విద్యుత్తు మంత్రిత్వ శాఖ

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో సహజ వాయువుతో హైడ్రోజన్ బ్లెండింగ్ పైలట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్‌టిపీసీ గ్లోబల్ ఈఓఐని ఆహ్వానిస్తోంది

Posted On: 14 AUG 2021 12:02PM by PIB Hyderabad

 

పవర్ మినిస్ట్రీ ఆధీనంలోని భారతదేశంలో అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ జనరేటింగ్ కంపెనీ అయిన ఎన్‌టిపీసీ లిమిటెడ్.. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) నెట్‌వర్క్‌లో సహజ వాయువుతో హైడ్రోజన్ బ్లెండింగ్‌పై పైలట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) ను ప్రారంభించింది.

లేహ్ వద్ద గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ కోసం ఎన్‌టిపీసీ ఆర్‌ఈఎల్ మరియు ఇంధన సెల్ బస్సుల సేకరణ కోసం ఎన్‌టిపీసీ విద్యుత్‌వ్యాపార్‌ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వివిఎన్‌) కోసం ఇటీవల టెండర్లను ఈఓఐ అనుసరిస్తోంది. హైడ్రోజన్ ఇంధన కేంద్రానికి శక్తిని అందించడానికి ఎన్‌టిపిసి ఆర్‌ఇఎల్ ద్వారా 1.25 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను లేహ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

సహజ వాయువుతో హైడ్రోజన్ మిళితం చేసే ఈ పైలట్ ప్రాజెక్ట్‌ భారతదేశంలో మొదటిది. భారతదేశ సహజ వాయువు గ్రిడ్‌ను డీకార్బోనైజ్ చేయడం యొక్క సాధ్యతను అన్వేషిస్తుంది. ఎన్‌టిపీసీ హైడ్రోజన్ ఎకానమీకి భారతదేశ పరివర్తనలో కీలక పాత్ర పోషించడానికి ఆసక్తి చూపుతోంది. తరువాత దీనిని భారతదేశవ్యాప్తంగా వాణిజ్య స్థాయిలో తీసుకుంటుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కింద దిగుమతి ప్రత్యామ్నాయ లక్ష్యంతో పాటు డీకార్బనైజేషన్ లక్ష్యాన్ని కూడా సాధిస్తున్నారు.

ఎన్‌టిపీసీ లిమిటెడ్ ఎరువుల పరిశ్రమను డీకార్బోనైజ్ చేయడానికి మరియు ఎరువులు మరియు శుద్ధి కర్మాగారంలో కొంత శాతం గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించాలనే రాబోయే ప్రభుత్వ ఆదేశాన్ని నెరవేర్చడానికి గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని కూడా ఆసక్తిగా అన్వేషిస్తోంది.

అలాగే, రామగుండంలో గ్రీన్ మిథనాల్ ఉత్పత్తిపై వివరణాత్మక అధ్యయనం పూర్తయింది. సమీప భవిష్యత్తులో కంపెనీ తుది పెట్టుబడి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.


 

***


(Release ID: 1745775)