నౌకారవాణా మంత్రిత్వ శాఖ

24 గంటల్లో 57090 టన్నుల బొగ్గును అన్‌లోడ్ చేసి రికార్డు సృష్టించిన వి.ఒ.సి. పోర్ట్

Posted On: 17 AUG 2021 1:12PM by PIB Hyderabad

వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ 24 గంటల్లో 57,090 టన్నుల బొగ్గును అన్‌లోడ్ చేయడం ద్వారా స‌రికొత్త రికార్డు సృష్టించింది. బెర్త్ నెం.9లో ఎం.వి.స్టార్ లారా నౌక నుండి రికార్డు స్థాయిలో ఈ అన్ లోడింగ్‌ను చేప‌ట్టారు. అంత‌కు ముందు 27.10.2020న బెర్త్ నం.9 వద్ద ఎం.వి. ఓష‌న్ డ్రీమ్‌ నౌక నుండి 56,687 టన్నుల బొగ్గును అన్‌లోడ్ చేశారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డ్‌. తాజా ప్ర‌క్రియ‌తో ఈ రికార్డు అధిగమించిన‌ట్ట‌యింది. పోర్ట్ ఒకే రోజులో 1,82,867 టన్నుల కార్గోను నిర్వహించడం విశేషం. ఇది అత్యధిక కార్గో నిర్వ‌హ‌ణ కావడం గర్వించదగ్గ విషయం. పనామాక్స్ క్లాస్ నౌక ఎం.వి.స్టార్ లారా మార్షల్ ఐలాండ్స్ నుంచి 14.20 మీటర్ల ఫ్లోటింగ్ డ్రాఫ్ట్‌తో మొద‌లై.. ఇండోనేషియాలో ఉన్న‌ మౌరా బెరౌ పోర్ట్ నుండి దాదాపు 77,675 టన్నుల బొగ్గును తీసుకొని భార‌త్‌కు చెందిన  మెస్స‌ర్స్ ఇండియా కోక్ అండ్ పవర్ ప్ర‌యివేటు లిమిటెడ్ సంస్థకు అప్ప‌గించేందుకు ప‌య‌న‌మైంది. ట్యూటికోర్నీకి చెందిన మెస్స‌ర్స్ ఐఎంసీఓఎల్ఏ
సంస్థ ఆధ్వ‌ర్యంలోని నిర్వ‌హించ‌బ‌డుతున్న మూడు-హార్బర్ మొబైల్ క్రేన్లు 24 గంటల వ్యవధిలో 57,090 టన్నుల బొగ్గును డిస్‌చార్జ్‌ చేసింది. ఓడకు షిప్పింగ్ ఏజెంట్‌గా ట్యూటికోరిన్‌కు చెందిన‌ మెస్స‌ర్స్ జేఎన్‌పీ షిప్పింగ్ ఏజెన్సీ, స్టీవెడోర్ ఏజెంట్‌గా మెస్స‌ర్స్‌ చెట్టినాడ్ లాజిస్టిక్స్ సంస్థ‌లు ప‌ని చేశాయి. ఈ ఘ‌న‌తను సాధించేలా క‌లిసి ప‌నిచేసిన వాటాదారుల కృషిని, వారందించిన‌ తోడ్పాటును వి.ఒ.సి.పోర్ట్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ శ్రీ టి.కె.రామచంద్రన్ ప్ర‌శంసించారు. మరింత ట్రాఫిక్‌ను ఆకర్షించడానికి పోర్ట్ పనితీరు మరియు ఉత్పాదకతలో మెరుగుదల సాధించడానికి త‌మ పోర్ట్ వ‌ర్గాలు నిరంతరాయంగా ప్రయత్నిస్తోంద‌ని అన్నారు.
                                                                           

****



(Release ID: 1746794) Visitor Counter : 196