పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతదేశం విమానయాన రంగంలో నూతన అధ్యాయం
ఉడాన్ పథకం కింద ఇంఫాల్ - షిల్లాంగ్ ల విమాన సర్వీసులు ప్రారంభం
ఇంతవరకు ఉడాన్ లో 361 మార్గాల్లో విమాన సర్వీసులు
Posted On:
04 AUG 2021 10:21AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్ సి ఎస్ ఉడాన్ (రీజనల్ కనెక్టివిటీ స్కీమ్-ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద ఇంఫాల్ (మణిపూర్) - షిల్లాంగ్ (మేఘాలయ) మధ్య విమాన సర్వీసులు నిన్న ప్రారంభమయ్యాయి.దీనితో ఈశాన్య భారతదేశంలో ప్రధానమైన ప్రాంతాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. విమాన సర్వీసుల ప్రారంభ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు.
మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని ఈ ప్రాంతవాసులు ఎంతోకాలం నుంచి కోరుతున్నారు. చుట్టూ కొండలు కలిగిన షిల్లాంగ్ నగరం అనేక విద్యా సంస్థలతో ఈశాన్య భారతదేశంలో విద్యల నగరంగా గుర్తింపు పొందింది. ప్రకృతి అందాలకు నిలయమైన షిల్లాంగ్ నగరం మేఘాలయ రాష్ట్ర ముఖద్వారంగా ఉంది. భారీ వర్షపాతం, గుహలు, ఎత్తైన జలపాతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు వారసత్వం, సంస్కృతికి మేఘాలయ రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ శిఖరం, ఉమియం సరస్సు, సోహ్పేట్నెంగ్ శిఖరం, డాన్ బాస్కో మ్యూజియం, లైట్లమ్ కాన్యన్‌లకు షిల్లాంగ్ ప్రసిద్ధి చెందింది. ఐ-లీగ్‌లో పాల్గొనే రెండు ఫుట్‌బాల్ క్లబ్బులు -రాయల్ వహింగ్‌డో ఫుట్ బాల్ క్లబ్ మరియు షిల్లాంగ్ లాజోంగ్ ఫుట్ బాల్ క్లబ్ షిల్లాంగ్ లో ఉన్నాయి. షిల్లాంగ్ గోల్ఫ్ కోర్సు దేశంలోని పురాతన గోల్ఫ్ కోర్సులలో ఒకటి.
నేరుగా రవాణా మార్గం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇంఫాల్ నుంచి షిల్లాంగ్ చేరుకోవడానికి రోడ్డు ద్వారా సుదీర్ఘమైన 12 గంటల ప్రయాణాన్ని సాగించవలసి వచ్చేది. లేదా గౌహతి లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి బస్సులో షిల్లాంగ్ చేరుకోవలసి ఉండేది. ఇంఫాల్ నుంచి షిల్లాంగ్ చేరుకోవడానికి ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఇంఫాల్ నుంచి షిల్లాంగ్‌కు కేవలం 60 నిమిషాలు మరియు షిల్లాంగ్ నుంచి ఇంఫాల్‌కు 75 నిమిషాల వ్యవధిలో రెండు నగరాల మధ్య సులభంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.
ఉడాన్ పథకం కింద ఇంఫాల్‌తో అనుసంధానించబడిన రెండవ నగరం షిల్లాంగ్. ఉడాన్4 బిడ్డింగ్ ప్రక్రియలో ఇంఫాల్-షిల్లాంగ్ మార్గాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ దక్కించుకుంది. విమానయాన సంస్థలు ఛార్జీలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉడాన్ పథకం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అమలు జరుగుతోంది. వారంలో నాలుగు విమాన సర్వీసులను నిర్వహిస్తుంది 78 సీట్ల సామర్ధ్యం గల ఏటీఆర్ 72 తరహా విమానాలను సంస్థ ఈ మార్గంలో నడుపుతుంది. ప్రస్తుతం 66 ఉడాన్ మార్గాలలో ఇండిగో ఎయిర్‌లైన్స్సర్వీసులను నిర్వహిస్తోంది.
ఇప్పటి వరకు, 361 మార్గాలు మరియు 59 విమానాశ్రయాలు (5 హెలిపోర్ట్‌లు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా) ఉడాన్ పథకం కింద సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విమాన సర్వీసులతో అనుసంధానం చేయబడని దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉడాన్ పథకం ప్రారంభం అయ్యింది.
విమాన షెడ్యూల్ క్రింద పేర్కొనబడింది:
విమాన నెం.
|
బయలుదేరడం
|
రాక
|
సమయం
|
ఆగమన సమయం
|
7959
|
ఇంఫాల్
|
షిల్లాంగ్
|
09:55
|
10:55
|
7961
|
షిల్లాన్
|
ఇంఫాల్
|
11:15
|
12:30
|
***
(Release ID: 1742213)
Visitor Counter : 185