ఉక్కు మంత్రిత్వ శాఖ

ఇనుము, ఉక్కు అందుబాటును పెంచేందుకు ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న ప్ర‌భుత్వం

Posted On: 26 JUL 2021 2:00PM by PIB Hyderabad

ఉక్కు అనియంత్రిత రంగం. ఉత్ప‌త్తి, ఎగుమ‌తి/   దిగుమ‌తుల‌కు సంబంధించిన అన్ని వాణిజ్య నిర్ణ‌యాల‌నూ ఉక్కు కంపెనీలే తీసుకుంటాయి. అయితే,  ఇనుము, ఉక్కు అందుబాటును పెంచేందుకు ప్ర‌భుత్వం వివిధ చ‌ర్య‌లను తీసుకుంది. ముడి ఇనుము ఉత్ప‌త్తి, అందుబాటులో ఉండేందుకు మైనింగు, ఖ‌నిజ విధాన సంస్క‌ర‌ణ‌లు, ఒడిషాలో రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన సంస్థ‌లు జ‌ప్తు చేసిన ప‌ని చేసే గ‌నుల‌ను త్వ‌రిత‌గ‌తంగా నిర్వ‌హించడంతో పాటుగా, ఉక్కు ఉత్ప‌త్తిదారుల ఉత్పాద‌న‌ను, సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంది. 
కేంద్ర బ‌డ్జెట్ 2021-22లో మిశ్ర‌ధాతువులు, మిశ్ర‌ధాతువులు కాని, స్టెయిన్‌లెస్ స్టీల్‌కు చెందిన సెమీలు, చ‌దునైన‌, పొడ‌వైన ఉత్ప‌త్తుల‌పై స‌మానంగా క‌స్ట‌మ్స్ డ్యూటీని 7.5% త‌గ్గించింది. అంతేకాక‌, స్టీల్ తుక్కుపై 31 మార్చి, 2022 వ‌ర‌కూ బిసిడికి మిన‌హాయింపు ఇచ్చారు. ఇందుకు అద‌నంగా, కొన్ని స్టీలు ఉత్ప‌త్తుల‌పై ఎడిడి, సివిడల‌ను ఉప‌సంహ‌రించింది/  తాత్కాలికంగా ఉప‌సంహ‌రించింది. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్ సోమ‌వారం లోక్‌స‌భ‌కు లిఖిత పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో పేర్కొన్నారు. 

***
 


(Release ID: 1739035) Visitor Counter : 145