ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశానికిచెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) కు, స్విట్జర్లాండ్కు చెందిన జిఎఆర్ డిపి ఫౌండేషన్ ఆన్ ఆంటిమైక్రోబియల్ రిజిస్టన్స్ రిసర్చ్ ఎండ్ఇన్నొవేశన్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
18 AUG 2021 4:16PM by PIB Hyderabad
అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర పరమైనటువంటి, సాంకేతిక విజ్ఞాన సంబంధమైనటువంటి సహకారం తాలూకు ఫ్రేమ్ వర్క్ పరిధి కి లోబడి భారతదేశాని కి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) కు, స్విట్జర్లాండ్ కు చెందిన జిఎఆర్ డిపి ఫౌండేశన్ ఆన్ ఆంటిమైక్రోబియల్ రిజిస్టన్స్ రిసర్చ్ ఎండ్ ఇన్నొవేశన్ కు మధ్య సంబంధాల ను పటిష్ఠ పరచడం తో పాటు ఉభయ పక్షాల ప్రయోజనాలు ముడిపడిన రంగాల లో సహకారాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం గురించిన వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది. భారతదేశం ఈ ఎమ్ఒయు పై 2021 మార్చి నెల లో సంతకాలు చేసింది.
లాభాలు:
ఈ ఎమ్ఒయు ఉభయ పక్షాల ప్రయోజనాలు ముడి పడిన రంగాల లో భారతదేశానికి, స్విట్జర్లాండ్ కు మధ్య సంబంధాల ను అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రపరమైన, సాంకేతిక విజ్ఞానపరమైన సహకారం తాలూకు ఒక ఫ్రేంవర్క్ పరిధి కి లోబడి మరింత గా బలోపేతం చేయనుంది.
ఆర్థిక ప్రభావం:
ఐసిఎమ్ఆర్-జిఎఆర్ డిపి సహకారం లో భాగం గా సంయుక్త లక్ష్యాలు విజయవంతం అయ్యేటట్లు చూడటానికి ఉభయ పక్షాలు ఆర్థికం గాను, ఇతరత్రా పద్ధతులలోను తోడ్పాటులను అందించడం కోసం ఒక వ్యూహాన్ని ఏర్పరచడం అనేది కలిసి ఉంటుంది. ప్రాజెక్టుల లో నిమగ్నం అయిన ఇతర పక్షానికి గాని లేదా తృతీయ పక్షాల కు గాని నేరు గా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైనటువంటి తోడ్పాటు, ఇతరేతరమైనటువంటి తోడ్పాటులు అనేవి చట్ట పరమైన నిబద్ధత తో కూడిన వేరు వేరు ఒప్పందాల కు లోబడి ఉంటాయి.
పూర్వ రంగం:
దేశం లో సంస్థల పరంగా అంతర్గతం గానూ, ఆ పరిధి కి ఆవల జరిగే బయోమెడికల్ రిసర్చ్ ను ఐసిఎమ్ఆర్ ప్రోత్సహిస్తూ వస్తున్నది. జిఎఆర్ డిపి ఒక లాభాపేక్ష రహిత పరిశోధన, అభివృద్ధి సంస్థ గా పనిచేస్తోంది. జిఎఆర్ డిపి ఆంటీబయోటిక్ చికిత్సల ను మెరుగుపరచడం గానీ లేదా అటువంటి చికిత్స పద్ధతుల ను అభివృద్ధి పరచి వాటిని లక్షిత వర్గాల కు అందజేయడం ద్వారా ప్రపంచ వ్యాప్త సార్వజనిక ఆరోగ్య అవసరాల ను తీర్చడం కోసం కృషి చేస్తున్నది.
***
(Release ID: 1747162)