ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

59 కోట్ల డోసుల మైలురాయి దాటిన దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

గత 24 గంటల్లో 61 లక్షలకు పైగా టీకా డోసులు
ప్రస్తుతం 97.67 శాతం వద్ద రికవరీ రేటు

గత 24 గంటల్లో 37,593 కొత్త కేసులు నమోదు


మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,22,327) 0.99 శాతం

రోజువారీ పాజిటివిటీ రేటు (2.10 శాతం) గత 30 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 25 AUG 2021 9:46AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు ఇచ్చిన టీకాల సంఖ్య 59 కోట్ల మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో ఇచ్చిన 61,90,930 డోసులతో, ఇవాళ ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం 59.55 కోట్లను (59,55,04,593) ఈ కార్యక్రమం అధిగమించింది. 65,52,748 సెషన్ల ద్వారా ఈ ఘనత సాధ్యమైంది.

ఇవాళ ఉదయం 8 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం ఉన్న వివరాలు ఇవి:

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,54,325

రెండో డోసు

82,50,871

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,09,553

రెండో డోసు

1,27,11,166

18-44 వయసు వారు

మొదటి డోసు

22,37,85,210

రెండో డోసు

2,11,94,373

45-59 వయసు వారు

మొదటి డోసు

12,43,11,158

రెండో డోసు

4,99,65,293

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

8,40,42,537

రెండో డోసు

4,25,80,107

మొత్తం

59,55,04,593

 

టీకాల వేగాన్ని మరింత పెంచడానికి, పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 34,169 మంది రోగులు కోలుకున్నారు. కోలుకున్నవారి సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,17,54,281కు చేరింది.

దేశ కొవిడ్‌ రికవరీ రేటు 97.67 శాతానికి పెరిగింది.

కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 59 రోజులుగా రోజుకు 50,000 కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో 37,593 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 0.99 శాతంతో 3,22,327గా ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం యాక్టివ్ కేసుల్లో 1 శాతం కంటే తక్కువ.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,92,755 పరీక్షలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 51.11 కోట్ల (51,11,84,547)  పరీక్షలు చేశారు.

వారపు పాజిటివిటీ రేటు 1.92 శాతంగా నమోదైంది. గత 61 రోజులుగా 3 కంటే తక్కువగానే నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.10%గా ఉంది. గత 30 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3 శాతం కంటే తక్కువగా ఉంది. వరుసగా 79 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా ఉంది.

****



(Release ID: 1748884) Visitor Counter : 168