భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" పురస్కరించుకుని పుణెలోని సి-4.ఐ.4 ల్యాబ్‌ వద్ద ‘ఇండస్ట్రీ 4.0" పై యానిమేటెడ్ వీడియోను విడుదల చేసిన - ఎం.హెచ్.ఐ. సమర్థ్ ఉద్యోగ్ కేంద్రం

Posted On: 24 AUG 2021 5:48PM by PIB Hyderabad

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సమర్థ్ ఉద్యోగ్ కేంద్రం, "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" పురస్కరించుకుని పూణేలోని సి.4.ఐ.4 ల్యాబ్‌ వద్ద  "ఇండస్ట్రీ 4.0 పై యానిమేటెడ్ వీడియో విడుదల" అనే కార్యక్రమాన్ని, నిన్న, నిర్వహించింది.  పుణెలోని సి.4.ఐ.4 ల్యాబ్‌ వద్ద ఉన్న ఎం.హెచ్.ఐ. సమర్థ్ ఉద్యోగ్ కేంద్రం, ఒక సంస్థల లోని వివిధ సమూహాలకు చెందిన వ్యక్తుల నైపుణ్యాన్ని పెంపొందించడానికీ, డిజిటలైజేషన్ మరియు ఇండస్ట్రీ 4.0 ని అర్థం చేసుకోవడానికి, విభిన్న సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది.  సి.4.ఐ.4 ల్యాబ్ ప్రత్యేకంగా బ్లూ కాలర్ వర్క్‌ఫోర్స్ కోసం ఒక కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. ప్రేక్షకుల సాంకేతికేతర నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని  రూపొందించడం జరిగింది.  ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే విషయం చాలా సాధారణంగా ఉంటుంది,  అర్థం చేసుకోవడం చాలా  సులభం. ఈ కార్యక్రమం 2-డి, 3-డి గ్రాఫికల్ యానిమేషన్ కలయికగా రూపొందించిన ఒక ఇంటరాక్టివ్ వీడియో.   ఈ కార్యక్రమ వ్యాఖ్యానం హిందీ, మరాఠీ, ఇంగ్లీషు, వంటి మూడు విభిన్న భాషల్లో ఉంది. ఈ కార్యక్రమం ఒక ఇంటరాక్టివ్ సెషన్‌ తో పాటు రెండు మాడ్యూల్స్‌గా విభజించబడింది.

ఇండస్ట్రీ 4.0 నాల్గవ పారిశ్రామిక విప్లవాన్ని సూచిస్తుంది, ఇది తయారీ యొక్క సైబర్-భౌతిక పరివర్తన.  ఇండస్ట్రీ 4.0 ని "ఆటోమేషన్ యొక్క ప్రస్తుత ధోరణి మరియు సైబర్-ఫిజికల్ సిస్టమ్స్; ఇంటర్నెట్ కు సంబంధించిన విషయాలు; క్లౌడ్ కంప్యూటింగ్;  కాగ్నిటివ్ కంప్యూటింగ్;  స్మార్ట్ ఫ్యాక్టరీని సృష్టించడం వంటి అంశాలతో సహా తయారీ సాంకేతికతలలో డేటా మార్పిడికి ఒక పేరుగా నిర్వచించారు. 

సి.4.ఐ.4 ల్యాబ్ డైరెక్టర్ శ్రీ డి.ఎస్. నావల్‌ గుండ్కర్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ వీడియోను అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత గురించి వివరించారు.  జనరల్ మేనేజర్ (మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్, కె.ఓ.ఈ.ఎల్), శ్రీ రమేష్ చవాన్, మాట్లాడుతూ, వీడియోలోని విషయాలను ప్రశంసించారు. పరిశ్రమ 4.0 గురించి కార్మికులు సులభమైన మార్గంలో అర్థం చేసుకోవడానికి, ఇది, వీలు కల్పిస్తుందని, ఆయన, పేర్కొన్నారు.

మాడ్యూల్స్ వివరాలు:

మాడ్యూల్ - 1

ఈ మాడ్యూల్-1  లో  ఇండస్ట్రీ 4.0 తో పాటు దాని 9 టెక్నాలజీల పరిచయం ఉంటుంది. వీటిని చాలా సరళమైన మరియు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది.   ఇది 2డి మరియు 3డి గ్రాఫిక్స్ తో కూడిన యానిమేషన్ సహాయంతో పారిశ్రామిక విప్లవాన్ని వివరిస్తుంది. ఈ సాంకేతికతలను అమలు చేసిన వాస్తవ కంపెనీల యొక్క వీడియోల సహాయంతో కూడా వివరించడం జరిగింది. 

మాడ్యూల్ - 2

ఈ టెక్నాలజీల అమలు గురించి మరియు వాటిని అంగీకరించడానికి, స్వీకరించడానికి అవసరమైన మనస్సు మార్పు గురించి ఈ మాడ్యూల్ లో తెలియజేయడం జరిగింది. విభిన్న సాంకేతికతలకు అనుగుణంగా మార్గాలతో పాటు, అవి ఒకరి రోజువారీ జీవితంలో ఎలా భాగమవుతాయో ఇది వివరిస్తుంది.  ఈ సాంకేతికతలను అవలంబించడం వలన కంపెనీ ఉత్పాదకత, సామర్ధ్యం ఎలా పెరుగుతాయనే విషయాన్ని కూడా ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. 

డిజిటల్ పరివర్తన డిజిటల్ కంటే ప్రజల పరివర్తన గురించి ఎక్కువ అనే విషయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది.

 

*****


(Release ID: 1748860) Visitor Counter : 278