బొగ్గు మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్‌జోషిని క‌లిసిన ఆస్గ్రేలియా ప్ర‌తినిధివ‌ర్గం

Posted On: 06 AUG 2021 11:07AM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు,గ‌నులు, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్‌జోషి, ఆస్ట్రేలియా మాజీ ప్ర‌ధాన‌మంత్రి ,ఆస్ట్రేలియా ప్ర‌త్యేక వాణ‌ఙ‌జ్య దూత టోనీ అబాట్ నేతృత్వంలోని ఉన్న‌త‌స్థాయి ప్ర‌త‌నిధివ‌ర్గంతో నిన్న చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇండియా, ఆస్ట్రేలియాల‌మ‌ధ్య వాణిజ్య, ఆర్ధిక సంబంధాల‌ను మ‌రింత విస్త‌రింప చేసుకునే అంశాల‌ను చర్చించేందుకు ఈ ప్ర‌తినిధివ‌ర్గం మంత్రిని క‌లిసింది. ఇంధ‌న‌రంగం, ఇండియా ఇంధ‌న అవ‌స‌రాల‌కు ఆస్ట్రేలియా వ‌న‌రుల‌ను వినియోగించుకోవ‌డం, ఇందుకు సంబంధించిన విధాన అజెండాపై వీరు చ‌ర్చించారు. ఆస్ట్రేలియా మాజీ ప్ర‌ధాన‌మంత్రి అబూట్ వెంట ఆస్ట్రేలియా హైక‌మిష‌న‌ర్ బారీ ఒ ఫారెల్ ఎ ఒ, ఆస్ట్రేలియా హైక‌మిష‌న్ ఎక‌న‌మిక్ కౌన్సెల‌ర్ హుగ్ బాయ్‌లాన్ ఈ చ‌ర్చ‌ల‌లో  వున్నారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం బొగ్గు రంగాన్ని ఓపెన్ అప్ చేసిన విష‌యాన్ని ప్ర‌తినిధివ‌ర్గం దృష్టికి తెస్తూ, ఇండియాలో ప్ర‌ధాన ఇంధ‌న వ‌న‌రుగా బొగ్గుకు ఉన్న ప్రాధాన్య‌త‌ను వారికి తెలిపార‌రు. దేశంలో బొగ్గు ఉత్పత్తికి మ‌రింత ఊతం ఇచ్చేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. ఉప‌రిత‌ల‌, భూగ‌ర్భ బొగ్గు గ్యాసిఫికేష‌న్‌,కోల్ బెడ్ మీథేన్‌(సిబిఎం) త‌దిత‌రాల‌కు సంబంధించిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించే విష‌యంలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని ఆస్ట్రేలియాను మంత్రి కోరారు.
ఇండియాలో ఇవి త‌యారీకి కీల‌క , వ్యూహాత్మ‌క మిన‌ర‌ల్స్‌కు ఒక ప్ర‌ధాన సోర్సుగా ఆస్ట్రేలియాకు ఉన్న ప్రాధాన్య‌త‌ను కూడా మంత్రి తెలిపారు.
బొగ్గు మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అనిల్ కుమార్ జైన్‌, గ‌నుల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అలోక్ టాండ‌న్‌, ఇరు మంత్రిత్వ‌శాఖ‌ల‌కు చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారులు ఈ చ‌ర్చ‌ల‌లో పాల్గొన్నారు.

***



(Release ID: 1743230) Visitor Counter : 131