నీతి ఆయోగ్
ఈశాన్య ప్రాంత జిల్లా సుస్థిర అభివృద్ధి సూచిక ( ఎస్‌డిజి ఇండెక్స్)డాష్ బోర్డు 2021-22 ను ఆగస్టు 26న విడుదల చేయనున్న నీతి ఆయోగ్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
Posted On:
24 AUG 2021 1:21PM by PIB Hyderabad
తొలిసారిగా రూపొందించిన ఈశాన్య ప్రాంత జిల్లా సుస్థిర అభివృద్ధి సూచిక (ఎస్డీజీ ఇండెక్స్)డాష్ బోర్డు 2021-22 ను నీతి ఆయోగ్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలు 2021 ఆగస్టు 26వ తేదీన విడుదల చేయనున్నాయి. ప్రాంతాల వారీగా జిల్లాల స్థాయిలో సుస్థిర అభివృద్ధి సూచిక (ఎస్డీజీ ఇండెక్స్)ను రూపొందించడం దేశంలోఇదే తొలిసారి. స్థానిక స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి దీనిని రూపొందించారు. ఈశాన్య భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలోని 120 జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సాగుతున్న ప్రయత్నాలలో ఇది మైలురాయిగా ఉంటుంది. నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్ సమక్షంలోనీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బి ఎల్ వర్మ ఎస్‌డిజి, డాష్‌బోర్డ్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. ఇందర్ జిత్ సింగ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం భారత దేశ ప్రతినిధి శ్రీమతి నదియా రషీద్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అందించిన సాంకేతిక సహకారంతో నీతి ఆయోగ్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ లు ఈశాన్య ప్రాంత ఎస్‌డిజి, డాష్‌బోర్డ్‌ను రూపొందించాయి. జాతీయ, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గణించడానికి నీతి ఆయోగ్ ఎస్‌డిజి ఇండెక్స్ ను రూపొందించింది. దీనిని ప్రామాణికంగా తీసుకుని ఈశాన్య ప్రాంతాల ఎస్‌డిజి ఇండెక్స్ కు రూపకల్పన జరిగింది. అభివృద్ధి సాధనలో రాష్ట్రాలు సాధించిన ప్రగతిని గణించి అవార్డులను అందించడానికి ఎస్‌డిజి ని ఉపయోగిస్తారు.
ఈశాన్య ప్రాంతాల ఎస్‌డిజి ఇండెక్స్ మరియు డాష్ బోర్డు 2021-22:
భారతదేశంలో ఎస్‌డిజి సమన్వయ సంస్థగా వ్యవహరిస్తున్న నీతి ఆయోగ్ 84 సూచికలు, 50 లక్ష్యాలలో 15 ప్రపంచ స్థాయి లక్ష్యాల సాధనను ఆధారంగా చేసుకుని ఈశాన్య ప్రాంత రాష్ట్రాల ఎస్‌డిజి ఇండెక్స్ ను రూపొందించింది. సుస్థిర అభివృద్ధి సాధన దిశలో జిల్లాలు సాధించిన ప్రగతి ఆధారంగా వాటికి ర్యాంకులను ఇవ్వడానికి ఎస్‌డిజిని రూపొందించారు. మరింత దృష్టి సారించాల్సిన ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో రాష్ట్రాలకు సహకారం అందించి వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి ఎస్‌డిజి ఉపయోగపడుతుంది. ఈశాన్య ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలతో చర్చించిన తరువాత ఎస్‌డిజి సూచిక, డాష్ బోర్డు రూపకల్పనకు సూచికలను ఎంపిక చేయడం జరిగింది. ఎస్‌డిజి ల రూపకల్పనలో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉంటుంది. తమ ప్రాంతాల పరిస్థితులను క్షేత్ర స్థాయిలో సేకరించి రాష్ట్రాలు అందించవలసి ఉంటుంది.
ఆరోగ్య, విద్య, ఆర్థికాభివృద్ధి, సంస్థ,పర్యావరణం, వాతావరణ మార్పులు లాంటి రంగాల్లో సాధించిన అంతర్జాతీయ లక్ష్యాలు, లక్ష్యాలను సాధించడంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం లాంటి అంశాలలో ఎస్‌డిజి ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్థాయి నుంచి దేశ స్థాయి, దేశ స్థాయి నుంచి స్థానిక స్థాయికి ఎస్‌డిజి లను తీసుకుని వెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నీతి ఆయోగ్ ఈశాన్య ప్రాంతాలకు దీనిని సిద్ధం చేసి లక్ష్య సాధనలో మరో అడుగు ముందుకు వేసింది.
***
(Release ID: 1748576)
Visitor Counter : 236