సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

బౌద్ధ బోధనలు వసుధైవ కుటుంబకం అనే సందేశాన్ని పునరుద్ఘాటిస్తుంది : కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి


బౌద్ధమతం బౌద్దులతోపాటు ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది

Posted On: 24 JUL 2021 4:04PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి  మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు వీడియో సందేశం ద్వారా , ప్రపంచం అంత ఒకటే కుటుంబం అని బౌద్ధమతం బౌద్ధులకు మాత్రమే కాకుండా మనందరం కూడా  వసుధైవ కుటుంబకం అనే సందేశాన్ని ఇస్తుంది అని అన్నారు. ఆషాఢ పూర్ణిమ శుభ సందర్భంగా ‘ధర్మ చక్ర దినోత్సవం’నాడు గురు పూర్ణిమను కూడా జరుపుకుంటామని ఆయన తెలియజేశారు. "ఈ రోజు మనందరం గౌరవభావంతో భక్తి శ్రద్ధలతో మన గురువులకు కృతజ్ఞతా భావంతో పూజించే రోజు .  ఆషాఢ పూర్ణిమ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు పవిత్రమైన రోజు, మానవాళికి కూడా ముఖ్యమైన రోజు” అని ఆయన అన్నారు. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం ఇదే రోజున బుద్ధుడు  సారనాథ్‌లో తన ఐదుగురు సహచరులకు జ్ఞానబోధ చేశారు, తరువాత కాలక్రమేణా వారు బుద్ధుని అనుచరులుగా మారారు. బుద్ధుడు బౌద్ధమతానికి, హిందూ మతానికి దగ్గరి సంబంధం ఉందని ఆయన విశ్లేషించడంతో  పాటు అతను  జ్ఞానోదయం పొందిన తరువాత,  మానవత్వం కూడా దాని నుండి ప్రయోజనం పొందేలా చూసుకున్నాడు.

 

"మహాభారత రచయిత వేద వ్యాస మహర్షి జయంతిని (ఆషాఢ పూర్ణిమ) మనం గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. నేటికీ, బుద్ధుని అష్టాంగమార్గాలు  మానవాళికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఇవి ప్రపంచంలో అన్ని సమాజాలు శాంతియుతంగా సహజీవనం చేయడానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది” అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈ గురుపూర్ణిమ  కార్యక్రమాన్ని నిర్వహించినందుకు  అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు (International Buddhist Confederation, IBC) కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు ఒక ఉమ్మడి వేదికను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు.

 

పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) తో కలిసి ఈ ఏడాది నవంబర్ చివరలో భారతదేశంలో అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్టు శ్రీ కిషన్ రెడ్డి తెలియజేశారు. "బౌద్ధమత గొప్పతనాన్ని గురించి ఉపన్యసించేందుకు నలుమూలల నుండి పండితులను ఆహ్వానించడం జరుగుతుంది . ఈ సంవత్సరం భారత్ తన 75 వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ తో పాటు మానవజాతికి బుద్ధుడు అందించిన మార్గదర్శకాలను కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటాము" అని ఆయన అన్నారు.

బౌద్ధమత జన్మస్థలంగా భారతదేశం బౌద్ధ సమాజ వారసత్వాన్ని వారి  జ్ఞానాన్ని పంచుకోవడానికి ఎల్లపుడు సహకరిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. "భారతదేశ బౌద్ధ వారసత్వాన్ని పెంపొందించడంలో ప్రోత్సహించడంలో గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేసారు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. పురాతన స్థూపాల ఉన్న అనేక ప్రదేశాలు తిరిగి అభివృద్ధి చేయబడుతున్నాయి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులు వాటిని  సందర్శించవచ్చు” అని ఆయన అన్నారు.

శాంతి మరియు సామరస్యానికి  చిహ్నంగా బోధ్ గయా నుండి  బోధి మొక్కను తెచ్చి నాటినందుకు శ్రీ కిషన్ రెడ్డి గారు గౌరవ రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేసారు . “ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గౌరవనీయ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. నేను మరోసారి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జ్ఞానాన్ని పంచి శాంతి, సామరస్య విలువలను వారి బోధనలద్వారా విస్తరించిన గురువులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ఆయన అన్నారు.

 

 

***


(Release ID: 1738673) Visitor Counter : 262