ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగ‌స్టు 13 న గుజరాత్ లో ఇన్వెస్ట‌ర్ సమిట్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి


వీయికల్ స్క్రాపింగ్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను స్థాపించడానికి పెట్టుబ‌డి ని ఆహ్వానించేందుకు ఈ శిఖ‌ర సమ్మేళనాన్ని ఏర్పాటు చేయ‌డం జరుగుతోంది

Posted On: 11 AUG 2021 9:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 2021 ఆగస్టు 13 న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా గుజ‌రాత్‌ లో ఓ ఇన్వెస్ట‌ర్ స‌మిట్‌ ను ఉద్దేశించి  ప్ర‌సంగించ‌నున్నారు.  వాలంట‌రి వీయికల్- ఫ్లీట్ మోడ‌ర్నైజేశన్ ప‌థ‌కం లేదా వీయికల్ స్క్రాపింగ్ పాలిసీ లో భాగం గా పెట్టుబ‌డుల‌ ను ఆహ్వానించేందుకు ఈ స‌మిట్‌ ను ఏర్పాటు చేస్తున్నారు.  ఇది ఒక ఇంటిగ్రేటెడ్ స్క్రాపింగ్ హబ్ ను అభివృద్ధిపరచడం కోసం అలంగ్‌ లో శిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందించే స‌దుపాయాల‌ పైన కూడా దృష్టి ని ఆకర్షించనుంది.

రోడ్డు ర‌వాణా- హైవేస్ మంత్రిత్వ‌ శాఖ తో పాటు గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఈ శిఖర సమ్మేళనాన్ని నిర్వహించనున్నాయి.  దీనిని గుజ‌రాత్‌ లోని గాంధీన‌గ‌ర్‌ లో ఏర్పాటు చేయడం జ‌రుగుతుంది.  ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న వారు, ప‌రిశ్ర‌మ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం లోని సంబంధిత మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం లోని సంబంధిత మంత్రిత్వ‌ శాఖ‌ లు పాలుపంచుకోనున్నాయి.

రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ కేంద్ర మంత్రితో పాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి కూడా ఈ స‌ద‌స్సులో పాల్గొంటారు.

వీయికల్ స్క్రాపింగ్ పాలిసీ ని గురించి

పని కి రానటువంటి మరియు కాలుష్య‌ కార‌కం అయినటువంటి వాహ‌నాల‌ ను ప‌ర్యావ‌ర‌ణ అనుకూలమైన, సురక్షితమైన పద్ధతుల లో దశల వారీ గా తప్పించడానికని ఒక ఇకోసిస్టమ్ ను రూపొందించడం వీయికల్ స్క్రాపింగ్ పాలిసీ ధ్యేయం గా ఉంది.  దేశం అంతటా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేశన్ లను, రిజిస్టర్ డ్ వీయికల్ స్క్రాపింగ్ సదుపాయాల ను ఏర్పాటు చేయడం ద్వారా స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను రూపొందించాలి అనేది ఈ విధానం ఉద్దేశ్యం.

 


 

***


(Release ID: 1744988) Visitor Counter : 237