ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సి.సి.ఈ.ఏ)
ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన - కేంద్ర మంత్రిమండలి
77.45 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ ప్యాకేజీ (నిధుల ఆధారిత మద్దతు కోసం 17 కోట్ల రూపాయలు, నిధుల అవసరం లేని మద్దతు కోసం 60.45 కోట్ల రూపాయలు)
ఈశాన్య ప్రాంత రైతులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ చర్య సహాయపడుతుంది
దాదాపు 33,000 మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది
Posted On:
18 AUG 2021 4:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సి.సి.ఈ.ఏ), ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం.డి.ఓ.ఎన్.ఈ.ఆర్) పరిపాలనా నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.ఈ.ఆర్.ఏ.ఎం.ఏ.సి) పునరుద్ధరణ కోసం, 77.45 కోట్ల రూపాయల (17 కోట్ల రూపాయలు నిధుల ఆధారిత మద్దతు కోసం మరియు 60.45 కోట్ల రూపాయలు నిధుల అవసరం లేని ) పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది.
ప్రయోజనాలు:
పునరుద్ధరణ ప్యాకేజీ అమలు తో, ఈశాన్య ప్రాంత రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
జి.ఐ. ఉత్పత్తుల నమోదు మొదలైన, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా , ప్రపంచ మార్కెట్లో ఈశాన్య ప్రాంత రైతుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వీలుగా, రైతులకు మెరుగైన వ్యవసాయ సౌకర్యాలు అందించడం, క్లస్టర్ల లోని రైతులకు శిక్షణ, సేంద్రీయ విత్తనాలు, ఎరువులు, పంట కోతల అనంతరం రైతులకు సౌకర్యాలు అందించడం వంటి అనేక వినూత్న ప్రణాళికలను అమలు చేయడానికి వీలుగా, ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.ఈ.ఆర్.ఏ.ఎం.ఏ.సి) కి పునరుద్ధరణ ప్యాకేజీ సహాయపడుతుంది.
స్వచ్చంద పదవీ విరమణ, ఇతర వ్యయ తగ్గింపు చర్యల ఫలితంగా కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుంది, ఇతర ఖర్చులు తగ్గుతాయి, నిరంతర ప్రాతిపదికన కార్పొరేషన్ లాభాలను ఆర్జించడం ప్రారంభించడంతో పాటు, భారత ప్రభుత్వ రుణాలపై ఆధారపడటం కూడా నిలిచిపోతుంది.
ఉపాధి కల్పన సామర్ధ్యం:
ఎన్.ఈ.ఆర్.ఏ.ఎం.ఏ.సి. పునరుద్ధరణ ప్యాకేజీ అమలైన తర్వాత, వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు, ఈవెంట్ ల నిర్వహణ, లాజిస్టిక్స్, సార్టింగ్, గ్రేడింగ్, విలువ జోడింపు, వ్యవస్థాపకత, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దాదాపు 33,000 మందికి వీటి ద్వారా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
లక్ష్యాలు:
ప్రపంచ మార్కెట్లో ఈశాన్య ప్రాంత రైతుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వీలుగా, ఈవెంట్‌లలో పాల్గొనడం, జి.ఐ. (భౌగోళిక సూచనలు) ఉత్పత్తులు నమోదు చేయడం మొదలైన కార్యక్రమాలు అమలు చేసి, ఎఫ్.పి.ఓ. లతో పాటు ఇతర సాగుదారులను ప్రోత్సహించడం వంటి వివిధ వినూత్న ప్రణాళికలను అమలు చేయడం ద్వారా, మెరుగైన వ్యవసాయ సౌకర్యాలు, క్లస్టర్లలో రైతులకు శిక్షణ, సేంద్రియ విత్తనాలు, ఎరువులు, పంట కోతల అనంతర సౌకర్యాలు వంటివి అమలుచేయడానికి, పునరుద్ధరణ ప్యాకేజీ, ఎన్.ఈ.ఆర్.ఏ.ఎం.ఏ.సి. కి సహాయపడుతుంది.
వీటితో పాటు, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ఆత్మ నిర్భర్ భారత్, కృషి ఉడాన్, కిసాన్ రైల్, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వంటి ఇతర భారత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, వెదురు తోటల పెంపకం, తేనెటీగల పెంపకం, ఇ-కామర్స్ ద్వారా అమ్మకాలపై దృష్టి పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా, అధిక విలువ కలిగిన సేంద్రీయ పంటల సాగులో పాలుపంచుకునే రైతులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో, "ఎం.ఈ. ఫ్రెష్" మరియు "ఓ.ఎన్.ఈ." ( ఈశాన్య సేంద్రీయ వస్తువులు) వంటి స్వంత ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు విధానం కింద, నాఫెడ్, ట్రైఫెడ్ మొదలైన వాటి ద్వారా, చిల్లర దుకాణాలు ప్రారంభించడం వంటి కార్యక్రమాల అమలు ప్రక్రియ కూడా చురుకుగా సాగుతోంది.
పునరుద్ధరణ ప్యాకేజీని అమలు చేయడం వల్ల, వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు, కార్యక్రమాల నిర్వహణ, లాజిస్టిక్స్, సార్టింగ్, గ్రేడింగ్, విలువ జోడింపు, వ్యవస్థాపకత, మార్కెటింగ్ రంగాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
జి.ఐ. ట్యాగింగ్ తో పాటు దేశ విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఈశాన్య ప్రాంత సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఈ ఉత్పత్తుల ఎగుమతులను పెంపొందించి, ఈశాన్య ప్రాంత రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి.
*****
(Release ID: 1747172)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam