విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రాధాన్యత ప్రాతిప‌దిక‌న‌ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు మారాలని సూచించిన విద్యుత్ శాఖ‌


-అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు ముందు చెల్లించిన విద్యుత్తు మీటర్ల‌ నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేయవచ్చ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

- డిస్కామ్‌లను తిరిగి ఆర్థిక సుస్థిరత విభాగంలోకి తీసుకువచ్చే దిశ‌గా ఇదో ముంద‌డుగు

- విద్యుత్ శాఖ ముందస్తు చెల్లింపును ప్రోత్సహించేలా రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖ‌లు కూడా ఇలాంటి యంత్రాంగాలను అనుకరించవ‌చ్చు

Posted On: 12 AUG 2021 4:01PM by PIB Hyderabad

ప్రాధాన్యత ప్రాతిప‌దిక‌న‌ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు మారాల‌ని త‌మ‌ నిర్వాహక నియంత్రణలో ఉన్న సంస్థలకు సూచించాల‌ని విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు సూచ‌న చేసింది. స‌ద‌రు ప్రక్రియలో భాగంగా ఈ విషయ‌మై అవ‌స‌ర‌మైన అన్ని ఆదేశాల‌ను కూడా జారీ చేయాలని మంత్రిత్వ శాఖలను కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. దీనికి కోన‌సాగింపుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక క్లారిఫికేష‌న్‌ను (స్పష్టతను) కూడా జారీ చేసింది. దీని ప్ర‌కారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు కేంద్ర శాఖలు ప్రీ-పెయిడ్ మీటర్ విద్యుత్ నిమిత్తం త‌గిన‌ ముందస్తు చెల్లింపులు చేయడానికి వీలు కల్పించింది. ముందు చెల్లింపు విద్యుత్  మీటర్ కోసం ముందస్తు చెల్లింపులు, ఎలాంటి బ్యాంక్ హామీకి పట్టుబట్టకుండా చెల్లింపులు చేసేలా త‌గిన‌ వెస‌లుబాటును క‌ల్పించింది. అదే సమయంలో సరైన అకౌంటింగ్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాల‌ని సూచించింది. అన్ని ప్రభుత్వ రంగ విభాగాలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అనేది ఆయా డిస్కామ్‌లను ఆర్థిక సుస్థిరత మార్గంలోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధతను నిర్ధారించడంలో.. సుదీర్ఘ మార్గంగానే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది. రాష్ట్రాలు తమ సొంత శాఖల ద్వారా విద్యుత్ బకాయిల ముందస్తు చెల్లింపుకు మద్దతు ఇచ్చే లాంటి యంత్రాంగాన్ని నిర్వచించేలా ఎమ్యులేషన్ కోసం కూడా ఇది మోడల్‌గా ఉపయోగపడతుంది. దేశంలో వినియోగదారులందరికీ నిరంతరాయంగా, విశ్వసనీయమైన మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనికి గాను ఒక కార్యాచరణ సమర్థవంతమైన మరియు ఆర్థికంగా స్థిరమైన విద్యుత్ రంగం తప్పనిసరి. డిస్కామ్‌లను తరచుగా అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటారు. కానీ విద్యుత్ రంగ విలువ గొలుసులో బలహీనమైన లంకే, విలువ గొలుసు దిగువన ఉన్న వారి పేలవమైన ఆర్థికప‌ర‌మైన‌ ఆరోగ్యం.. ఎగువ‌న ఉన్న విభాగాల‌పై త‌గిన ప్రతికూల ప్రభావాలన్ని చూపుతుంది. ఆర్థిక నష్టాలకు కారణమయ్యే కార్యాచరణ అసమర్థతలతో పాటు, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలతో సహా.. ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు పెరగడం; పట్టణ మ‌రియు గ్రామీణ స్థానిక సంస్థలు; విద్యుత్ వినియోగానికి ఆలస్యం మరియు సరిప‌డా చెల్లింపుల చేయ‌ని కారణంగా ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్‌లు కూడా డిస్కామ్‌ల నగదు ప్రవాహానికి ఇబ్బంది క‌లిగించేలా కార‌ణ‌మ‌వుతున్నాయి. లోపాలను అధిగమించడానికి డిస్కామ్‌లు ఉపయోగించే ఆయా అదనపు వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ భారం వారి ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని మరింతగా సృష్టిస్తుంది.. తద్వారా ఇది వారి సాధ్యతపై మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. రాష్ట్రాల నుండి అందిన అంచనాలు మేర‌కు 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రం ముగింపు నాటికి ప్రభుత్వ శాఖల మొత్తం బకాయిలు రూ.48,664 కోట్లుగా ఉండొచ్చని సూచిస్తున్నాయి. ఇది వార్షిక విద్యుత్ రంగ టర్నోవర్‌లో ~ 9%. ఇది భారీ విలువ. విద్యుత్ పంపిణీ విభాగం (డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) యొక్క కార్యాచరణ సామర్థ్యం, ఆర్ధిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, భారత ప్రభుత్వం 'పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం- ఒక‌ సంస్కరణల ఆధారిత- ఫలితాల‌పై ఆధార‌ప‌డే-లింక్డ్ స్కీమ్‌'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ప్రస్తుతం ఉన్న డిస్కామ్‌లను కార్యాచరణ సమర్థవంతంగా మరియు ఆర్థికంగా నిలకడను సాధించేందుకు వీలుగా తోడ్పాటును అందిస్తుంది. ఈ పథకం కింద పాత్ బ్రేకింగ్ జోక్యాలలో ఒకటిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వ్యవసాయ వినియోగదారులకు మినహా అన్ని విద్యుత్ వినియోగదారులకు దశల వారీగా ఏర్పాటు చేయాలనే యోచ‌న‌ ఉంది. దీనిలో కేంద్ర  మ‌రియు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని ప్రభుత్వ రంగ విభాగాలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వబడింది; పట్టణ మ‌రియు గ్రామీణ స్థానిక సంస్థలు; మరియు ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు ప్రభుత్వ శాఖలు సరిగా బడ్జెట్ మరియు విద్యుత్ సేవలను ఉపయోగించినప్పుడు చెల్లింపులు జ‌రిగేలా చూసేందుకు వీలుప‌డుతుంది. 

***

 



(Release ID: 1745363) Visitor Counter : 200