ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 50.68 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ గత 24 గంటల్లో దాదాపు 56 లక్షల టీకాల పంపిణీ

కోలుకున్నవారి శాతం 97.39%

గత 24 గంటల్లో 39,070 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,06,822; మొత్తం కేసుల్లో 1. 27%
రోజువారీ పాజిటివిటీ 2.27 %; 13 రోజులుగా 3% లోపే

Posted On: 08 AUG 2021 9:41AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 50.68   కోట్లు దాటింది. 58,51,292 శిబిరాల ద్వారా మొత్తం 50,68,10,492 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 55,91,657 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:       

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,32,085

రెండో డోస్

79,74,385

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,82,15,157

రెండో డోస్

1,17,33,363

18-44 వయోవర్గం

మొదటి డోస్

17,58,22,657

రెండో డోస్

1,18,44,743

45-59 వయోవర్గం

మొదటి డోస్

11,16,30,145

రెండో డోస్

4,24,75,061

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,83,78,107

రెండో డోస్

3,84,04,789

మొత్తం

50,68,10,492

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,10,99,771 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 43,910 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.39% అయింది.

 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  39,070 కొత్త కేసులు నమోదయ్యాయి. 42  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది..

 

ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 4,06,822 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.27% మాత్రమే.

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 17,22,221 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 48 కోట్లకు పైగా (48,00,39,185) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.38% కాగా రోజువారీ పాజిటివిటీ  2.27 %  అయింది. వరుసగా13 రోజులుగా 3% లోపు,  62 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 

****


(Release ID: 1743783) Visitor Counter : 198