ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 45.60 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ


గత 24 గంటల్లో దాదాపు 51లక్షల టీకాల పంపిణీ

కోలుకున్నవారి శాతం 97.38%
గత 24 గంటల్లో 44,230 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,05,155; మొత్తం కేసుల్లో 1.28%

రోజువారీ పాజిటివిటీ 2.44%; 53రోజులుగా 5% లోపే

Posted On: 30 JUL 2021 10:19AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 45.60  కోట్లు దాటింది. 54,50,378 శిబిరాల ద్వారా మొత్తం 45,60,33,754 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో  టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:     

  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,98,871

రెండో డోస్

77,94,788

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,79,23,328

రెండో డోస్

1,11,57,062

18-44 వయోవర్గం

మొదటి డోస్

14,95,34,704

రెండో డోస్

76,78,805

45-59 వయోవర్గం

మొదటి డోస్

10,37,58,165

రెండో డోస్

3,75,98,059

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,46,25,671

రెండో డోస్

3,56,64,301

మొత్తం

45,60,33,754 

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,43,972 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 42,360 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.38% అయింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NRHY.jpg

 గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  44,230 కొత్త కేసులు నమోదయ్యాయి. 33 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UX5X.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,05,155 మంది.చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.28% మాత్రమే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035H5J.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో  18,16,277 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 4కోట్లకు పైగా (46,46,50,723) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.43% కాగా రోజువారీ పాజిటివిటీ  2.44%  అయింది. వరుసగా 53 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048F9C.jpg

***



(Release ID: 1740892) Visitor Counter : 142