విద్యుత్తు మంత్రిత్వ శాఖ

భారత దేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్‌ను లేహ్ న‌గ‌రంలో ఏర్పాటుకు చేసేందుకు టెండర్లు ఆహ్వానించిన ఎన్‌టీపీసీ


- ఈ ప్రాంతంలో ఉద్గార రహిత రవాణా మరియు పర్యాటకాన్ని పెంచేలా స‌రికొత్త‌ ప్రాజెక్ట్

- లేహ్‌లో 1.25 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ప్ర‌త్యేక‌మైన‌ సోలార్ ప్లాంట్‌ కూడా ఏర్పాటు

Posted On: 29 JUL 2021 3:23PM by PIB Hyderabad

ఎన్‌టీపీసీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ 'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్' (ఎన్‌టీపీసీ ఆర్ఈఎల్‌) ల‌ద్ధాఖ్‌లోని లేహ్ న‌గ‌రంలో భారతలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి దేశీయ టెండర్లున‌ ఆహ్వానించింది. ఈ
బిడ్ పత్రాల అమ్మకం జూలై 31, 2021 నుండి ప్రారంభమవుతుంది. ఇటీవ‌ల ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపర్ నిగమ్ లిమిటెడ్ లడఖ్‌లో ఇంధన సెల్ బస్సుల సేకరణ కోసం (ఎన్‌వీవీఎన్) ఇచ్చిన టెండర్‌కు కొన‌సాగింపుగా ఈ కొత్త టెండ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్‌టీపీసీ ఆర్ఈఎల్‌, ఎన్‌వీవీఎన్‌లు సంయుక్తంగా గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టును లడఖ్ న‌గ‌రంలో అమలు చేయ‌నున్నాయి. పూర్తిగా హ‌రిత విధానంలో హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ఏర్పాటుకు గాను ఎన్‌టీపీసీ ఆర్ఈఎల్ 1.25 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను లేహ్‌లో ఏర్పాటు చేస్తోంది. సోలార్ ప్లాంట్ కాంట్రాక్టు నెలలోపు ఇవ్వబడుతుంది. ఎత్తైన ప్రాంతంలో హరిత హైడ్రోజన్ టెక్నాలజీల అభివృద్ధి కోసం ఎన్‌టీపీసీ ఆర్ఈల్ గతంలో కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌తో ఒక మైలురాయి లాంటి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్త‌యితే లేహ్‌ మరియు పరిసరాల్లో ఉద్గార రహిత రవాణా వ్య‌వ‌స్థ‌కు గాను కొత్త శకానికి దారితీస్తుంది మరియు ఇంత‌టి గౌరవనీయమైన స్థలంలో ముందడుగు వేసిన‌ కొద్ది దేశాలలో భారత్ కూడా నిలుస్తుంది.
ఈ ప్రాంతంలో ఒక స్ప‌ష్ట‌మైన‌, పచ్చటి పర్యావరణ వ్యవస్థను నిర్మించటానికి ఈ ప్రాజెక్ట్ ఒక నిర్ధిష్‌ట‌మైన‌ ముంద‌డుగుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేయడం వల్ల
కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌ద్ధాఖ్‌లో యొక్క ఉపరితల రవాణా సమస్యలు కూడా తేలికవుతాయి. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఇది గొప్ప ఉత్తేజాన్ని అందిస్తుంది.

***

 


(Release ID: 1740466) Visitor Counter : 213