ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పిల్లలను తమకు సంబంధించిన అభిప్రాయాలు, వివిధ అంశాలపై తమ దృక్పథాన్ని తెలిపేందుకు అవకాశం ఇవ్వాలి - డాక్టర్ రాజేష్ సాగర్, ప్రొఫెసర్, డిపార్టమెంట్ ఆఫ్ సైకియాట్రి, ఎయిమ్స్, మెంబర్ సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ
‘ సానుకూల వాతావరణం, తగిన ప్రోత్సాహం, సామాజిక సంబంధాలు లేకుంటే దాని ప్రభావం పిల్లలపై ఉంటుంది. ’
‘ సంరక్షకులు పిల్లలతో మాట్లాడేటపుడు సున్నితంగా వ్యవహరించాయి. పిల్లలకు తమలోలోపల అంతర్గతంగా ఏం జరుగుతుంఓ వారు తెలుసుకోలేరు’
సురక్షితమైన వాతావరణం పిలలను ప్రస్తుత మానసిక ఆరోగ్య సమస్యలనుంచి కాపాడగలదు- డాక్టర్ రాజేష్ సాగర్
Posted On:
23 JUL 2021 11:22AM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ సైకియాట్రి ప్రొఫెసర్, సెంట్రల్ హెల్త్ అథారిటీ సభ్యుడు డాక్టర్ రాజేష్ సాగర్, కోవిడ్ మహమ్మారి పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతున్నదో, దానిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు.
పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్ మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపింది?
పిల్లలు మానసికంగా, శారీరకంగా చాలా సున్నితమైన వారు.ఒత్తిడి, ఆందోళన వంటివి వారిపై బాగా ప్రభావం చూపుతాయి. దీని ఫలితాలు వారిపై చాలా వరకు ఉంటాయి. కోవిడ్ మహమ్మారి వారి సాధారణ కార్యకలాపాలలో చాలా మార్పులు తెచ్చింది. వారి పాఠశాలలు మూతపడ్డాయి. విద్య ఆన్‌లైన్ కు మారింది. సమవయస్కులతో మాట్లాడే అవకాశాలు తగ్గాయి.పరిమితం కూడా అయ్యాయి. దీనికి తోడు కొంతమంది తమ తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయారు లేదా బంధువులు, సంరక్షకులను కోల్పోయారు.
ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇవి వారికి మంచి వాతావరణాన్ని కల్పించలేకపోతాయి. ఇది వారి సాధారణ ప్రగతి అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.
మానసికంగా ఆందోళనకు గురౌతున్న పిల్లలనుంచి మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏమిటి?
పెద్ద వాళ్లలా కాకుండా పిల్లలు ఒత్తిడి సమయంలో భిన్నంగా ప్రవర్తిస్తారు. కొందరు పిల్లలు మొండిగా వ్యవహరిస్తారు. మరికొందరు ఆవేశంతో వ్యవహరిస్తారు, మరి కొందరు మానసికంగా కుంగిపోతారు.కొందరు మాట పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతారు. అందువల్ల పిల్లలలో మానసిక స్థితిని అర్ధం చేసుకోవడం కష్టం. పరిసరాల ప్రభావం పిల్లల భావోద్వేగాలు, వారి మూడ్‌పై ప్రభావం చూపుతుంది.పిల్లలు ఆయా పరిస్థితులను అంతర్గతంగా తీసుకుంటారు, భయం, అనారోగ్యం, దగ్గరి వ్యక్తులు, సన్నిహితుల మరణం వంటివి వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి, కొన్ని సందర్భాలలో వారు తమ భయం, ఆందోళనను సరిగా వ్యక్తం చేయలేరు.
అందువల్ల, పెద్దలు పిల్లల ప్రవర్తన ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రస్తుత సంక్షోభ సమయంలో పిల్లలు తమ అభిప్రాయాలు చెప్పడానికి, వివిధ అంశాలపై తమ దృక్పథాన్ని వెల్లడించడానికి పెద్దలు ప్రోత్సహించాలి. పిల్లలు తమ అభిప్రాయాలు వ్యక్తం చే యడానికి వీలు కల్పించాలి. వారు సరిగా వ్యక్తం చేయలేకపోయినట్టయితే వారు డ్రాయింగ్, పెయింటింగ్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించాలి. కోవిడ్ మహమ్మారి ప్రభావం గురించి పిల్లలను సూటి ప్రశ్నలతో అడగరాదు, పిల్లలతో మాట్లాడేటపుడు సంరక్షకులు సున్నితంగా వ్యవహరించాలి. నిజానికి వారిలో అంతర్గతంగా వస్తున్న మార్పును వారు గుర్తించలేరు.అందువల్ల వారిని అర్థం చేసుకునేందుకు సృజనాత్మక మార్గాలు అన్వేషించాలి. అయితే క్లిష్టమైన అంశాలగురించి చర్చించేటపుడు అంటే ఇన్‌ఫెక్షన్, మరణం వంటి వాటి గురించి మాట్లాడేటపుడు నేరుగానే మాట్లాడాలి.
పిల్లల జీవితంలో తొలి ఆరు సంవత్సరాలను పునాది సంవత్సరాలుగా భావిస్తారు. ఆ సమయంలో పిల్లలకు తగిన ప్రగతి అభివృద్ధికి ప్రోత్సాహం అవసరం.కోవిడ్ మహమ్మారి కౌమారదశలోని పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంటారు?
పిల్లల జీవితంలో తొలి 5 సంవత్సరాలు ఎంతో కీలకమైనవి. పిల్లలకు బహువిధాలైన ప్రోత్సాహలను మనం ఇవ్వాల్సి ఉంటుంది. సానుకూల వాతావరణం లేకపోవడం, సరైన రీతిలో సామాజికంగా కలిసే ఏర్పాటు లేకపోవడం వంటివి వారిపై వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి.
పిల్లలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేయకుండా చూస్తూనే, వారి పరిసరాలను ఆనంద దాయకంగా మలిచి వారిని వివిధ కార్యకలాపాలలో నిమగ్నమయ్యేట్టు చూడాలి. ఆన్‌లైన్ విద్య కూడా వివిధ కార్యకలాపాల ఆధారితంగా ఉంటేట్టు చూడాలి. పిల్లలకు ఆనందం కలిగించేవిధంగా, సురక్షితంగా ఉండే విధంగా వివిధ పద్దతులను మనం అనసరించాల్సి ఉంది. దీనివల్ల మనం కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని పిల్లలపై తక్కువగా ఉండేట్టు చూడగలం.
పెద్ద పిల్లలు కూడా విద్య విషయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని వారు భావించడం సహజం. కోవిడ్ మహమ్మారి వారి విద్య, కెరీర్ ప్రణాళికలను దెబ్బతీసింది. ఇక్కడ తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది. వారు పిల్లలకు సరిగా మార్గనిర్దేశం చేయాలి. మనం ఈ పరిస్థితులవిషయంలో పెద్దగా చేయగలిగింది లేదు..ఈ పరిస్తితిని వారు ఒక్కరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు ఇలాంటి సందిగ్థ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.తల్లిదండ్రులు కూడా వాస్తవ పరిస్థితులను గ్రహించాలి. ఈ విషయాన్ని వారికి తెలియజెప్పాలి. వారికి అండగా నిలవాలి. ఎడ్యుకేషన్ బొర్డులు పరీక్షల విషయంలో సరళంగా ఉంటున్నాయి. వైరస్ పిల్ల విద్య, వారి కెరీర్ ఆప్షన్‌లను ప్రభావితం చేసే పరిస్థితులు రాని దశకు మనం చేరుకోగలమని అనుకుంటున్నాను.
కోవిడ్ మహమ్మారికారణంగా పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెరిగింది. మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేస్తారు?
పని ప్రదేశం, వ్యక్తిగత ప్రదేశానికి మధ్యగల సన్నని విభజన రేఖ చెరిగిపోతున్నది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు బాధ్యతలను అదనంగా చేపట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వయసు పిల్లలకు వేరే వేరు అవసరాలు ఉంటాయి. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వారికి వనరులు సమకూర్చడం, వారి సంతోష కరమైన వాతావరణం ఉండేట్టు చూడడం వంటివి.
ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే అది పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. భద్రమైన వాతావరణం ప్రస్తుత పరిస్థితులలో వారి మానసిక ఆరోగ్యఆందోళనలను దూరం చేయగలదు.
తల్లిదండ్రులు పిల్లలను వివిధ వ్యాపకాలలో నిమగ్నం చేయడానికి వారు సానుకూల దృక్పథంతో ఉండాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండడానికి వారు మార్గాలు చూడాలి. వారు తమ రోజువారి కార్యకలాపాలను ఒక పద్ధతిలోకి తెచ్చుకోవాలి. అప్పడు వారు పిల్లలపై దృష్టిపెట్టి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడడానికి వీలు ఉంటుంది.
ఒత్తిడిని భరించలేని స్థితిలో ఉన్నవారు కుటుంబం, స్నేహితులు, ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాలి.
***
(Release ID: 1738626)
Visitor Counter : 462