ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 44.61 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
గత 24 గంటల్లో 40 లక్షలకు పైగా టీకాల పంపిణీ
కోలుకున్నవారి శాతం 97.39%
గత 24 గంటల్లో 43,654 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,99,436; మొత్తం కేసుల్లో 1.27%
రోజువారీ పాజిటివిటీ 2.51%; 51 రోజులుగా 5% లోపే
Posted On:
28 JUL 2021 10:11AM by PIB Hyderabad
భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 44.61 కోట్లు దాటింది. 53,73,439 శిబిరాల ద్వారా మొత్తం 44,61,56,659 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 40,02,358 టీకాలిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,02,93,723
|
రెండో డోస్
|
77,53,002
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,79,07,362
|
రెండో డోస్
|
1,10,20,080
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
14,44,83,609
|
రెండో డోస్
|
68,86,188
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
10,25,21,263
|
రెండో డోస్
|
3,62,42,655
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
7,41,18,104
|
రెండో డోస్
|
3,49,30,673
|
మొత్తం
|
44,61,56,659
|
సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,06,63,147 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 41,678 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం 97.39% అయింది.
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 43,654 కొత్త కేసులు నమోదయ్యాయి. 31 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.
చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 3,99,436 మంది.
చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.27% మాత్రమే
కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 17,36,857 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 46 కోట్లకు పైగా (46,09,00,978) అయ్యాయి.
ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 2.36% కాగా రోజువారీ పాజిటివిటీ 2.51% అయింది. వరుసగా 51రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.
****
(Release ID: 1739836)
Visitor Counter : 214