ప్రధాన మంత్రి కార్యాలయం
ఆషాఢ పూర్ణిమ- ధమ్మ చక్ర దినం కార్యక్రమం లో ప్రధాన మంత్రి సందేశం
Posted On:
24 JUL 2021 8:52AM by PIB Hyderabad
నమో బుద్ధాయ,
నమో గురుభ్యో.
ఆదరణీయ రాష్ట్రపతి గారు,
ఇతర అతిథులు,
మహిళ లు మరియు సజ్జనులారా.
మీకు అందరికీ సంతోషదాయకం అయినటువంటి ధమ్మ చక్ర దినం, ఆషాఢ పూర్ణిమ ల శుభాకాంక్షలు. ఈ రోజు న మనం గురు పూర్ణిమ ను కూడా వేడుక గా జరుపుకొంటాం. ఈ దినాన, భగవాన్ బుద్ధుడు జ్ఞాన సిద్ధి ని పొందిన అనంతరం ప్రపంచాని కి తన ఒకటో బోధ ను పంచి పెట్టారు. మన దేశం లో ఒక మాట ను చెబుతారు.. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ దోషరాహిత్యం ఉంటుంది అని. మరి ప్రబోధకుడు స్వయంగా బుద్ధుడే అయినప్పుడు, ఈ తత్వం లోక కల్యాణానికి సమాన పదం గా మారిపోవడం స్వాభావికమే అవుతుంది. బుద్ధుడు పరిత్యాగం, సంయమం అనే కొలిముల లో తపించుకుపోయి, మాట్లాడారంటే, అప్పుడు ఆ మాట లు కేవలం పదాలు కావు, ధమ్మ తాలూకు మొత్తం చక్రమే పరిభ్రమించడం మొదలవుతుంది. ఆయన ధర్మోపదేశాన్ని అప్పట్లో అయిదు మంది శిష్యుల కు మాత్రమే అందించారు, కానీ ప్రస్తుతం ఆ తత్వాన్ని అనుసరిస్తున్న వారు, బుద్ధుని పట్ల విశ్వాసం కలిగిన అటువంటి వారు ప్రపంచం అంతటా విస్తరించారు.
మిత్రులారా,
భగవాన్ బుద్ధుడు పూర్ణ జీవనం మరియు సంపూర్ణ జ్ఞానం తాలూకు ఒక సూత్రాన్ని మనకు ప్రసాదించారు. దు:ఖాని కి కారణాన్ని గురించి, దు:ఖాల ను ఎలాగ గెలవవచ్చు అనే దానిని గురించి ఆయన వివరంగా చెప్పారు. భగవాన్ బుద్ధుడు మనకు పవిత్రమైనటువంటి ఎనిమిది విధాలైన సూత్రాల ను (పథాల ను) గురించి చెప్పారు. వాటినే జీవించడానికి సంబంధించిన ఎనిమిది మంత్రాలు అని కూడా అనుకోవచ్చు. మన మనస్సు కు, వాణి కి, మన సంకల్పానికి మధ్య సామంజస్యం, మన కర్మల కు, ప్రయాసల కు మధ్య సంతులనం ఉండిందీ ఉంటే గనక అటువంటప్పుడు మనం దు:ఖాల నుంచి బయటపడి ప్రగతి ని, సుఖాన్ని పొందగలుగుతాం. ఇదే సంతులనం మనకు మంచి కాలం లో లోక కల్యాణానికై పాటు పడేందుకు ప్రేరణ ను ఇస్తుంది, కష్ట కాలాల్లో ధైర్యం గా ఉండేందుకు శక్తి ని ఇస్తుంది.
మిత్రులారా,
ప్రస్తుత కరోనా మహమ్మారి కాలం లో భగవాన్ బుద్ధుడు మరింత ఎక్కువ సందర్భ శుద్ధి కలిగిన వారు అవుతున్నారు. బుద్ధుని మార్గాన్ని అవలంబించడం ద్వారా అత్యంత కఠినం అయిన సవాళ్ల ను కూడా మనం ఎలాగ ఎదుర్కోవచ్చో భారతదేశం చాటిచెప్పింది. ఇవాళ అన్ని దేశాలు సంఘీభావం తో ముందుకు పోతున్నాయి, బుద్ధుని బోధల ను అనుసరించడం ద్వారా ప్రతి ఒక్క దేశం మరొక దేశాని కి బలం గా మారుతూ ఉన్నాయి. ఈ దిశ లో ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కాన్ ఫెడరేశన్ చేపట్టినటువంటి ‘కేర్ విత్ ప్రేయర్’ కార్యక్రమం చాలా ప్రశంసనీయం గా ఉంది.
మిత్రులారా,
ధమ్మపదం అంటుంది కదా:
‘ న హీ వేరేన్ వేరాని,
సమ్మన్తీధ్ కుదాచనమ్.
అవేరేన్ చ సమ్మన్తి,
ఎస్ ధమ్మో సనన్తతో ’ అని.
ఈ మాటల కు, శత్రుత్వం తో శత్రుత్వం శాంతించదు. అంతకన్న, శత్రుత్వాన్ని ప్రేమ తోను, పెద్ద మనస్సు తో ను శాంతింపచేయవచ్చును అని భావం. విషాద వేళల్లో, ప్రపంచం ప్రేమ మరియు సద్భావాల తాలూకు శక్తి ని అనుభూతి చెందింది. బుద్ధుని ఈ జ్ఞానం, మానవ జాతి కి కలిగినటువంటి ఈ అనుభవం సమృద్ధం అయ్యే కొద్దీ, ప్రపంచం సఫలత కు, సమృద్ధి కి చెందిన కొత్త శిఖరాల ను అందుకోగలుగుతుంది.
ఈ అపేక్ష తో, మరో సారి మీకు అందరికీ అనేక అభినందన లు.
ఆరోగ్యం గా ఉండండి, మానవత కు సేవ చేయడాన్ని కొనసాగించండి.
ధన్యవాదాలు.
అస్వీకరణ: ప్రధాన మంత్రి ప్రసంగాని కి ఇది రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(Release ID: 1738992)
Visitor Counter : 201
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam