రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అండమాన్ నికోబార్ కమాండ్‌లో ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు

Posted On: 16 AUG 2021 12:21PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

·        అండమాన్ నికోబార్ దీవులలోని 50 మారుమూల ద్వీపాలలో జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడటం

·        ఐఎన్ఎస్ బాజ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంది

·        ఎఎన్‌సికు చెందిన 75 మంది సిబ్బంది వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు

 

దేశంలోని ఏకైక జాయింట్ ఫోర్సెస్ కమాండ్ అండమాన్ నికోబార్ కమాండ్ (ఎఎన్‌సి)  75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అండమాన్ నికోబార్ దీవుల్లోని 50 మారుమూల ద్వీపాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించింది. 2021 ఆగస్టు 13-15 మధ్య కమాండ్‌కు చెందిన అన్ని భాగాల ద్వారా అనగా ఇండియన్ ఆర్మీఇండియన్ నేవీఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. అండర్సన్ ద్వీపంక్లైడ్ ద్వీపంగ్రబ్ ద్వీపంఇంటర్వ్యూ ద్వీపంనార్త్ సింక్యూ ద్వీపంనార్త్ రీఫ్ ద్వీపంసౌత్ సింక్యూ ద్వీపం మరియు సౌత్ రీఫ్ ద్వీపంలో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026UDP.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TH6C.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LXWI.jpg

అండమాన్ మరియు నికోబార్ దీవుల నుండి ఐఎన్ఎస్ బాజ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు మరియు ఐఎన్‌ఎస్‌ బాజ్‌లో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇందులో ఏఎన్‌సిలోని నాలుగు భాగాల నుండి 75 మంది  సిబ్బంది పాల్గొన్నారు. సైనిక సంప్రదాయాల ప్రకారం ఉమ్మడిగా డ్రిల్ కూడా నిర్వహించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005F5A6.jpg

***



(Release ID: 1746329) Visitor Counter : 266