ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆపరేషన్ గ్రీన్స్ పథకం

प्रविष्टि तिथि: 10 AUG 2021 12:30PM by PIB Hyderabad

ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నవంబర్ 2018 లో ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రారంభించింది. టమోట, ఉల్లి మరియు బంగాళాదుంప (టిఓపి) విలువ గొలుసులసమగ్ర అభివృద్ధి కోసం రైతులకు లాభాలను అందించే లక్ష్యంతో ఈ పథకం చేపట్టబడింది; అలాగే పంటకోత అనంతర నష్టాలు తగ్గింపు; ఉత్పత్తిదారు మరియు వినియోగదారులకు ధర స్థిరీకరణ మరియు ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యాలు మరియు విలువ జోడింపు మొదలైన వాటిలో పెరుగుదలకు దీని ద్వారా కృషి చేస్తున్నారు.

రవాణా మరియు నిల్వ సబ్సిడీకు 50% పథకం కింద స్వల్పకాలిక జోక్యం కింద అందించడంతో పాటు గుర్తించదగిన ఉత్పత్తి క్లస్టర్‌లలో విలువ జోడింపు ప్రాజెక్టుల ద్వారా దీర్ఘకాలిక జోక్యం కొరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ @ 35% నుండి 70% వరకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా  ఒక్కో ప్రాజెక్టుకు రూ. 50 కోట్లకు లోబడి అందిస్తుంది.

ఈ పథకం కింద రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించబడవు. ఎందుకంటే ఈ పథకం డిమాండ్ ఆధారితమైనది అలాగే అర్హత కలిగిన ప్రొడక్షన్ క్లస్టర్‌లలో ప్రాజెక్టుల ఏర్పాటు కోసం స్వీకరించబడిన దరఖాస్తుల ఆధారంగా పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టులు ఆమోదించబడతాయి. ప్రారంభం నుండి పథకం కింద కేటాయించిన మరియు విడుదల చేసిన నిధుల వివరాలు దిగువ పట్టికలో ఇవ్వబడ్డాయి.(రూ. కోట్లలో)

సంవత్సరం   బిఈ      ఆర్‌ఈ      ఏఈ


2018-19   0.00 200.00 5.50

2019-20 200.00 32.48 2.84

2020-21 127.50 38.22 38.21

2021-22 73.40 - 15.84 [05.08.2021 వరకు]

ఈ పథకం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs #), వ్యవసాయ లాజిస్టిక్స్, ప్రాసెసింగ్ సౌకర్యాలు మొదలైనవి గుర్తించబడిన ఉత్పత్తి క్లస్టర్లలో ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా 6 ప్రాజెక్టుల విలువ  363.30 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం,  136.82 కోట్ల గ్రాంట్ వ్యయం జారీ చేశారు. గుజరాత్‌లో టమోట, ఉల్లి మరియు బంగాళాదుంప (3), మహారాష్ట్రలో రెండు ఉల్లి(2), ఆంధ్రప్రదేశ్‌లో టమోటా కోసం ఒకటి చొప్పున 6 ప్రొడక్షన్ క్లస్టర్‌లలో 31 ఎఫ్‌పిఓలు లక్ష్యంగా ఉన్నాయి.

బడ్జెట్ ప్రకటన 2021-22 ప్రకారం విస్తరించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం రొయ్యలతో సహా 22 పాడైపోయే ఉత్పత్తులను కవర్ చేస్తుంది.

పంటల వారీగా/రాష్ట్రాల వారీగా నిర్దిష్ట నిధులు పథకం కింద కేటాయించబడలేదు. ఎందుకంటే పథకం డిమాండ్ ఆధారితమైనది మరియు సమయం నుండి జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణపై పెట్టుబడిదారుల నుండి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గుర్తించిన ఉత్పత్తి క్లస్టర్‌లలో ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.

ఈ సమాచారాన్ని  ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్ సభకు లిఖితపూర్వకంగా అందించారు.

 

 

*****


(रिलीज़ आईडी: 1744520) आगंतुक पटल : 399
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Bengali , Punjabi , Gujarati , Tamil