ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకాల క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారికి కోవిన్ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు
Posted On:
23 AUG 2021 5:59PM by PIB Hyderabad
కోవిషీల్డ్ టీకా పనితీరు మీద రెండు, మూడు దశల అనుసంధానానికి 2020 ఆగస్టు నుంచి భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్), సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉమ్మడిగా అధ్యయనాలు జరిపాయి. మూడో దశ కోవాక్సిన్ సమర్థత పరీక్షలు కూడా నవంబర్ 2020 నుంచి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్వహించింది. ఈ పరీక్షలలో పాల్గొన్న వాలంటీర్లకు కోవిన్ పోర్టల్ ద్వారా డిజిటల్ వాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇప్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు అనేక విజ్ఞప్తులు అందాయి.
ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా ట్రయల్స్ లో పాల్గొని టీకాలు తీసుకున్నవారికి టీకా సర్టిఫికెట్లు ఇవ్వాలని మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. అలాంటి వారికి టీకా సమాచారాన్ని సేకరించటానికి ఐసీఎంఆర్ ను మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీ గా నిర్ణయించింది. దీంతో అలాంటి 11,349 మంది జాబితా మంత్రిత్వశాఖకు అందింది. ఫలితంగా కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకా ట్రయల్స్ లో పాల్గొన్న వారందరికీ డిజిటల్ వాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను కోవిన్ ద్వారా జారీచేశారు.
పాల్గొన్నవారందరూ వ్యక్తిగతంగా తమ సర్టిఫికెట్లను కోవిన పోర్టల్, ఆరోగ్య సేతు, డిజిలాకర్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకో వచ్చు,.
***
(Release ID: 1748392)
Visitor Counter : 312