సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జి 20 దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రసంగించిన సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి
సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా అభివృద్ధి సాధించడానికి భారతదేశం అమలు చేస్తున్న చర్యలను వివరించిన మంత్రి
Posted On:
31 JUL 2021 2:11PM by PIB Hyderabad
ప్రధాన ముఖ్య అంశాలు:
*జి 20 దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశంలో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ప్రసంగించారు.
* సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలను అభివృద్ధికి కారకులుగా తీర్చిదిద్దడానికి భారతదేశం అమలు చేస్తున్న వివిధ చర్యలను సమావేశంలో వివరించిన శ్రీమతి లేఖి
* సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై చర్చలు
* వర్కింగ్ గ్రూప్ సిఫార్సులను ఆమోదించిన జి 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రులు
2021 జి 20 ప్రెసిడెన్సీలో భాగంగా ఇటలీ ఆధ్వర్యంలో 2021 జూలై 30వ తేదీన జరిగిన జి 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి పాల్గొన్నారు.
సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ద్వారా వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం, శిక్షణ మరియు విద్య ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, సంస్కృతి కోసం డిజిటల్ పరివర్తన మరియు కొత్త సాంకేతిక అంశాలు, అభివృద్ధి చోదకులుగా సంస్కృతి మరియు సృజనాత్మక విభాగాలు అనే అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి.
సమావేశంలో ప్రసంగించిన శ్రీమతి లేఖి ' అభివృద్ధి చోదకులుగా సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలు' అనే అంశంపై భారతదేశం అనుసరిస్తున్న విధివిధానాలను వివరించారు. ఆర్థికాభివృద్ధి సాధన, ఉపాధి కల్పన రంగాలలో సంస్కృతి మరియు సృజనాత్మక రంగాల ప్రాధాన్యతను మంత్రి సంస్కృతి మరియు సృజనాత్మక రంగాల ద్వారా మహిళలు, యువతతో పాటు స్థానికులకు మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తీసుకుని రాడానికి అవకాశం ఉందని అన్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు మరియు ఖాదీ మొదలైన రంగాలలో మరింత అభివృద్ధిని సాధించి ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలు ఉపయోగపడతాయని పర్యావరణహితమైన ఈ రంగాలు భారతదేశానికి అనుకూల అంశాలుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాల కల్పన, అసమానతలను తగ్గించడం, స్థిరమైన అభివృద్ధిని సాధించి ప్రజలకు ప్రత్యేక గుర్తింపును అందించడం ద్వారా వృద్ధిని సాధించడంలో సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం తీసుకున్న వివిధ చర్యలను శ్రీమతి లేఖి వివరించారు. దీనిలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పధకాన్ని అమలు చేస్తున్నదని, టూరిజం సర్క్యూట్లు, యోగా మరియు ఆయుర్వేద వైద్య అభివృద్ధికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ఈ రంగాల అభివృద్ధికి సమగ్ర విధానాలను రూపొందించడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిగి పరస్పర సహకారం అవసరముంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ సాంస్కృతిక సహకారం మరియు సంఘాల సాంస్కృతిక మరియు సృజనాత్మక రంగాల అభివృద్ధికి అమలు జరిగే అన్ని కార్యక్రమాలకు భారతదేశం తన వంతు సహకారాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
జి 20 సంస్కృతి వర్కింగ్ గ్రూప్ సిఫార్సులను మంత్రుల సమావేశం చర్చించి ఆమోదించింది.
జాతీయ అంతర్జాతీయ స్థాయిలోఆర్థిక మరియు సామాజిక రంగాలపై ప్రభావం చూపే సంస్కృతిని జి 20 నాయకుల 2021 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన అంశంగా చేర్చాలని కోరుతూ జి 20 దేశాల సాంస్కృతిక మంత్రులు తీర్మానాన్ని ఆమోదించారు.
***
(Release ID: 1741138)
Visitor Counter : 241