మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఎన్ఈపి అమలులో ఏడాదిలో సాధించిన విజయాల పై పుస్తకాన్ని, ఎన్ఈపి 2020కి సంబంధించి చేపట్టిన కొన్ని ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించనున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 23 AUG 2021 4:39PM by PIB Hyderabad

ఎన్ఈపి 2020 అమలు చేసి ఒక సంవత్సరం అయిన సందర్బంగా విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, ఎన్ఈపి అమలు తొలి ఏడాది విజయాలపై ఒక పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకాన్ని వర్చ్యువల్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ 2021 ఆగస్టు 24న ప్రారంభిస్తారు.

 

పుస్తకంతో పాటు, కొన్ని ప్రధాన ఎన్ఈపి 2020 కార్యక్రమాలను కూడా విద్యా మంత్రి ప్రారంభిస్తారు. నిపుణ్ భారత్ ఎఫ్ఎల్ఎన్ ఉపకరణాలు, దీక్షా వనరులు వీటిలో ఉన్నాయి. ఇంకా నిపుణ్ భారత్ అమలు కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు, ఉపాధ్యాయులకు సహాయపడటానికి, మార్గనిర్దేశం చేయడానికి దీక్షా కింద అభివృద్ధి చేసిన ఎఫ్ఎల్ఎన్ వనరుల ప్రత్యేక ఏర్పాటు; వర్చువల్ లైవ్ క్లాస్ రూమ్‌లు, వర్చువల్ ల్యాబ్‌ల ద్వారా అధునాతన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి వర్చువల్ స్కూల్ ఆఫ్ నియస్; ఎన్సిఈఆర్టి ప్రత్యామ్నాయ అకడెమిక్ క్యాలెండర్ 2021-22 అభ్యాస ఫలితాలు, థీమ్‌లు, సిలబస్ లేదా పాఠ్యపుస్తకం నుండి తీసుకున్న అధ్యాయాలకు సంబంధించి ఆసక్తికరమైన, సవాళ్లతో కూడిన  కార్యకలాపాల వారం వారీ ప్రణాళికను కలిగి ఉంటుంది.

ఎన్‌సిఇఆర్‌టి, దివ్యాంగుల సాధికారత శాఖ సహకారంతో  రూపొందించిన 'ప్రియా' పుస్తకాన్నిసామాజిక న్యాయ, సాధికారత మంత్రి డాక్టర్ వీరేందర్ కుమార్‌ కేంద్ర విద్యాశాఖ మంత్రి తో కలిసి ఆవిష్కరిస్తారు. పిల్లలను వారి విద్యాసంవత్సరం నుండే సమగ్ర విద్య వైపు తీసుకువెళ్లడం అనే భావన, ప్రాముఖ్యతను పెంపొందించడంపై ఈ పుస్తకం ప్రధానంగా రూపొందించారు. 

జాతీయ విద్యా విధానం 2020 అన్ని దశల్లో మొత్తం విద్యా వ్యవస్థలో గణనీయమైన పరివర్తనను తీసుకురావాలన్నది లక్ష్యం. ఇందుకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఎన్ఈపి  2020 ని ఒక మిషన్ మోడ్‌లో అమలు చేసింది. సౌకర్యవంతమైన, ఇంటరాక్టివ్, సూచనాత్మక, సమగ్ర ఎన్ఈపి 'సార్థక్' అనే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఒక్క సంవత్సరంలో డిపార్ట్‌మెంట్ 62 ప్రధాన మైలురాళ్లను సాధించింది, ఇది పాఠశాల విద్యా రంగంలో పరివర్తన తెస్తుంది. వీటిలో ఇవి ఉన్నాయి: ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీపై నిపుణ్ భారత్ మిషన్, ఎన్ఈపి 2020 తో సమగ్ర శిక్షా పథకాన్ని సమలేఖనం చేయడం, విద్యా ప్రవేశం- మూడు నెలల పాఠశాల తయారీ మాడ్యూల్, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ బ్లూప్రింట్ (ఎన్డిఈఏఆర్), 'నిష్ఠా'  కింద సెకండరీ టీచర్ల సామర్థ్య పెంపు , అసెస్‌మెంట్ సంస్కరణలు,దీక్షా లో డిజిటల్ కంటెంట్, మొదలైనవి. 

ఈ కార్యక్రమానికి డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు, స్వయం ప్రతిపత్తి సంస్థల అధిపతులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి పాఠశాల విద్యా శాఖ సీనియర్ అధికారులు హాజరవుతారు.  నిపుణ్ భారత్ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వర్క్‌షాప్ ఉంటుంది. 

 

****



(Release ID: 1748339) Visitor Counter : 135