రక్షణ మంత్రిత్వ శాఖ
కట్లాస్ ఎక్స్‌ప్రెస్ -21 విన్యాసంలో పాల్గొన్న ఐఎన్ఎస్ తల్వార్ విబిఎస్ఎస్ శిక్షణను ఇచ్చిన భారతీయ నావికాదళం
Posted On:
29 JUL 2021 11:04AM by PIB Hyderabad
కెన్యాలో జులై 26 నుంచి 06 ఆగస్టు,21 వరకు నిర్వహిస్తున్న బహుళ- జాతీయ నావికాదళ విన్యాసం కట్లాస్ ఎక్స్ ప్రెస్ 2021 (సిఇ 21)లో భారతీయ నావికాదళ నౌక తల్వార్ పాలుపంచుకుంటోంది. మొంబాసాలో జులై 26-28 వరకు నిర్వహించిన హార్బర్ దశలో భారతీయ నావికాదళ కమెండోల బృందం (ఎంఎఆర్‌సిఒఎస్) కెన్యా, జిబౌటీ, మొజాంబిక్, కామెరూన్, జార్జియా కోస్ట్‌గార్డ్ నావికాదళ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. మొంబాసాలోని బండారి మారిటైమ్ అకాడమీలో జరిగిన ఈ విన్యాసం సందర్భంగా విదేశీ నావికాదళ సైనికులతో ఉత్తమ పద్ధతులైన విజిట్, బోర్డ్, సెర్చ్, సీజర్ (వెళ్లడం, అధిరోహించడం, సోదా, స్వాధీనం -విబిఎస్ఎస్) కార్యకలాపాలను ఎంఆర్‌సిఒఎస్ పంచుకుంది.
కట్లాస్ ఎక్స్ ప్రెస్ విన్యాసం ప్రాంతీయ సహకారం, సముద్ర పరిధి పట్ల అవగాహన, యుఎస్, తూర్పు ఆఫ్రికా దేశాలు, పశ్చిమ హందూ మహాసముద్రంలో అక్రమ నావికా కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు యుఎస్, తూర్పు ఆఫ్రికా దేశాలు, పశ్చిమ హందూ మహాసముద్రం దేశాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను మెరుగుపరచడం కోసం రూపొందించారు.
***
(Release ID: 1740296)
Visitor Counter : 262