రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఏర్పాటు చేసిన క్ల‌యింబ్‌-ఏ-థాన్‌ను జెండా


ఊపి ప్రారంభించిన ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 17 AUG 2021 3:56PM by PIB Hyderabad

ముఖ్యాంశాలుః

-డార్జిలింగ్‌లోని హిమాలయ పర్వతారోహణ సంస్థకు (హెచ్ఎంఐ) చెందిన‌ బృందం ఒక‌టి సిక్కిం హిమాలయాలలోని నాలుగు చిన్న శిఖరాలలో 'క్ల‌యింబ్‌-ఏ-థాన్‌'ను నిర్వ‌హించింది.

-ఇందులో భాగంగా 7,500 చదరపు అడుగుల జాతీయ జెండాను మౌంట్ రెనాక్ వద్ద ఎగురవేశారు.

-ఇది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ & ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో లిఖించ‌బ‌డే ప‌ర్వం. ఒక పర్వతం పైన అతి పెద్ద భారతీయ జాతీయ జెండాను ఎగుర‌వేయ‌డం రికార్డుల‌లో ఇదే తొలిసారి.


-దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో జెండాను ఎగుర వేసి దేశ‌భ‌క్తిని ప్రదర్శించేలా బృందం త‌గు ప్రణాళిక చేసింది

-బృందం ఇన్‌స్టిట్యూట్‌లో సుమారు 75 గంటల పాటు నిరంత‌రాయంగా 2.51 లక్షల సార్లు సూర్య నమస్కారం ప్రదర్శించింది. ఇదీ  ప్ర‌పంచ రికార్డు.

-యువతలో సాహసోపేత కార్య‌క్ర‌మాల‌ ద్వారా దేశభక్తిని ప్రోత్సహించేలా కృషి చేస్తున్నందుకు ఇన్‌స్టిట్యూట్‌కు ర‌క్ష‌ణ మంత్రి ప్రశంస‌
 
న్యూఢిల్లీలో ‘ఆజాది కా అమృత్ మహోత్సవం’ నిర్వ‌హించ‌డానికి డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్ఎంఐ) ఏర్పాటు చేసిన 'క్ల‌యింబ్‌-ఏ-థాన్' కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆగస్ట్ 17, 2021న జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 20-25, 2021 వరకు సిక్కిం హిమాలయాల‌కు చెందిన‌ నాలుగు చిన్న శిఖరాల వద్ద 'క్ల‌యింబ్‌-ఏ-థాన్‌' నిర్వహించబడింది. గ్రూప్ కెప్టెన్ జైకిషన్ నాయకత్వంలో, 125 మందితో కూడిన‌ పర్వతారోహకుల బృందం మౌంట్ రెనాక్, మౌంట్ ఫ్రే, మౌంట్ బీసీ రాయ్ మరియు మౌంట్ పలుంగ్‌లలో 'క్ల‌యింబ్‌-ఏ-థాన్' నిర్వహించారు. 7,500 చదరపు అడుగుల కొలత మరియు 75 కిలోగ్రాముల బరువున్న జాతీయ జెండాను మౌంట్ రెనాక్‌పై.. సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఎగుర వేయబడింది. జాతీయ జెండాను ఎగురవేసిన ఈ ప్రదేశానికి సిక్కిం నుండి వెలుగులోకి వ‌చ్చిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ పేరు పెట్టారు. ఈయ‌న‌ గాంధీ పోఖ్రెల్‌గా ప్ర‌శాస్త్యం పొందారు. ఇది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల‌లో.. పర్వతం పైన ఎగురవేసిన అతిపెద్ద భారతీయ జాతీయ జెండాగా కొత్త‌ ఘనతగా నమోదైంది.
2.51 లక్షల సార్లు సూర్య నమస్కారం..
ఈ బృందం డార్జిలింగ్‌లోని హెచ్‌ఎంఐలో 75 గంటల పాటు నిరంత‌రాయంగా 2.51 లక్షల సార్లు సూర్య నమస్కారం చేసి ప్రపంచ రికార్డును న‌మోదు చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమం విష‌య‌మై హెచ్‌ఎంఐని ప్రశంసిస్తూ యువతలో సాహసోపేత కార్యాల ద్వారా దేశభక్తిని ప్రోత్సహిస్తున్నార‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్ర‌శంసించారు. ఈ ఘ‌న‌త సాధించిన బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వినూత్న ఘ‌న‌త సాధించేందుకు కృషి చేసిన జ‌ట్టు స‌భ్యుల‌కు ప్ర‌దానం చేసేందుకు గాను మంత్రి సర్టిఫికెట్లను విడుదల చేశారు. గ్రూప్ కెప్టెన్ జై కిషన్ భారత జాతీయ ప‌తాకం ప్రతిరూపాన్ని రక్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల‌లోనూ..
అక్టోబర్ 31, 2021వ తేదీన గుజరాత్‌లో 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'తో సహా దేశంలోని వివిధ ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌ని హెచ్ఎంఐ బృందం ప్రణాళిక చేసింది; స్వర్ణిమ్‌ విజయ్ దివస్ సందర్భంగా డిసెంబర్ 16, 2021న న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్/సౌత్ బ్లాక్; ఆగస్టు 15, 2022న శ్రీనగర్‌లో లాల్ చౌక్; అండమాన్ నికోబార్ దీవులు, క‌న్యాకుమారిల‌లో మార్చి 23, 2022వ తేదీన‌.. దీనికి తోడు జనవరి 2022వ తేదీన‌ దక్షిణ ధ్రువం యొక్క ఎత్తైన శిఖరంపై భారత జాతీయ‌ జెండాను ఎగుర‌వేయాల‌ని కూడా ఈ బృందం యోచిస్తోంది.

***(Release ID: 1746789) Visitor Counter : 239