ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎన్‌సిడిసి 112 వ వార్షికోత్సవం సందర్భంగా ఎఎంఆర్ కోసం హోల్ జెనోమ్ సీక్వెన్సింగ్ నేషనల్ రెఫరెన్స్ లేబరెటరీని, కొత్త బిఎస్ ఎల్ 3 లేబరెటరనీ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్‌షుక్ మాండవీయ.
తన నూతన ఆవిష్కరణల ద్వారా భారతదేశం మాత్రమే కాక ప్రపంచం మొత్తం ప్రయోజనం పొందే విధంగా
కృషిని కొనసాగించనున్న ఎన్‌సిడిసి: శ్రీ మన్‌షుక్ మాండవీయ
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ఐఇసి మెటీరియల్, వాయు కాలుష్యం, ఉష్ణానికి సంబంధించి జాతీయ ఆరోగ్య అనుసరణ ప్రణాళికల ఆవిష్కరణ
Posted On:
30 JUL 2021 12:21PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌షుఖ్ మాండవీయ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సి డి సి) 112 వ వార్షికోత్సవాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌భారతి పవార్ తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హోల్ జెనోమ్ సీక్వెన్సింగ్ నేషనల్ రెఫరెన్స్ లేబరెటరీ ఫర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్), బిఎస్ఎల్ లేబరెటరీ, ఒక పిజి హాస్టల్ , ఒక గెస్ట్ హౌస్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఎల్ 3 లేబరెటరీ కాంప్లెక్స్ 5 అంతస్థుల భవనం. ఇందులో 22 బయోసేఫ్టీ లెవల్ (బిఎస్ఎల్) -2 లేబరెటరీలు ఉన్నాయి.
ఎన్‌సిడిసి కృషిని అభినందిస్తూ కేంద్రమంత్రి శ్రీ మన్‌షుక్ మాండవీయ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇండియా ప్రపంచంలోని ఎన్నో దేశాలకంటే మెరుగుగా వ్యవహరించిందని అన్నారు. ఎన్‌సిడిసి 112 సంవత్సరాల విజయ చరిత్రలో ఈరోజు కొత్త అధ్యాయం చేరుతున్నదని ఆయన అన్నారు.
ఎన్ సి డి సి వినూత్న ఆవిష్కరణలు భారతదేశానికే కాక ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేలా కృషి చేయాల్సిందిగా ఆయన ఎన్‌సిడిసిని ఈ సందర్భంగా ప్రోత్సహించారు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అధికారులు, ఎన్‌సిడిసి సిబ్బంది రాగల సంవత్సరాలలో తాము సాధించదలచుకున్న లక్ష్యాలను నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
ఇటీవలి కోవిడ్ -19 మహమ్మారిని గమనించిన తర్వాత, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధుల విషయంలో అప్రమత్తతతో,అవగాహనతో ఉండాల్సిన విషయాన్ని ప్రముఖంగా ముందుకు వచ్చిందని అన్నారు. అందుకు అనుగుణంగా ఎన్‌సిడిసిలోని జూనోటిక్ వ్యాధుల డివిజన్, నేషనల్ వన్ హెల్త్ కార్యక్రమం కింద జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధుల నియంత్రణ నిరోధానికి సంబంధించి ఐఇసి మెటీరియల్(ప్రింట్, ఆడియో , వీడియో) ను ఏడు ప్రధాన జూనోటిక్ వ్యాధులైన రేబిస్, స్క్రబ్ టైఫుస్, బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్, సిసిహెచ్ ఎఫ్, నిఫా, ఇండియాలోని క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లపై రూపొందించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి , కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రితో కలిసి ఈరోజు వీటిని ఆవిష్కరించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్‌షుక్ మాండవీయ, వాయు కాలుష్యంపై నేషనల్ హెల్త్ అడాప్టేషన్ ప్లాన్‌ను, అధిక ఉష్ణోగ్రతలకు సంబంధిచి జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను , ఇన్‌ఫోగ్రాఫిక్స్, వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యం కింద తొలి న్యూస్ లెటర్‌ను ఆవిష్కరించారు. దీనిని ఎన్ సిడిసి, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్, ఆక్యుపేషనల్ హెల్త్, వాతావరణ మార్పులు , ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ఎన్‌సిడిసి, తన విస్తృత పరిశోధన శాలల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నదని అన్నారు. అలాగే ఇది సాంక్రమిక వ్యాధులు, ప్రజారోగ్య సామర్ధ్యాల నిర్మాణం, కీటకాలకు సంబంధించి విస్తృత పరిశోదనలు సాగిస్తున్నదన్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ ఎంఆర్) కంటైన్‌మెంట్ కార్యక్రమం దేశంలో గొప్పగా జరుగుతున్నదన్నారు. వ్యాధులను సకాలంలో గుర్తించేందుకు తగిన నిఘా ఉంచడంలో, ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించడంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రజారోగ్య కార్యాచరణకు తగిన సాక్ష్యాలను సమకూర్చడంలో , ప్రజారోగ్య నియంత్రణలను అమలు చేయడంలో కీలక కేంద్రంగా పనిచేయగలదని ఆఎ అన్నారు. ఇవాళ సమాజంలో కనిపిస్తున్న జీవనశైలి వ్యాధులను దూరం చేసుకోవడంపై ప్రజలలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని , ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆమె అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, డైరక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీల్ కుమార్, అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజ, శ్రీ లవ్ అగర్వాల్,జె.ఎస్, డాక్టర్ సుజీత్ సింగ్ డైరక్టర్ ఎన్‌సిడిసి, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధులు డాక్టర్ రొడెరికో హెచ్ ఆఫ్రిన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1740988)
Visitor Counter : 200