారం దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల శాతం కేవలం 13.76% మాత్రమే. మొత్తం 58.5 మిలియన్ల మంది పారిశ్రామికవేత్తలలో 8.05 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. ఇది గతం. ప్రస్తుతం భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం డబ్ల్యుఈపీ వంటి కార్యక్రమాల ద్వారా అందిస్తున్న సహకారం వల్ల వీరి సంఖ్య పెరుగుతుంది. పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి సాధించి నూతన భారత దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తారు.' అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. " డబ్ల్యుఈపీ నెక్స్ట్ వల్ల ఈ కార్యక్రమం మరింత వేగంగా అమలు జరుగుతుంది. సిస్కోతో కలసి ప్రారంభించిన ఈ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ త్వరలో దేశంలోని ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన కలలను సాకారం చేసుకోవడానికి సహకరిస్తుంది' అని ఆయన అన్నారు.
సిస్కో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియా మార్టినెజ్ మాట్లాడుతూ నీతీ ఆయోగ్ తో కలిసి మహిళా సాధికారతకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు. లింగ వివక్ష లేకుండా సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన చెప్పారు. అడ్డంకులను అధిగమిస్తూ, నూతన ఆలోచనలు సాంకేతికతతో మహిళలు అభివృద్ధి సాధించడానికి డబ్ల్యుఈపీ ఉపయోగపడుతుందని అన్నారు.
ఎక్కువ మంది మహిళలు వాణిక్య, పారిశ్రామిక రంగంలోకి ప్రవేశిస్తే 2030 నాటికి కొత్తగా 170 మిలియన్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చి దేశ జీడీపీ 1.5% పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యిందని సిస్కో ఇండియా సార్క్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ పాలసీ ఆఫీసర్ హరీష్ కృష్ణన్ వివరించారు. డబ్ల్యుఈపీ నెక్స్ట్ ద్వారా దేశంలో మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ఆయన చెప్పారు.
సిస్కో గురించి
ప్రపంచ ఇంటర్నెట్ నిర్వహణలో సిస్కో (NASDAQ: CSCO) ప్రపంచ అగ్రగామి సంస్థ గా గుర్తింపు పొందింది. అనువర్తనాలను పునర్నిర్మించడం ద్వారా, డేటాను భద్రపరచడం, మౌలిక సదుపాయాలను మార్చడం బృందాలను ప్రపంచ మరియు సమగ్ర భవిష్యత్తు కోసం శక్తివంతం చేయడం ద్వారా నూతన అవకాశాలనుసిస్కో కల్పిస్తుంది. మరిన్ని సిస్కో వివరాల కోసం Cisco.com Twitter @Cisco లో చూడవచ్చును.
నీతీ ఆయోగ్ మహిళా వ్యవస్థాపక వేదిక గురించి
(WEP) అనేది నీతి ఆయోగ్ ప్రధాన కార్యక్రమంగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం అమలు జరుగుతున్నది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా సమాచార పోర్టల్ గా దీనిని రూపొందించారు. ఇది పరిశ్రమ సంబంధాలను మెరుగుపరచడానికి అమలు జరుగుతున్న పథకాలు మరియు సేవలపై అవగాహన కల్పించి అవసరమైన సహకారాన్ని అందించి శిక్షణా కార్యకమాల నిర్వహణ , నిధుల సేకరణ అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమాచారం మరియు సేవలకు వేదికగా పనిచేస్తుంది. దీనిలో ప్రస్తుతం 16,000 మంది రిజిస్టర్డ్ యూజర్లు మరియు 30 మంది భాగస్వాములు ఉన్నారు. ప్రధానంగా ఫండింగ్ , ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇంక్యుబేషన్ కనెక్ట్లు, టాక్సేషన్ , కాంప్లయన్స్ సపోర్ట్, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్లింగ్, మెంటర్షిప్, కమ్యూనిటీ , నెట్‌వర్కింగ్ మరియు మార్కెటింగ్ అసిస్టెన్స్ అంశాలపై ఇది సహాకారం అందిస్తుంది.
(Release ID: 1749290)
Visitor Counter : 341