యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన మొదటి భారతీయునిగా - జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఏడో పతకం : దేశంలోనే అత్యున్నత స్థాయిలో కైవసం
Posted On:
07 AUG 2021 6:46PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు :
* చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ను రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు.
* కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, మాట్లాడుతూ, "మీ పేరు చరిత్ర పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది" అని, నీరజ్‌ను అభినందించారు.
23 ఏళ్ల జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో పురుషుల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ స్వర్ణ పతకం సాధించడానికి చోప్రా అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరాడు. దీనితో, అతను, స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ గాను, బీజింగ్ 2008 లో స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగతంగా ఒలింపిక్ స్వర్ణ పతకం గెలిచిన రెండవ క్రీడా కారునిగాను ఘనత సాధించాడు. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో, టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ భారతదేశ పతకాల సంఖ్యను ఏడుకి పెంచాడు. అదేవిధంగా, 2012 లో లండన్ గేమ్స్‌లో సాధించిన ఆరు పతకాల సంఖ్యను అధిగమించి, రికార్డు సృష్టించడానికి దోహదపడ్డాడు. భారతదేశం గర్వపడేలా చేసినందుకు నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తో పాటు పరమానందభరితమైన భారతదేశ ప్రజలు అభినందనలు తెలిపారు.
"నీరజ్ చోప్రా! మీ విజయం అపూర్వం! జావెలిన్ లో మీరు సాధించిన స్వర్ణ పతకం అడ్డంకులను ఛేదించి చరిత్ర సృష్టించింది. మీరు పాల్గొన్న మొదటి ఒలింపిక్స్‌లోనే, మీరు భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్ ను సాధించారు. మీరు సాధించిన ఈ విజయం మన యువతకు స్ఫూర్తినిస్తుంది. భారతదేశం ఉప్పొంగింది! మీకు హృదయపూర్వక అభినందనలు!" — భారత రాష్ట్రపతి (@rashtrapatibhvn) August 7, 2021
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, నీరజ్ చోప్రాను అభినందిస్తూ, మీ విజయం మన యువతకు స్ఫూర్తినిస్తుంది, అని పేర్కొన్నారు. “నీరజ్ చోప్రా! మీ విజయం అపూర్వం! జావెలిన్ లో మీరు సాధించిన స్వర్ణ పతకం అడ్డంకులను ఛేదించి చరిత్ర సృష్టించింది. మీరు పాల్గొన్న మొదటి ఒలింపిక్స్‌లోనే, మీరు భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్ ను సాధించారు. మీరు సాధించిన ఈ విజయం మన యువతకు స్ఫూర్తినిస్తుంది. భారతదేశం ఉప్పొంగింది! మీకు హృదయపూర్వక అభినందనలు!", అని, రాష్ట్రపతి, సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేశారు.
టోక్యోలో చరిత్ర లిఖించబడింది ! ఈరోజు @నీరజ్_చోప్రా (@Neeraj_chopra1) సాధించినది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువకుడైన నీరజ్ అద్భుతంగా రాణించాడు. అతను అద్భుతమైన అభిరుచితో ఆడాడు. అసమానమైన మనో ధైర్యాన్ని ప్రదర్శించాడు. స్వర్ణ పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS — నరేంద్ర మోదీ (@narendramodi) August 7, 2021
అత్యుత్తమ ప్రదర్శన కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నీరజ్‌ను అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, "టోక్యోలో చరిత్ర లిఖించబడింది ! ఈరోజు నీరజ్ చోప్రా సాధించినది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువ నీరజ్ అద్భుతంగా రాణించాడు. అతను అద్భుతమైన అభిరుచితో ఆడాడు. అసమానమైన మనో ధైర్యాన్ని ప్రదర్శించాడు. స్వర్ణ పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు." అని పేర్కొన్నారు.
నిరజ్ చోప్రా
భారతదేశ గోల్డెన్ బాయ్!
భారతదేశ ఒలింపిక్ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది !
మీరు అద్భుతంగా విసిరారు.
ఒక బిలియన్ చీర్స్ కు అర్హుడు!
మీ పేరు #టోక్యో 2020 చరిత్ర పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. @Neeraj_chopra1 pic.twitter.com/Xe6OYlCedq
— అనురాగ్ ఠాకూర్ (@ianuragthakur) August 7, 2021
కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో అభినందన సందేశంతో పాటు నీరజ్ చోప్రా గెలిచిన క్షణాన్ని తిలకిస్తున్న వీడియో క్లిప్ ను కూడా పంచుకున్నారు.
"నీరజ్ చోప్రా, భారతదేశపు గోల్డెన్ బాయ్! మీరు అద్భుతంగా వేసిన త్రో బిలియన్ చీర్స్ కు అర్హమైనది! #టోక్యో 2020 చరిత్ర పుస్తకాల్లో మీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది." అని, కేంద్ర క్రీడా శాఖ మంత్రి ట్వీట్ చేశారు.
నీరజ్ చోప్రా వ్యక్తిగత వివరాలు :
క్రీడాంశము : పురుషుల జావెలిన్ త్రో
పుట్టిన తేదీ : డిసెంబర్ 24, 1997
నివాస స్థానం : పానిపట్, హర్యానా.
శిక్షణా స్థావరం : ఎస్.ఏ.ఐ. ఎం.ఆర్.సి., సోనిపట్.
ప్రస్తుత శిక్షణా స్థావరం : ఉప్ప్సల, స్వీడన్.
జాతీయ కోచ్: డాక్టర్ క్లాస్ బార్టోనిట్జ్.
హర్యానాలోని ఖండ్రా గ్రామానికి చెందిన అధిక బరువు కలిగిన 12 ఏళ్ల బాలుడ్ని, అతని కుటుంబ సభ్యులు క్రీడలు చేపట్టాలని పట్టుబట్టారు. అతను చివరికి వారి వేధింపులకు లొంగి, పానిపట్ లోని శివాజీ స్టేడియంలో శిక్షణ ప్రారంభించాడు. స్టేడియంలో కొంతమంది సీనియర్లు జావెలిన్ విసరడాన్ని అతను చూసే వరకు ఏ లక్ష్యం లేకుండా ఉన్న అతను, ఆ తర్వాత, జావెలిన్ త్రో లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదృష్టవశాత్తూ అతని కోసం, ఆ క్రీడ నిజంగా అతడికి అత్యంత ఇష్టమైన వ్యాపకంగా మారింది. దాంతో అతను, ఆ క్రీడలో ప్రావీణ్యం కోసం మెరుగైన, కఠినమైన శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా, అతను 2018 కామన్వెల్త్ క్రీడలు, 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకాలను సాధించిన భారతదేశపు మొట్టమొదటి జావెలిన్ త్రో క్రీడాకారుని స్థాయికి ఎదిగాడు.
సాధించిన విజయాలు :
- బంగారు పతకం, ఆసియా క్రీడలు - 2018
- బంగారు పతకం, కామన్వెల్త్ క్రీడలు - 2018
- బంగారు పతకం, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ - 2017
- బంగారు పతకం, ప్రపంచ 20 ఏళ్ళ లోపు క్రీడాకారుల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ - 2016
- బంగారు పతకం, దక్షిణాసియా క్రీడలు - 2016
- రజత పతకం, ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ - 2016
- ప్రస్తుత జాతీయ రికార్డు హోల్డర్ (88.07 మీటర్లు - 2021)
- ప్రస్తుత ప్రపంచ జూనియర్ రికార్డ్ హోల్డర్ (86.48 మీటర్లు - 2016)
కీలక ప్రభుత్వం జోక్యాలు :
- ఐరోపాలో శిక్షణ మరియు పోటీ కోసం వీసా సపోర్ట్ లెటర్.
- క్రీడా సంబంధమైన గేర్ మరియు రికవరీ పరికరాల సేకరణకు ఆర్థిక సహాయం
- జాతీయ శిక్షణా శిబిరం మరియు విదేశీ వాతావరణంలో శిక్షణ కోసం బయో మెకానిస్ట్ ఎక్స్‌పర్ట్-కమ్-కోచ్ ను నియమించడం.
- సమాఖ్య మరియు ఎన్.జి.ఓ. తో పాటు గాయాల చికిత్స మరియు పునరావాసం.
- ప్రస్తుత ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో 26 అంతర్జాతీయ పోటీలకు ఆర్థిక సహాయం.
ఆర్ధిక సహకారం (2016 రియో తర్వాత - ప్రస్తుతం)
టి.ఓ.పి.ఎస్. : రూ. 52,65,388 (సుమారు)
ఏ.సి.టి.సి. : రూ. 1,29,26,590 (సుమారు)
మొత్తం: రూ. 1,81,91,978 (సుమారు)
నీరజ్ చోప్రా కు శిక్షణ ఇచ్చిన కోచ్‌ల వివరాలు:
ఏ) క్షేత్ర స్థాయిలో : శ్రీ జయ్ చౌదరి
బి) అభివృద్ధి స్థాయిలో : స్వర్గీయ శ్రీ గ్యారీ కల్వర్ట్ మరియు శ్రీ యూవె హొహ్న్
సి) ఉన్నత స్థాయిలో : డాక్టర్ క్లాస్ బార్టో నెయిట్జ్
*****
(Release ID: 1743774)
Visitor Counter : 247