మంత్రిమండలి
azadi ka amrit mahotsav

విపత్తునిర్వహణ, ప్రతిఘాతుకత్వం, ఉపశమనం సంబంధిత రంగం లో సహకారం అనేఅంశం లో భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు)ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 18 AUG 2021 4:18PM by PIB Hyderabad

విపత్తు నిర్వహణ, ప్రతిఘాతుకత్వం, ఉపశమనం సంబంధిత రంగం లో సహకారం అనే అంశంలో బాంగ్లాదేశ్ ప్రజా గణతంత్రానికి చెందిన విపత్తు నిర్వహణ- సహాయం మంత్రిత్వ శాఖ కు, భారత గణతంత్రానికి చెందిన దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో భాగంగా ఉన్నటువంటి నేశనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారిటి (ఎన్ డి ఎమ్ఎ) కు మధ్య 2021 మార్చి నెల లో సంతకాలైన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడం జరిగింది.

ప్రయోజనాలు:

ఈ ఎమ్ఒయు ఒక వ్యవస్థ ను ఏర్పరచడానికి మార్గాన్ని సుగమం చేస్తున్నది. దీని వల్ల భారతదేశం, బాంగ్లాదేశ్ లు విపత్తు నిర్వహణ యంత్రాంగం తాలూకు ప్రయోజనాల ను పొందనున్నాయి. అంతేకాకుండా విపత్తు నిర్వహణ రంగం లో సన్నద్ధత, ప్రతిస్పందన, సామర్థ్యం పెంపుదల వంటి హంగుల ను బలోపేతం చేయడం లో ఈ ఎమ్ఒయు సహాయకారి కానుంది.

ఎమ్ఒయు ముఖ్యాంశాలు :

  1. పెద్ద స్థాయి విపత్తు.. (అది ప్రాకృతిక విపత్తు అయినా లేదా మానవ ప్రేరితమైనది అయినా) ఎదురైనప్పుడు ఉభయ పక్షాల లో ఏ ఒక్క పక్షం అభ్యర్థన మేరకైనా సహాయం, ప్రతిస్పందన, పునర్ నిర్మాణం, తిరిగి కోల్పోవడం లకు సంబంధించిన రంగం లో పరస్పరం మద్దతు ను అందించడం.
  2. సంబంధిత సమాచారాన్ని, రిమోట్ సెన్సింగ్ కు చెందిన సమగ్ర సమాచారాన్ని విజ్ఞాన శాస్త్ర సంబంధమైన డేటా ను ఒక పక్షానికి మరొక పక్షం అందజేయడం తో పాటు విపత్తు వేళ ప్రతిస్పందన, రికవరీ, విపత్తు ప్రభావాన్ని తగ్గించే దిశలో చర్య లు, విపత్తు ప్రభావానికి ఎదురొడ్డి నిలచి తగిన విధం గా సామర్థ్యాలను పెంచుకోవడం తాలూకు అనుభవాన్ని ఉత్తమ అభ్యాసాలను పరస్పరం వెల్లడించుకోవడం.
  3. ఆధునిక సమాచార సాంకేతికత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను రిమోట్ సెన్సింగ్ నావిగేషన్ సేవలు విపత్తు ఎదురయినప్పుడు తీసుకోవలసిన సన్నాహక చర్యల తాలూకు నైపుణ్యం, అలాగే వాస్తవ కాల ప్రాతిపదికన డేటాను ఇచ్చిపుచ్చుకోవడం... ఈ రంగంలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.
  4. విపత్తు నిర్వహణ రంగంలో అధికారుల శిక్షణకు అండదండలను అందించడం.
  5. ఇరు దేశాల మధ్య సంయుక్త విపత్తు నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం.
  6. విపత్తులకు తట్టుకొని నిలిచే సముదాయాలను సిద్ధం చేయడం కోసం అత్యంత ఆధునికమైన సాంకేతికతలను పరికరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం.
  7. విపత్తు నిర్వహణ రంగంలో పాఠ్య పుస్తకాలను, మార్గదర్శక సూత్రాలను తదితర ప్రచురణలను, సామగ్రిని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం. అంతేకాకుండా విపత్తు నిర్వహణ, రిస్క్ రిడక్షన్ మరియు రికవరీ రంగం లో పరిశోధన కార్యక్రమాల ను సంయుక్తంగా చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది.

 

***


(Release ID: 1747167) Visitor Counter : 234