రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమ నైకా కమాండ్- ఫ్లీట్ అవార్డుల వేడుక
Posted On:
24 JUL 2021 10:44AM by PIB Hyderabad
వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు చెందిన స్వోర్డ్ ఆర్మ్ యొక్క వెస్ట్రన్ ఫ్లీట్ కార్యాచరణ చక్రం ముగింపు గుర్తుగా ప్రతి ఏడాది ఫ్లీట్ అవార్డు వేడుక నిర్వహిస్తారు. స్వోర్డ్ ఆర్మ్ వెస్ట్రన్ ఫ్లీట్ కార్యాచరణ చక్రం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లీట్ అవార్డు వేడుకతో ముగుస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా.. దాదాపు సంవత్సరం విరామం తరువాత జూలై 23వ తేదీ2021 ముంబయిలో ఈ వేడుక జరిగింది. ఏప్రిల్, 2020 నుండి 2021 మార్చి వరకు ఫ్లీట్ యొక్క కార్యాచరణ విజయాలకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సంవత్సరం వేడుకకు వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ హరి కుమార్‌తో పాటుగా వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు చెందిన ఫ్లాగ్ ఆఫీసర్లూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సంవత్సరం నిర్వహించిన వేడుక కోవిడ్ నిబంధనలకు లోబడి నిరాడంబరంగా సాగింది. దీంతో
హాజరు పరిమిత సంఖ్యగా ఉంది. అయితే ఊహించిన విధంగానే స్వోర్డ్ ఆర్మ్ ఫ్లీట్ యొక్క విజయాలు మాత్రం ఘనంగా ఉన్నాయి. కార్యక్రమంలో భాగంగా నావికా దళం కార్యకలాపాలు, భద్రతా పద్ధతులలో అసాధారణ ప్రతిభ ధైర్యాన్ని కనబరిచిన వారికి మొత్తంగా 20 ట్రోఫీలు బహూకరించబడ్డాయి. సముద్ర కార్యకలాపాల విశిష్ట సమృద్ధిని చేపట్టేటప్పుడు స్వచ్ఛమైన గ్రిట్ ప్రదర్శించినందుకు గాను.. రాజధాని నౌకల్లో ఐఎన్‌ఎస్ కోల్‌కతాకు ‘బెస్ట్ షిప్’ అవార్డు లభించింది. అన్ని ఫ్లీట్ కార్యకలాపాలు, సముద్రంలో నిర్వహించిన వివిధ ఎక్సర్‌సైజ్‌లు మరియు లొంగని స్ఫూర్తితో ఉత్సాహం మరియు ధైర్యాన్ని ప్రదర్శించినందుకు ఐఎన్ఎస్ తార్కాష్‌కు ‘మోస్ట్ స్పిరిటేడ్’ నౌక అవార్డు లభించింది. ట్యాంకర్లు, ఓపీవీల విభాగంలో ‘బెస్ట్ షిప్’ అవార్డును ఐఎన్ఎస్ దీపక్ గెలుచుకుంది. సాధారణంగా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు మధ్య కాలాన్ని కార్యాచరణ చక్రంగా పరిగణిస్తుంటారు. కోవిడ్ మహమ్మారి విస్తరించి
ఉన్న సవాలు సమయంలో.. ఇంటి నుండి పని చేయడం ప్రస్తుత పరిస్థితులలో ప్రమాణికంగా మారింది. ఇలాంటి తరుణంలో వెస్ట్రన్ ఫ్లీట్ గత సంవత్సరం ఎదురైన సవాలు కాలంలో మిషన్ మోహరించబడి మరియు చర్య కోసం సిద్ధంగా ఉంచబడింది. కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి దేశం చేసి ప్రయత్నానికి వెస్ట్రన్ ఫ్లీట్ మద్దతుగా నిలిచి కోవిడ్ సహాయ కార్యకలాపాలకు ఎంతో దోహదపడింది. తౌక్టే తుఫాను భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని తాకినప్పుడు పాశ్చాత్య నౌకాదళం యొక్క నౌకలు మరియు విమానాలలోని అసంఖ్యాకుల ప్రాణాలను కాపాడటానికి వెస్ట్రన్ ఫ్లీట్ సాహసోపేతమైన సహాయక చర్యలను చేపట్టింది. వివిధ మిషన్‌లలో పాల్గొని వాటిని విజయవంతం చేసేందుకు గాను ప్రాణాలను అర్పించిన సిబ్బంది వారి కుటుంబాల వారి త్యాగాల్ని
శ్లాఘిస్తూ కార్యక్రమం ముందుగా వారికి నివాళులర్పించింది. పోరుకు సిద్ధంగా ఉండడం మరియు
నిలబడి ఉండడంలో.. స్వోర్డ్ ఆర్మ్ మొదటి ప్రతిస్పందనగా ఉంటూ కార్యాచరణలో మేటిగా మోహరించబడింది.
*****
(Release ID: 1738866)
Visitor Counter : 189