నీతి ఆయోగ్

నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్‌ను రేపు ప్రారంభించనున్నకేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్

Posted On: 22 AUG 2021 12:11PM by PIB Hyderabad

నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్‌ను రేపు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసే రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూపొందించిన  నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్‌ (ఎన్ఎంపీ) నాలుగు సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంపిక చేసిన రంగాలకు  ఎన్ఎంపీలో ప్రాధాన్యత ఇస్తారు. పెట్టుబడిదారులకు అన్ని వివరాలను అందించి పారదర్శకంగా ఉండడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మధ్యకాలిక మార్గదర్శకంగా ఎన్ఎంపీ ఉంటుంది. 

2021-22 కేంద్ర బడ్జెట్ లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసే అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను వినూత్నంగా విభిన్న మార్గాలలో సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలను  కూడా

 రూపొందించింది.  

నీతి  ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్సీఈవో అమితాబ్ కాంత్ మరియు మోనటైజేషన్ పైప్‌లైన్ పరిధిలోకి వచ్చే  మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమక్షంలో నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్ పుస్తకం విడుదల చేయబడుతుంది.

 

***



(Release ID: 1748075) Visitor Counter : 276