ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పిఎంజికెకెవై) లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
మధ్యప్రదేశ్‌లో 5 కోట్ల మంది లబ్ధిదారులు పిఎంజికెఎవై ప్రయోజనాలు పొందుతున్నారు.
వరదలు, భారీ వర్షాల సమయంలో భారతప్రభుత్వం, దేశం మొత్తం మధ్యప్రదేశ్‌కు అండగా నిలుస్తొంది.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇండియా పేద ప్రజలకు అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చింది. : ప్రధానమంత్రి
80 కోట్ల మందికి పైగా పౌరులు ఉచిత రేషన్ పొందడమే కాదు, 8 కోట్ల మందికిపైగా పేద కుటుంబాలు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుతున్నాయి.
30 వేల కోట్ల రూపాయలు 20 కోట్ల మందికి పైగా మహిళల జన్‌ధన్ ఖాతాలలోకి నేరుగా బదిలీ చేయడం జరిగింది.
వేల కోట్లరూపాయలు కార్మికులు, రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడం జరిగింది.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలలో, రాష్ట్రప్రభుత్వాలు చేయూతనిచ్చి, కేంద్ర ప్రభుత్వ పథకాలను మెరుగుపరిచి,వాటి శక్తిని పెంచుతాయి : ప్రధానమంత్రి
మధ్యప్రదేశ్‌లో శ్రీశివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో , బీమారు రాష్ట్రం అన్న ఇమేజ్‌ను ఏనాడో వదిలించుకుంది: ప్రధానమంత్రి
ఇంతకు ముందు, వారు ఏ సదుపాయాలూ కల్పించలేదు, కేవలం సానుభూతి చూపారు. క్షేత్రస్థాయినుంచి వచ్చిన వారి
Posted On:
07 AUG 2021 1:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు , మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముచ్చటించారు. ఈ పథకానికి సంబంధించిచచ అర్హులైన వారెవరికీ ఈ పథకం ఫలాలు అందని పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు ఈ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవగాహనకార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది. 2021 ఆగస్టు 7ను రాష్ట్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.మధ్యప్రదేశ్‌లో ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ముందుగా మధ్యప్రదేశ్‌లో వర్షాలు వరదపరిస్థితిని అది రాష్ట్రంలో ప్రజల జీవితాలపైన వారి జీవనాధారంపై ఎలా ప్రభావం చూపిందో ప్రస్తావించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారతప్రభుత్వం, మొత్తం దేశం వారి వెంట ఉన్నట్టు తెలిపారు.
కరోనా మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ, ఇది శతాబ్దానికో విపత్తు వంటిదని అన్నారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు దేశం యావత్తు ఒక్కటిగా కలిసి పోరాడుతున్నదన్నారు.ఈ సవాలును ఎ దుర్కొనే వ్యూహంలో ఇండియా , పేద ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. కోవిడ్ మహమ్మారి మొదలైన రోజు నుంచి పేదలు, కార్మికులకు ఉపాధి, ఆహారంపై శ్రద్ధచూపడం జరిగిందని అన్నారు.
80 కోట్ల మంది పౌరులు ఉచిత రేషన్ పొందడమే కాదు, 8 కోట్ల మందికిపైగా పేద కుటుంబాల వారు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు.30 వే లకోట్ల రూపాయలు 20 కోట్ల మందికిపైగా మహిళల జన్‌ధన్ ఖాతాలకు నేరుగా జమచేయడం జరిగింది.అలాగే వేల కోట్ల రూపాయలు శ్రామికులు, రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఆగస్టు 9 వ తేదీన 10-11 కోట్ల మంది రైతు కుటుంబాల ఖాతాలలో మొత్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయన్నారు.
ఇటీవలే 50 కోట్ల వాక్సిన్ డోస్‌లు పూర్తి చేసుకున్న చరిత్రాత్మకఘట్టాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇండియా ఒక్క వారం రోజుల వ్యవధిలోనే ప్రపంచంలోని పలు దేశాలలోని జనాభాతో సమానమైన జన సంఖ్యకు వాక్సిన్ వేయగలుగుతున్నదని చెప్పారు. ఇది నవ భారత దేశపు నవసామర్ధ్యమని ఆయన అన్నారు. ఇండియా ఆత్మనిర్భరతను సాధిస్తున్నదని ఆయన చెప్పారు. వాక్సిన్ సురక్షితమైనది, బాగా పనిచేస్తుందని అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనాధారంపై విపరీత ప్రభావం చూపిన ఈ మహమ్మారి ప్రభావం కారణంగా భారతదేశంలో నష్టం కనీస స్థాయిలో ఉండేట్టు నిరంతరం చూడడం జరుగుతోందని ఆయన అన్నారు.
చిన్న, సూక్ష్మ పరిశ్రమలు తమ కార్యకలాపాలు కొనసాగించి, జీవనోపాధి పొందేందుకు లక్షల కోట్ల రూపాయల సహాయం వారికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఒక దేశం, ఒక రేషన్ కార్డు వంటి పథకం, హేతుబద్దమైనఅద్దె, పి.ఎం.స్వనిధి ద్వారా సులభ రుణాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కార్మిక వర్గానికి ఎంతో మేలు చేకూర్చాయి.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల గల ప్రయోజనం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, రాష్ట్రప్రభుత్వం రికార్డు స్థాయిలో ఎం.ఎస్.పి కొనుగోళ్లు చేపట్టినందుకు ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ఈ ఏడాది 17 లక్షల మందికిపైగా రైతుల నుంచి గోధుమలు కొనుగోలు చేసి వారి ఖాతాలలో నేరుగా 25 వేల కోట్ల రూపాయల వరకు జమచేసిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం గరిష్ఠస్థాయిలో గోధుమ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు అదనపు మద్దతు నిస్తాయని, ఆ పథకాలను మరింత మెరుగు పరిచి వాటి శక్తిని పెంచుతాయని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో , రాష్ట్రం ఎప్పుడో బీఆరు ముద్రను తుడిచేసుకుందని ఆయన అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వ పాలన తీరును ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు.గతంలో వారు పేద ప్రజల గురించి ప్రశ్న అడిగి, లబ్దిదారులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వారికై వారే సమాధానపరచుకునే వారని అన్నారు. పేద ప్రజలకు బ్యాంకు ఖాతాల వల్ల , రోడ్, గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్ల నిర్మాణం, పైపు ద్వారా నీటి సరఫరా, రుణాల మంజూరు వంటి వాటి వల్ల వారికి ఎలాంటి ఉపయోగం లేదని తలచారని అన్నారు . ఇలాంటి ఆలోచన వల్ల
చాలాకాలం ప్రజలు దేనికీ నోచుకోలేకపోయారని అన్నారు. పేద ప్రజల లాగానే, ప్రస్తుత నాయకత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోని వచ్చిందని అందువల్ల వారి కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో వాస్తవిక, అర్ధవంతమైన చర్యలు తీసుకుని పేదలకుసాధికారత కల్పించి వారిని బలోపేతం చేసినట్టు తెలిపారు. ఇవాళ ప్రతిగ్రామానికి రోడ్లు ఉ న్నాయని, నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయని, రైతులకు మార్కెట్‌లతో అనుసంధానత సులభమైందని అన్నారు. పేదలు అనారోగ్యం బారిన పడినపుడు ఆస్పత్రులకు సకాలంలో చేరుకోగలుగుతున్నారని అన్నారు.
ఈరోజు (ఆగస్టు 7)జాతీయ చేనత దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, 1905 ఆగస్టు 07 వ తేదీన దేశంలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. దేశంలో గ్రామీణులు, పేదలు, గిరిజనులకు సాధికారత కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడం జరుగుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమం మన హస్తకళలు, చేనేతను ప్రోత్సహించడానికి చేపడుతున్నట్టు తెలిపారు. ఇది ఓకల్ ఫర్ లోక్ల్ నినాదంతో కూడిన ఉద్యమం అన్నారు.ఈ భావనతోనే జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఖాదీ గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఖాదీని మరిచిపోయారని,అది తిరిగి ఇప్పుడు ఒక గొప్ప బ్రాండ్ గా అవతరిస్తున్నదని అన్నారు. ఈ దిశగా మనం వందేళ్ల స్వాతంత్రం దిశగా ముందుకు వెళుతున్నదశలో మనం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఖాదీ ఇచ్చిన స్ఫూర్తిని బలోపేతం చేయాల్సి ఉందని అన్నారు. స్థానిక హస్తకళా ఉత్పత్తులను రాబోయే పండగల సందర్భంగా కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
(Release ID: 1743773)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam