రక్షణ మంత్రిత్వ శాఖ
30 ఆగస్టు 2021 నుంచి భారత-కజకిస్థాన్ ఉమ్మడి శిక్షణా సైనిక విన్యాసాలు
Posted On:
25 AUG 2021 10:16AM by PIB Hyderabad
సైనిక దౌత్యంలో భాగంగా కజకిస్థాన్‌తో పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. 5వ విడత భారత-కజకిస్తాన్ దేశాల ఉమ్మడి శిక్షణా సైనిక విన్యాసాలు "కజింద్-21" అనే పేరుతో కజకిస్తాన్‌లోని అయిషా బీబీ ట్రైనింగ్ నోడ్ వద్ద ఆగస్టు 30వ తేదీ నుండి 11 సెప్టెంబర్ 2021 వరకు జరుగనున్నాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల సైన్యం మధ్య ఉమ్మడి శిక్షణా కార్యక్రమంగా సాగనుంది. ఈ విన్యాసాలు భారత్ మరియు కజకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించనున్నాయి. ఇండియన్ ఆర్మీ బృందంలోని బీహార్ రెజిమెంట్ బెటాలియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కంటింజెంట్ కమాండర్ నేతృత్వంలోని మొత్తం 90 మంది సిబ్బంది ఈ విన్యాసాలలో పాల్గొననుంది. కజకిస్తాన్ సైన్యం ఒక కంపెనీ సమూహం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పర్వత, గ్రామీణ పరిస్థితుల్లో కౌంటర్ తిరుగుబాటు/ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ కోసం శిక్షణ ఇవ్వడానికి భారత & కజకిస్తాన్ దళాలకు ఈ విన్యాసాలు మంచి అవకాశాలను అందిస్తాయి. తమ వృత్తిపరమైన అంశాలను పంచుకోవడం, ఉప యూనిట్ స్థాయిలో కౌంటర్ టెర్రరిజం వాతావరణంలో ప్రణాళిక & ఆపరేషన్ అమలు, ఆయుధాల వాడుక నైపుణ్యత విషయమై అనుభవాలను ఒకరితోమరొకరు
పంచుకోవడం, పోరాటాల షూటింగ్, కౌంటర్ తిరుగుబాటు/ కౌంటర్ టెర్రరిజంకు సంబంధించిన వివిధ ఆపరేషన్ల అనుభవాలను పంచుకోవడం ప్రధాన లక్ష్యంగా విన్యాసాలు జరుగనున్నాయి.
48 గంటల సుదీర్ఘ కాలం పాటు విన్యాసాల తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది, ఇందులో ఉప గ్రామీణ ప్రాంతంలోని ఉగ్రవాదుల తటస్థీకరణ దృష్టాంతమూ ఉంటుంది. ఈ వ్యాయామం పరస్పర విశ్వాసం, ఇంటర్- ఆపరేబిలిటీని బలోపేతం చేస్తుంది. భారత్ మరియు కజకిస్థాన్ యొక్క సాయుధ దళాల మధ్య తమ ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1748998)
Visitor Counter : 288