రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

గ్రూప్ క్యాప్టెన్ పెర్మింద‌ర్ ఆంటిల్ (26686) ఫ్లైయింగ్ పైలట్‌కు రాష్ట్రప‌తి శౌర్య చక్ర

Posted On: 15 AUG 2021 9:00AM by PIB Hyderabad

గ్రూప్ కెప్టెన్ పెర్మింద‌ర్ ఆంటిల్ (26686), ఫ్లయింగ్ (పైలట్), జనవరి 2020 నుండి ఎస్‌యు -30 ఎంకేఐ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. పెర్మింద‌ర్ ఆంటిల్
21 సెప్టెంబర్ 2020న ఎస్‌యు-30 ఎయిర్‌క్రాఫ్ట్ ముందు కాక్‌పిట్ నుండి సోర్టీ నిర్వ‌హిస్తున్న సమయంలో రేఖాంశ మరియు పార్శ్వ విమానాలలో అనూహ్య‌మైన‌, అనియంత్రిత‌ డోలయానాలు ఎదురుకావ‌డాన్ని గ‌మ‌నించాడు. గురుత్వాకర్షణ శక్తులు వేగంగా +9G నుండి -1.5G వరకు మారుతూ రావ‌డం జ‌రిగింది. విమానం అనియంత్రిత బ్యాంకింగ్‌తో పాటు ఎడమ, ఇతర నియంత్రణ వైఫల్యాల‌కు సంబంధించిన‌ సూచనలు జారీ చేసింది. అత్య‌ధిక‌మైన 'జీ' పరిస్థితుల కారణంగా ఎదురైన 'బ్లాక్-అవుట్' పరిస్థితుల్ని అధిగమించి అతను విమాన డోలయానాలను వ్య‌క్తిగ‌తంగానే తగ్గించాడు. ఆయుధ వ్యవస్థ ఆపరేటర్ యొక్క భద్రతను కూడా తనిఖీ చేశాడు.
అతను ప్రాధాన్యత పునరుద్ధరణను ప్రారంభించినప్పుడు.. విమానం మరోసారి అనూహ్య‌మైన విఫ‌రీమైన డోలయానాలను ఎదుర్కొంది. విమానం నియంత్రణకు పైలట్ నియంత్రణ కాలమ్‌పై పెద్ద మొత్తంలో ఒత్తిళ్లు అవసర‌మ‌య్యాయి. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌లో అధికారి తన ఉన్నత వ్యవస్థల పరిజ్ఞానాన్ని వర్తింపజేసి స్వ‌యంగా కొన్ని అసాధారణమైన పునరుద్ధరణ చర్యలను ఎంచుకున్నారు. అత్యంత దుర్ల‌భ‌మైన ఈ ప్రాణాంతక పరిస్థితులలో, పైలట్ తన ప్రశాంతతను కాపాడుకున్నాడు. ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. స‌మ‌య‌స్ఫూర్తితో త‌న‌ మనస్సు యొక్క ఉనికిని కాపాడుకున్నాడు. అత్యున్నత పైలటింగ్ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించి విమానం కుప్ప‌కూల‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాడు. ఫ‌లితంగా వందల కోట్ల రూపాయల విలువైన జాతీయ సంప‌ద‌కు భద్రతను నిర్ధారించారు. దీనికి తోడు విమాన ప్ర‌మాదం వ‌ల్ల క‌లిగే ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని నివారించగ‌లిగాడు. అసాధారణమైన ధైర్యంతో  గ్రూప్ కెప్టెన్ పెర్మిందర్ ఆంటిల్ క‌న‌బ‌రిచిన‌ వృత్తిపరమైన ఎంతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలు మరియు ఏరోస్పేస్ భద్రతకు అందించిన సహకారానికి గాను ఆయ‌న‌కు శౌర్య చక్ర లభించింది.
                               

***


 



(Release ID: 1746210) Visitor Counter : 162