యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి), భారత దేశ యువతను భవిష్యత్‌కు సిద్ధమయ్యేలా చేస్తుంది. ఇండియాను ప్రపంచంలోనే అత్యంత ఎక్కువమంది నైపుణ్యంగల పనివారుగల దేశంగా పరివర్తన చెందేలా చేససస్తుంది. : శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
04 AUG 2021 5:15PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు...
--నూతన విద్యా విధానం (ఎన్ ఇ పి) 2020 మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని,కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ , యువజన సాధికారత, క్రీడల అభివృద్ధిపై జాతీయ విద్యా విధానం -2020 ప్రభావం అంశంపై ఒక వెబినార్‌ను నిర్వహించింది.
--కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్, కూడాఈ వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
నూతన విద్యా విధానం (ఎన్ఇపి)2020 తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని , యువజన సాధికారత, క్రీడల అభివృద్ధిపై నూతన విద్యావిధానం 2020 ప్రభావం అనే అంశంపై ఈరోజు వెబినార్‌నిర్వహించారు.కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. కేంద్ర యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణాక్ ఈ వెబినార్‌లో ప్రత్యేక ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రముఖులలో యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి.సింగ్, స్వామి వివేకానంద యూత్ మూవ్‌మెంట్ (ఎస్.వి.వై.ఎం), మెంబర్, కెపాసిటి బిల్డింగ్ కమిషన్ డాక్టర్ ఆర్. బాలసుబ్రమణియం, ఐఐఎం రోహతక్ డైరక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ, తమిళనాడు, శ్రీపెరుంబుదూరు ఆర్‌జిఎన్ఐవైడి డైరక్టర్ ప్రొఫెసర్ శిబ్‌నాథ్ దేవ్, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ వైస్ ఛాన్సలర్ శ్రీ ఆర్.సి.మిశ్రా, ఢిల్లీ యూనివర్సిటీ డిపార్టమెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సంగిత్ రాగి, డిపార్టమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ శ్రీ రవిమిట్టల్, సెక్రటరీ డిపార్టమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ శ్రీ మతి ఉషా శర్మా, జాయింట్ సెక్రటరీ ఆఫ్ డిపార్టమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ శ్రీ అసిత్ సింగ్, సంయుక్త కార్యదర్శి (డవలప్‌మెంట్) క్రీడా విభాగం శ్రీ అతుల్ సింగ్ ఉన్నారు..
వెబినార్‌లో మాట్లాడుతూ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, నూతన విద్యావిధానం (ఎన్.ఇ.పి)2020 భారతదేశ యువతను భవిష్యత్‌కు సిద్ధం చేస్తుందని, ప్రపంచంలోనే భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన పనివారు కలిగిన దేశంగా పరివర్తన చెందిస్తుందని అన్నారు. నూతన విద్యా విధానం భారత దేశ యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని అన్నారు. ఇది నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు. తద్వారా ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అన్నారు. మిడిల్ స్థాయి విద్యార్థులు కూడా వృత్తివిద్యా నైపుణ్యాలను సంతరించుకుని తగిన శిక్షణ పొందాలన్నారు. ఉదాహరణకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ రిపేరింగ్, హార్టికల్చర్, పాటరీ, ఎంబ్రాయిడరీ, వంటి నైపుణ్యాలు పొందాలన్నారు. 2025 నాటికి కనీసం 50 శాతం మంది విద్యార్థులకు ఒకేషనల్ నైపుణ్యాలు అందించాలన్నది లక్ష్యమని ఆయన అన్నారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న వృత్తి విద్యను ఉన్నత విద్య స్థాయి వరకు తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. తాము, యువతకు సాధికారత కల్పిస్తున్నామని, వారు ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి వారిలో ఎంటర్‌ప్రెన్యూయర్ స్ఫూర్తిని కల్పించేలా వారికి సాధికారత కల్పిస్తున్నట్టు ఆయనతెలిపారు. మన విద్యార్థులకు సంపూర్ణ విద్యఅనుభవాన్ని ఇచ్చేందుకు క్రీడల శక్తిని వినియోగించుకుంటన్నట్టు చెప్పారు. ఇది బృంద స్ఫూర్తిని , మానసిక దృఢత్వాన్నికలిగిస్తుందని ఆయన అన్నారు.
కేంద్ర క్రీడల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్ మాట్లాడుతూ, ఈ దేశంలో యువత లో, 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 27.5 శాతానికి పైబడి ఉన్నారని, అంటే దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు యువతేనని ఆయన అన్నారు. యువజనులతో నిండిన దేశం భారత్ అని ఆయన అన్నారు. దేశం మార్పు ను చూస్తున్నదని ఆయన అన్నరాఉ. జాతీయ విద్యా విధానం 2020 యువతకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎన్.ఇ.పి 2020 విద్యతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఇది విద్యార్థులు శారీరక దారుఢ్యం కలిగి ఉండేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇది వారి మానసిక, మేధోపరమైన, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
వెబినార్ సందర్భంగా నిపుణుల ప్యానల్ కింది అంశాలపై చర్చించింది:
-- యువతకు సమగ్ర, బహుళ విభాగాలతో కూడిన విద్య
--యువతకు , ఆసక్తి, అభిరుచి కలిగించే విధంగా విద్య
--అణగారిన వర్గాల యువతను ఉన్నత విద్య పరిధిలోకి తీసుకువచ్చి సమానత్వం, సంపూర్ణ అవకాశాలు కల్పించడం.
ఉపాధి అవకాశాలు పొందేలా, వృత్తిలో ప్రగతి సాధించేందుకు ఆన్‌లైన్, డిజిటల్ విద్య
డ్రాపవుట్ రేటును యువతలో తగ్గించడం, యువతలోని అందరికీ సార్వత్రిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం, యువతకు వృత్తి విద్యను అందించడం
***
(Release ID: 1742555)
Visitor Counter : 153