పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయాన రంగం నిర్వహణ వ్యయాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 11 AUG 2021 11:57AM by PIB Hyderabad

 

పౌర విమానయాన రంగం నిర్వహణ వ్యయాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
 i.వివిధ పాలసీ చర్యల ద్వారా విమానయాన సంస్థలకు మద్దతు అందించడం.
 ii.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా విమానాశ్రయ మౌలిక సదుపాయాల కల్పన.
 iii.పిపిపి మార్గం ద్వారా ఇప్పటికే ఉన్న మరియు కొత్త విమానాశ్రయాలలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం.
 iv.సమర్థవంతమైన గగనతల నిర్వహణ, తక్కువ మార్గాలు మరియు తక్కువ ఇంధన వినియోగం కోసం భారత వైమానిక దళం సమన్వయంతో భారతీయ గగనతల హేతుబద్ధీకరణ.
 v.దేశీయ నిర్వహణ, మరమ్మత్తు మరియు సమగ్ర (ఎంఆర్వో) సేవలకు వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) రేటు 18% నుండి 5% కి తగ్గించబడింది.
 vi.ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలను పునఃప్రారంభించే లక్ష్యంతో 28 దేశాలతో ప్రత్యేకమైన ఎయిర్-లింక్‌లు లేదా ఎయిర్-బబుల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే కొవిడ్-19 కారణంగా సాధారణ అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి.
 vii.దేశీయ విమానయానంలో క్రమానుగతంగా పెరుగుదల.
 viii.విమానయాన సంస్థలకు ఛార్జీల బ్యాండ్‌ను నిర్దేశించడం.
 ix.అనుకూలమైన ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ మరియు ఫైనాన్సింగ్ విధానం ప్రారంభించబడింది.
 x.అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఈసిఎల్జీఎస్) 3.0 కింద ప్రయోజనాలు పౌర విమానయాన రంగానికి విస్తరించబడ్డాయి.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో శ్రీమతి ప్రియాంక చతుర్వేదిన్ కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) డా.వి.కె. సింగ్.. ఈ రోజు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

***



(Release ID: 1744728) Visitor Counter : 150