ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారతదేశంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి తో ముడిపడిన మెసర్స్ యాంకరేజ్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ తాలూకు ఎఫ్ డి ఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
ఈ పెట్టుబడి తో మౌలిక సదుపాయాలు- నిర్మాణం రంగం తో పాటు విమానాశ్రయరంగాని కి కూడా ఒక పెద్ద ఉత్తేజం లభిస్తుంది
ఇటీవలేప్రకటించిన నేశనల్ మానిటైజేశన్ పైప్ లైన్ (ఎన్ఎమ్ పి) కి చెప్పుకోదగ్గ ప్రోత్సాహంలభిస్తుంది;ఎందుకంటే ఈ చర్య ప్రభుత్వ యాజమాన్యం లోని మౌలిక సదుపాయాల సంపత్తులను కౌలు కు ఇవ్వడం (దీనిలో ఆ సంపత్తుల నిర్వహణ బాధ్యత కూడా కలగలసివుంటుంది) ద్వారాఆదాయాన్ని సంపాదించడం లో తోడ్పాటు లభిస్తుంది
Posted On:
25 AUG 2021 2:08PM by PIB Hyderabad
మెసర్స్ యాంకరేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టమెంట్ హోల్డింగ్ లిమిటెడ్ లో 15,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి ని పెట్టే ఒక ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి (ఎఫ్ డిఐ) ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదం తెలిపింది. మెసర్స్ యాంకరేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టమెంట్ హోల్డింగ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాలు- నిర్మాణం, అభివృద్ధి రంగాల లో (ఈ రంగాల లో విమానాశ్రయాల రంగం, విమానయాన రంగం సంబంధి వ్యాపారాలు, సేవల లోను డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ తో పాటు రవాణా, లాజిస్టిక్స్ వగైరా లతో ముడిపడిన రంగాలు కూడా చేరేందుకు ఆస్కారం ఉంది) పెట్టుబడి పెట్టేటందుకు ప్రత్యేకం గా ఆరంభించినటువంటి ఒక భారతీయ పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ. ఈ ఎఫ్ డిఐ లో యాంకరేజ్ తాలూకు బెంగళూరు ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ లిమిటెడ్ వాటా ను బదలాయించడం, మెసర్స్ యాంకరేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ లో 2726247 ఓంటారియో ఇంక్ ద్వారా 950 కోట్ల రూపాయల పెట్టుబడి అనేవి కూడా కలసివుంటాయి. కెనడా కు చెందిన అతి పెద్ద నిశ్చిత లాభాల పెన్శన్ ప్లాన్ లలో ఒకటైన ఓమెర్స్ తాలూకు పూర్తి యాజమాన్యం లో నడుస్తున్నటువంటి అనుబంధ సంస్థే ఒఎసి.
మౌలిక సదుపాయాల కల్పన రంగం, నిర్మాణ రంగం లతో పాటు విమానాశ్రయాల రంగాని కి కూడా ఒక పెద్ద ప్రోత్సాహం ఈ పెట్టుబడి ద్వారా లభించబోతోంది. ప్రైవేటు భాగస్వామ్యం మాధ్యమం ద్వారా ప్రపంచ శ్రేణి విమానాశ్రయాలను, రవాణా సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్దిపరచాలని భారత ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళిక కు ఈ పెట్టుబడి చాలా వరకు ఊతాన్ని అందించగలుగుతుంది. ఇటీవల ప్రకటించిన నేశనల్ మానిటైజేశన్ పైప్ లైన్ (ఎన్ఎమ్ పి) కి కూడా ఒక గణనీయమైన ఉత్తేజం ఈ పెట్టుబడి తో అందనుంది. ఎందుకంటే ఈ చర్య తో ప్రభుత్వ యాజమాన్యం లోని మౌలిక సదుపాయాల సంబంధిత సంపత్తుల ను ప్రైవేటు ఆపరేటర్ ల కు కౌలు కు ఇచ్చి ఆదాయాన్ని ఆర్జించడం లో దోహదం లభించనుంది. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, క్రీడా మైదానాలు, విద్యుత్తుప్రసార మార్గాలు, ఇంకా గ్యాస్ ను సరఫరా చేసే గొట్టపు మార్గాలు వంటివి ప్రభుత్వ యాజమాన్యం లోని మౌలిక సదుపాయాల సంబంధి సంపత్తుల లో భాగం గా ఉన్నాయి. నేశనల్ మానిటైజేశన్ పైప్ లైన్ (ఎన్ఎమ్ పి) కిందకు వచ్చే కొన్ని రంగాల లో డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు మెసర్స్ యాంకరేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ ఒక ప్రతిపాదన తో వచ్చింది.
ఈ పెట్టుబడి తో ప్రత్యక్ష ఉపాధి కల్పన కు బాట పడుతుంది. ఎందుకంటే మెసర్స్ యాంకరేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ ఏయే రంగాల లో అయితే డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ ను చేసే ప్రతిపాదన తో ముందుకు వచ్చిందో ఆ రంగాలు మూలధనం మరియు ఉపాధి అవకాశాలు మెండు గా ఉన్నటువంటి రంగాలు గా ఉన్నాయి. నిర్మాణం తోను, నిర్మాణం తో ముడిపడ్డ సహాయక కార్యకలాపాల వారీ గా పరోక్ష ఉపాధి అవకాశాల ను సైతం ఈ పెట్టుబడి కల్పించనుంది.
***
(Release ID: 1749005)
Visitor Counter : 173