రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళం కోసం అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ
'ఆత్మ నిర్భర్ భారత్' దిశగా డిఆర్డీఓ మరొక అడుగు అని అభివర్ణించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్.
Posted On:
19 AUG 2021 11:46AM by PIB Hyderabad
ప్రధాన అంశాలు:
యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించే సాంకేతికత
పెద్ద పరిమాణంలో ఉత్పత్తి కోసం పరిశ్రమకు బదిలీ
విజయవంతమైన యూజర్ ట్రయల్స్ తర్వాత భారతీయ వైమానిక దళంలో చేర్చడానికి ప్రక్రియ ప్రారంభం
‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డిఆర్డీఓ మరో అడుగు అని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీఓ) భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధ విమానాలను శత్రు రాడార్ ముప్పు నుండి రక్షించడానికి ఒక అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డిఆర్డీఓ లాబొరేటరీ అయిన డిఫెన్స్ లాబొరేటరీ జోధ్‌పూర్ అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్ -118/I ను డిఆర్డీఓ పూణే ఆధారిత ప్రయోగశాల హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ఈఎంఆర్ఎల్) కలిసి ఐఏఎఫ్ గుణాత్మక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది. విజయవంతమైన యూజర్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది.
నేటి ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతిలో, ఆధునిక రాడార్ ముప్పు కారణంగా యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. విమానాల మనుగడను నిర్ధారించడానికి, ఇన్‌ఫ్రా-రెడ్, రాడార్ ముప్పునకు వ్యతిరేకంగా నిష్క్రియాత్మక జామింగ్‌ను అందించే కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ (సిఎండిఎస్) ఉపయోగించబడుతుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ బెదిరింపుల నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత. ఈ సాంకేతికత ప్రాముఖ్యత ఏమిటంటే, గాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల భద్రతను నిర్ధారించడానికి శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక రోలింగ్ అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి దీనిని పరిశ్రమకు ఇచ్చారు.
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డిఆర్డీఓ, ఐఏఎఫ్, పరిశ్రమను ఈ క్లిష్టమైన సాంకేతికత స్వదేశీ అభివృద్ధికి ప్రశంసించారు, వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డిఆర్డీఓ మరొక ముందడుగుగా పేర్కొన్నారు. భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన బృందాలను రక్షణ శాఖ ఆర్ అండ్ డి, డిఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అభినందించారు.
***
(Release ID: 1747390)
Visitor Counter : 271