మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్ డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెశనల్ అకౌంటెంట్స్ ఆఫ్ రష్యా ( ఐపిఎఆర్) కు మధ్య అవగాహన పూర్వకఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 25 AUG 2021 2:06PM by PIB Hyderabad

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్ డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్రొఫెశనల్ అకౌంటెంట్స్ ఆఫ్ రష్యా ( ఐపిఎఆర్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

 

వివరాలు:

 

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్ డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్రొఫెశనల్ అకౌంటెంట్స్ ఆఫ్ రష్యా ( ఐపిఏఆర్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ఆమోద ముద్ర వల్ల ప్రొఫెశనల్ అకౌంటెన్సీ సంబంధిత శిక్షణ, వృత్తి పరమైన నైతిక నియమావళి (ఎథిక్స్), సాంకేతిక పరిశోధన, అడ్వాన్స్ మెంట్ ఆఫ్ అకౌంటింగ్ నాలిజ్, వృత్తి పరమైన మరియు మేధోపరమైన వికాసం వంటి రంగాల లో పరస్పర సహకారాన్ని ఏర్పరచుకోవడం లో సహాయం లభిస్తుంది.

 

అమలు సంబంధిత వ్యూహం, లక్ష్యాలు:

 

ప్రొఫెశనల్ అకౌంటెన్సీ ట్రయినింగ్, ప్రొఫెశనల్ ఎథిక్స్, టెక్నికల్ రిసర్చ్, అకౌంటెంట్ ల వృత్తి పరమైన వికాసం వంటి విషయాల లో అభిప్రాయాలతో పాటు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొనే మాధ్యమం ద్వారా అకౌంటెన్సీ వృత్తి తాలూకూ అంశాల లో సహకారాన్ని పటిష్టం చేసుకోవచ్చు అనేది ప్రతిపాదిత ఎమ్ఒయు ధ్యేయం గా ఉంది. చర్చాసభ ల ద్వారా, సమావేశాల ద్వారా, ఉభయ పక్షాల కు ఆమోద యోగ్యమైన లాభదాయక సంయుక్త కార్యకలాపాల ను నిర్వహించడం ద్వారా పరస్పర సహకారాన్ని ప్రోత్సహించాలి అనేది కూడా ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యాల లో ఒకటిగా ఉంది. అలాగే ప్రపంచం లో ఈ వృత్తి ని పెంపొందించడం కోసం. అకౌంటెన్సీ వృత్తి పరం గా రష్యా లో, భారతదేశం లో చోటు చేసుకొంటున్న అభివృద్ధి ని గురించిన తాజా పరిణామాల ను వెల్లడించడం కూడా ఈ ఎమ్ఒయు ధ్యేయాల లో మరొకటి. సమాచారం పరం గా మద్దతు ను అందజేసుకొనే మార్గాల లో ఒక మార్గం గా ఇరు దేశాలు వాటి వెబ్ సైట్ లలోకి ప్రవేశించే ఒక లింకు ను కూడా ఏర్పాటు చేయనున్నాయి.

 

ప్రధాన ప్రభావం:

 

రష్యా లో వృత్తిపరమైన అవకాశాల ను అందుకోవడం కోసం ఐసిఎఐ సభ్యుల కు గల అవకాశాలకు రష్యా కు చెందిన ఐపిఎఆర్ కు, ఐసిఎఐ కి మధ్య ఎమ్ఒయు ఒక అదనపు ఉత్తేజాన్ని అందిస్తుంది అని ఆశించడం జరుగుతున్నది. ఈ రెండు సంస్థలతో పాటు ఐసిఎఐ సభ్యుల కు కూడా చక్కని ప్రయోజనాలు లభించడం కోసం పరస్పరం ప్రయోజనకారి కాదగిన సంబంధాన్ని తీర్చిదిద్దడానికి రెండు పక్షాలు కలసి కృషి చేయాలి అనేది కూడా ఎమ్ఒయు ధ్యేయం గా ఉంది. ఈ ఎమ్ఒయు తో అకౌంటెన్సీ వృత్తి లో సేవ ల ఎగుమతి కి బాట పరచడం ద్వారా రష్యా తో భాగస్వామ్యానికి ఐసిఎఐ మరింత గా బలాన్ని ప్రసాదించ గలుగుతుంది.

 

ప్రయోజనాలు:

 

ఐసిఎఐ సభ్యులు అనేక దేశాల లో వివిధ సంస్థల లో మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వివిధ పదవుల ను నిర్వహిస్తున్నారు; వారు ఏదైనా దేశం లో సంబంధిత సంస్థల తాలూకు వ్యూహాల రూపకల్పన ను, విధానపరమైన నిర్ణయాల ను ప్రభావితం చేయగల స్థితి లో కూడా ఉన్నారు. ప్రపంచం లో 45 దేశాల లో 68 నగరాల లో పలు ప్రాతినిధ్య కార్యాలయాలు, చాప్టర్ ల తో కూడిన ఒక విశాలమైన నెట్ వర్క్ ఐసిఎఐ కి ఉంది. ఆయా దేశాల లో ప్రస్తుతం అమలు లో ఉన్నటువంటి అభ్యాసాల ను వెల్లడి చేయడం ద్వారా ఒక ముఖ్య భూమిక ను ఐసిఎఐ పోషిస్తున్నది. దీనివల్ల భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడి ని ఆకర్షించడానికి ఆయా సంస్థలు అవలంబిస్తున్న ఉత్తమ అభ్యాసాల ను తాను కూడా స్వీకరించి, ఆ సంస్థ లు భారతదేశం లో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు, ఐసిఎఐ కి, ఐపిఎఆర్ కు ప్రయోజనకరం గా ఈ ఎమ్ఒయు ఉంటుంది.

 

పూర్వరంగం:

 

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్ డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ని భారతదేశం లో చార్టర్ డ్ అకౌంటెంట్ ల వృత్తి ని క్రమబద్దం చేయడం కోసం చార్టర్ డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949 పరిధి లో చట్టబద్ద సంస్థ గా ఏర్పాటు చేయడం జరిగింది. చార్టర్ డ్ అకౌంటెన్స్ వృత్తి ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు సంబంధించినటువంటి శిక్షణ, వృత్తిపరమైన వికాసం, ఉన్నత అకౌంటింగ్ ప్రమాణాలు, నైతిక నియమావళి వంటి రంగాల లో ఐసిఎఐ విస్తృతమైనటువంటి తోడ్పాటు ను అందించింది. ఐసిఎఐ కి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. పోతే రష్యా లో అకౌంటెంట్ ల అతి పెద్ద లాభాపేక్ష రహిత సంఘం గా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్రొఫెశనల్ అకౌంటెంట్స్ ఆఫ్ రష్యా (ఐపిఎఆర్ ) పనిచేస్తోంది.

 

 

 

***


(Release ID: 1749009) Visitor Counter : 195