యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలతో సహా దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి వైఏఎస్ మంత్రిత్వ శాఖ అనేక పథకాలను రూపొందించింది: క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
02 AUG 2021 3:23PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు:
• ఖేలో ఇండియా పథకమైన 'టాలెంట్ సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్' కింద ఖేలో ఇండియా అథ్లెట్లకు ఈ పథకం కింద గుర్తించి ఎంపిక చేయబడిన క్రీడాకారులకు సంవత్సరానికి ₹ 6.28 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
• దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటిలో 360 ఖేలో ఇండియా కేంద్రాలు ఇప్పటికే గుర్తించబడ్డాయి
• ఖేలో ఇండియా పథకం "జాతీయ/ప్రాంతీయ/రాష్ట్ర క్రీడా అకాడమీలకు మద్దతు" కింద 236 క్రీడా అకాడమీలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
'స్పోర్ట్స్' అనేది రాష్ట్రానికి చెందిన ఆంశం కావడం, క్రీడా పాఠశాలలను తెరవడం సహా క్రీడల అభివృద్ధి బాధ్యత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాలపై ఉంటుంది. ఈ విషయంలో వారి ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ దేశంలో ఇటువంటి పాఠశాలల సంఖ్యకు సంబంధించి రాష్ట్రం/కేంద్రపాలిత/జిల్లా వారీగా డేటాను నిర్వహించదు.
గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలతో సహా దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి యువజన వ్యవహారాలు & క్రీడా మంత్రిత్వ శాఖ క్రింది పథకాలను రూపొందించింది: -
(i) ఖేలో ఇండియా పథకం (ii) జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం; (iii) అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో విజేతలకు మరియు వారి కోచ్‌లకు ప్రత్యేక అవార్డులు; (iv) జాతీయ క్రీడా అవార్డులు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్; (v) పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ క్రీడా సంక్షేమ నిధి; (vi) జాతీయ క్రీడా అభివృద్ధి నిధి; మరియు (vii) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా క్రీడా శిక్షణా కేంద్రాలను నిర్వహించడం.
ఈ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న క్రీడాకారులలో ఎక్కువమంది దేశంలోని గ్రామీణ, వెనుకబడిన, గిరిజన మరియు మహిళా జనాభాకు చెందినవారే. మరియు పథకాల ఆమోదం పొందిన నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ మరియు నాన్-రెసిడెన్షియల్ ప్రాతిపదికన క్రమ శిక్షణ ఇస్తారు.
ఖేలో ఇండియా పథకం కింద, రెండు విభాగాలలో అట్టడుగు స్థాయిలో ప్రతిభ శోధన ప్రారంభించబడింది:-
• క్రీడలకు సంబంధించిన ప్రతిభ గుర్తింపు
• నిరూపితమైన ప్రతిభ గుర్తింపు
ఇంకా, ప్రతిభ గుర్తింపు కోసం భారతదేశాన్ని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ మరియు ఈశాన్య జోన్‌లుగా విభజించారు. సంభావ్య మరియు నిరూపితమైన క్రీడాకారులను షార్ట్ లిస్ట్ చేయడానికి దేశంలోని ప్రతి మూలకు చేరుకోవడానికి గ్రాస్‌రూట్ జోనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 20 క్రీడా విభాగాలలో టాలెంట్ ఐడెంటిఫికేషన్ నిర్వహిస్తారు. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో రాణించదగ్గ క్రీడాకారులను ఎంపిక చేయబడతారు.
ఖేలో ఇండియా పథకమైన 'టాలెంట్ సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్' కింద గుర్తించి ఎంపిక చేయబడిన వారికి ₹ 6.28 లక్షల వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇందులో ఆటగాళ్ల అవుట్ పాకెట్ అలవెన్స్‌గా సంవత్సరానికి ₹ 1.20 లక్షలు ఉంటాయి. ₹ 5.08 లక్షలు కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్, డైట్, ఎక్విప్‌మెంట్, కన్స్యూమబుల్స్, ఇన్సూరెన్స్ ఛార్జీలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. వివిధ కేంద్రాలు పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లా స్థాయిలో పథకం కింద నోటిఫై చేయబడ్డాయి. రిక్రూటింగ్ గ్రాంట్ కింద అర్హులకు ₹ 5 లక్షల ఒకసారి అందుతుంది. మరియు పునరావృత మంజూరుగా ప్రతి విభాగానికి ₹ 5 లక్షలు.
ఖేలో ఇండియా పథకం యొక్క "జాతీయ/ప్రాంతీయ/రాష్ట్ర క్రీడా అకాడమీలకు మద్దతు" కార్యక్రమం కింద క్రీడా అకాడమీలు ఖేలో ఇండియా అథ్లెట్ల శిక్షణ కోసం గుర్తింపు పొందాయి. అకాడమీల అక్రెడిటేషన్ అనేది కొనసాగుతున్న ప్రక్రియ. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల నుండి ఖేలో ఇండియా స్కీమ్ కింద నిర్ణీత ప్రక్రియను అనుసరించిన తర్వాత స్పోర్ట్స్ అకాడమీలు గుర్తింపు పొందాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 236 స్పోర్ట్స్ అకాడమీలు గుర్తింపు పొందాయి. ఇంకా, ఖేలో ఇండియా పథకం యొక్క "స్టేట్ లెవల్ ఖేలో ఇండియా సెంటర్" కింద, ఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను స్థాపించాలని నిర్ణయించింది. వీటిలో 360 ఖేలో ఇండియా కేంద్రాలు ఇప్పటికే గుర్తించబడ్డాయి.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా అందించారు
***
(Release ID: 1741691)
Visitor Counter : 173