నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహించిన నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ
భారతీయ నగరాలను సౌరీకరణ (సోలారైజేషన్)పై వెబినార్
Posted On:
24 AUG 2021 1:51PM by PIB Hyderabad
భారత దేశంలో నగరాలలో సౌరశక్తిని ప్రోత్సహించేందుకు ప్రపంచ బ్యాంకు మద్దతుతో నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ వెబినార్ ను నిర్వహించింది. ఇందుకు అదనంగా, సోమవారం నాడు డిస్కామ్ (DISCOM ) అధికారులు, సోలార్ అంబాసిడర్లు ఆన్‌లైన్ శిక్షణా తరగతులను, భౌతిక స్థాయిలో ప్రచారాలను నిర్వహించారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల సందర్భంగా నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ 23-27 ఆగస్టు 2021 వరకు వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక నగరంలో విద్యుత్ అవసరాలను తీర్చే సౌర విద్యుత్తు లేదా ఇతర పునరావృత ఇంధన వనరులతో కూడిన సోలార్ సిటీ ఒకటి ఉండాలన్నది ప్రధానమంత్రి ఆకాంక్ష. సౌర విద్యుత్ కలిగిన నగరాలు తక్కువ విద్యుత్ ఖర్చు, తగ్గిన ఉద్గారాలు, స్వల్ప కార్బన్ జాడల కారణంగా లబ్ధి పొందుతాయి.
ఇప్పటి వరకూ 22 రాష్ట్రాలలో/ యుటిలలో సౌర నగరాలుగా అభివృద్ధి చేసేందుకు గుర్తించిన నగరాలను పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అమితేష్ సిన్హా వెబినార్‌లో వెల్లడించారు. ఇంటి కప్పులపైన సౌర పరికరాలను ఏర్పాటు చేసేందుకు గరిష్టంగా ఇళ్ళ కప్పులను వినియోగించడం, వృధా నీటి ఇంధనాన్ని మొక్కలకు మళ్లించేందుకు ఏర్పాట్లు, అలాగే అందుబాటులో ఉన్న సంభావ్య వాయు, చిన్నస్థాయి జల, బయోమాస్ వంటి వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, సోలార్ వీధి దీపాలు, సోలార్ ట్రీస్ తదితర వికేంద్రీకృత అప్లికేషన్లను వినియోగించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. నగరాలను సౌర విద్యుదీకరించేందుకు అవసరమైన కీలక అంశాలను, పద్ధతులను వివరణాత్మక ప్రెజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇంటికప్పులపై సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న పౌరులు తమ అనుభవాలను, దాని వల్ల కలిగిన లబ్ధిని పంచుకోవడం, తదితర అంశాలతో గురించి బహిరంగ చర్చ పౌరులతో జరిగింది. సోలార్ నగర అమలు, పురోగతిని పంచుకోవడం అన్న అంశంపై నిపుణుల ప్యానెల్ తో చర్చ జరిగింది. ఈ ప్యానెల్ లో బీహార్, ఒడిషా, మధ్య ప్రదేశ్, గుజరాత్ కు చెందిన సీనియర్ అధికారులు పాలు పంచుకుని, తమ ప్రణాళికలు, విజయాలు, సౌర నగర కార్యక్రమ అమలులో ముందుకు పోవడం గురించి కీలక వివరాలను పంచుకున్నారు.
***
(Release ID: 1748705)