ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ కమ్యూనికేషన్పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, బీఓసీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇంటారాక్టివ్ సెషన్స్ను నిర్వహించింది.

ప్రజాప్రయోజన సందేశాలు, సానుకూల కథనాలకు ప్రధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Posted On: 23 JUL 2021 5:39PM by PIB Hyderabad

యూనిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పీఐబీ, బీఓసీ, దూరదర్శన్, ఆల్ఇండియా రేడియో అధికారులు, ఫీల్డ్ రిపోర్టలతో కోవిడ్(సీఏబీ)పై శుక్రవారం ఓరియంటేషన్ మరియు ఇంటరాక్షన్ సెషన్నిర్వహించింది. కోవిడ్ వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు.. ప్రత్యేకించి చేరుకోవడానికి కష్టమయ్యే సుదూర మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నవారికి వ్యాక్సినేషన్కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాసిన అవసరంపై ఈ ఇంటరాక్షన్ సెషన్ కొనసాగింది.
డీడీ న్యూస్, ఆల్ ఇండియా రేడియో, ఓబీసీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు మీడియా సంస్థల నుంచి దాదాపు 150 మంది అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు హాజరైన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రసంగించారు.

కోవిడ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల అవసరంపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమానికి మద్దతుగా స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలను మంత్రి లవ్ అగర్వాల్ ఈ సందర్భంగా అభినందించారు. మీడియా సంస్థల ఈ ప్రయత్నాలు కోవిడ్ 19కు వ్యతిరేకంగా దేశప్రజలతా సామూహికంగా పోరాడటానికి దోహదపడ్డాయన్నారు.

ఇంతటితో ముగిసిపోయిందనుకొని సంతృప్తి చెందడానికి అవకాశం లేని సుదీర్ఘ యుద్ధాన్ని కోవిడ్ 19 మహమ్మారిపై చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. పాజిటివ్ రిపోర్టింగ్ ద్వారా ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించిన మీడియా సంస్థలు, మీడియా వ్యక్తులు ప్రభావశీలురని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన నకిలీ వార్తలపై నిజానిజాలు వివరించడంలో,  ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేయడంలో మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించిందని  గుర్తుచేశారు.  

దేశంలో కోవిడ్ 19 పరిస్థితిపై స్నాప్షాట్స్ ఆధారంగా వివరణాత్మక సమగ్ర ప్రెజెంటేషన్ ఇచ్చారు. కంటెయిన్మెంట్ ప్రాంతాలతోపాటు క్లినికల్ మేనేజ్మెంట్ ద్వారా కోవిడ్ నుంచి ఎక్కువ మంది కోలుకున్న ప్రాంతాలు, తక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించారు.  పదివేలకుపైగా కేసులు నమోదవుతున్న 9 రాష్ట్రాలను లవ్ అగర్వాల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.  కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకపోవడంతో కోవిడ్ సంబంధిత జాగ్రత్తలు కచ్చితంగా పాటించడం అవసరమని, సురక్షితమైన కోవిడ్ జాగ్రత్తల ద్వారానే వైరస్ను ఎదుర్కోగలమన్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధార రిపోర్టింగ్ ద్వారా ప్రజలను చైతన్యపర్చాలని ఆయన కోరారు.

కోవిడ్ 19 సమయంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి తలెత్తున్న సమస్యలపైనా లవ్ అగర్వాల్ మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కారానికి మీడియా సంస్థలు రాష్ట్ర, జాతీయస్థాయి నిపుణులతో ప్రజలకు అవసరమైన సందేశాలను చేరవేయాలని కోరారు. వ్యాక్సినేషన్కు సంబంధించి పెద్దమొత్తంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ బృందాలు చేస్తున్న సానుకూల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయక వ్యక్తులకు మీడియాలో ప్రధాన్య ఇవ్వాలని కోరారు.

కోవిడ్ 19కు సంబంధించి పెద్దమొత్తంలో ప్రజలను విద్యావంతులను చేయడం, ఆకర్షించడం కోసం ఉద్దేశించిన ఓ అవలోకనాన్ని లవ్ అవగర్వాల్ ప్రజెంట్చేశారు. సాంకేతిక నిపుణులు, బృందాలు వినూత్న కార్యక్రమాల ద్వారా కోవిడ్ 19పై ప్రజల్లో అవగాహన కల్పించడాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ దిశగా వివిధ బృందాలు చేస్తున్న స్ఫూర్తిదాయక కృషిపై ప్రజా ఉద్యమాన్ని సృష్టించాలని మీడియా అధికారుల, ఫీల్డ్ ఆఫీసర్లను ఆయన కోరారు.

ఈ ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్నవారు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, సమాచార మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్నారు. 

 



(Release ID: 1738435) Visitor Counter : 130