రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన బీఆర్ఓ

Posted On: 14 AUG 2021 1:02PM by PIB Hyderabad

ప్ర‌ధాన ముఖ్యాంశాలు:
- సరిహద్దు రాష్ట్రాలు & స్నేహపూర్వక దేశాలలో 75 వైద్య శిబిరాలు నిర్వహ‌ణ‌
- అవసరమైన వారికి ఉచిత వైద్య పరీక్షల నిర్వ‌హ‌ణ‌.. ఉచిత మందుల పంపిణీ
- కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి గురించి స్థానికుల‌లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం
- ఉచితంగా ముఖ‌మాస్క్‌లు మ‌రియు హ్యాండ్ శానిటైజర్ల పంపిణీ


       భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం పురస్కరించుకుని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) సరిహద్దు రాష్ట్రాలు, స్నేహపూర్వక దేశాలలో 75 వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. జమ్మూ & కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ల‌ద్దాఖ్‌, ఉత్తరాఖండ్, సిక్కిం, మిజోరాం, త్రిపురతో పాటు భూటాన్‌ల‌లో పెద్ద సంఖ్యల‌లో ఈ శిబిరాల‌ను నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఓ మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందిస్తోంది. ఈ శిబిరాలు త‌మ కార్య‌క‌లాపాల‌లో భాగంగా కోవిడ్ -19 మహమ్మారి గురించి ఆయా సరిహద్దు ప్రాంత‌ స్థానిక ప్ర‌జ‌ల‌కు త‌గు విధంగా అవగాహనను పెంచుతున్నాయి. మేటి పరిశుభ్రత, సాంఘికీకరణ మరియు ముఖ‌మాస్క్‌లు ధరించడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ప్రజలకు తెలియజేయబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఫేస్ మాస్క్‌లు మరియు హ్యాండ్ శానిటైజర్లను స్థానికులకు పంపిణీ చేశారు.


(Release ID: 1745974) Visitor Counter : 262