ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19: అపోహలూ, వాస్తవాలూ

కేంద్ర ప్రభుత్వం ఏ వెంటిలేటర్ నూ స్టాక్ పెట్టలేదు
రాష్ట్రాలకు పంపాల్సిన వాటిని ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వం పంపింది

పంపిన వాటిలో ఎక్కువ రాష్ట్రాలవద్ద నెలకొల్పకుండా ఉండిపోయాయి
ఇచ్చినవి నెలకొల్పి ఇంకా కావాలంటే చెప్పమని అడిగిన కేంద్రం

Posted On: 22 JUL 2021 7:41PM by PIB Hyderabad

కోవిడ్ రెండో సంక్షోభ సమయంలో కేంద్రం 13,000 వెంటిలేటర్లు వాడకుండా తన దగ్గర ఉంచుకున్నట్టు ఆరోపిస్తూ ఈ మధ్య మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. కేంద్రం వీటిని తన దగ్గరే ఉంచుకొని రాష్టాలకు పంపలేదని ఆ వార్తల్లో ఆరోపించారు.

 

అయితే, ఇవి నిరాధారమైన ఆరోపణలని, సత్యదూరమైనవని స్పష్టం చేయడమైనది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి వెంటిలేటర్లూ నిల్వలో లేవు. రాష్ట్రాలకు అవసరమైనవాటిని పంపకుందా ఉంచుకోవటమన్నది అర్థం లేని ఆరోపణ మాత్రమే. అందుకొని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ పంపటానికి సిద్ధంగా ఉంచిన వెంటిలేటర్లు ఏవీ పంపకుండా ఆపలేదు. అందువలన ఆ వార్తా వ్యాసాలలో రాసిన విషయం నిజం కాదు.  

 

కోవిడ్ సంక్షోభం మొదలైనప్పుడే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖ వెంటిలేటర్ల కోసం ఆర్డర్ పెట్టింది. 2020 మార్చి 27- ఏప్రిల్ 17 మధ్య 58,850 వెంటిలేటర్ల కోసం ఈ ఆర్డర్లు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా దిగుమతి చేసుకోవటం దాదాపుగా కుదరకపోవటంతో మేకిన్ ఇండియా వెంటిలేటర్లమీదనే ఆధారపడ్దాం. పైగా వెంటిలేటర్ల తయారీదేశాలు ఎగుమతులమీద ఆంక్షలు విధించటం వలన కూడా మనం దిగుమతి చేసుకోలేకపోయాం.  స్వదేశీ తయారీ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ఈ తయారీదారులనే ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరాం. అ విధంగా వారు విదేశాలనుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే స్వదేశంలోనే ఉత్పత్తి పెంచారు.

 

సాధికార బృందం-3 సిఫార్సులకు అనుగుణంగా అత్యవసర వైద్య పరికరాలు తగిన పరిమాణంలో లభ్యమయ్యేలా చూడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీటి సేకరణకు ఆర్డర్లు పెట్టాల్సి వచ్చింది.  

వెంటిలేటర్ నమూనాలను సాంకేతికంగా పరిశీలించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేయగానే వీటిని రాష్ట్రాలకు అందజేయాల్సిందిగా సిఫార్సు చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అక్కడి డిమాంద్ కు అనుగుణంగా సరఫరా చేయటం జరిగింది. 2020 సెప్టెంబర్ వరకు అందిన వెంటిలేటర్ల డిమాండ్ సమాచారానికి అనుగుణంగా సరఫరా జరిగింది. అందువలన అదనంగా అడిగినది నామమాత్రమే. రాష్టాలు అడిగిన దాదాపు మొత్తం వెంటిలేటర్లు.. అంటే 35,398 అందజేయటం పూర్తయింది. నవంబర్ తరువాత 2021 మార్చి వరకు అదనంగా అందజేసిన వెంటిలేటర్లు 996 మాత్రమే. అదనపు డిమాండ్ అంతవరకే ఉండటమే అందుకు కారణం.

పైన పేర్కొన్న విధంగా అందజేసిన వెంటిలేటర్లలో సైతం పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు రాష్ట్రాలు వాడకుండా పక్కనబెట్టాయి. కొన్ని గొడౌన్లకే పరిమితమయ్యాయి. తగినంత డిమాండ్ లేదని రాష్ట్రాలు తమ పరిధిలోని ఆస్పత్రులకు పంపిణీ చేయలేదు. వెంటిలేతర్లు త్వరితగతిన నెలకొల్పాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 2021 ఏప్రిల్ 11న కొన్ని రాష్ట్రాలకు లేఖలు కూడా రాశారు. పెరిగిన కోవిడ్ కెసుల నేపథ్యంలో అదనంగా అవసరమైతే ఆ విషయం తెలియజేయాలని కూడా కోరారు. ఆ తరువాత పదే పదే ఈ విషయం గుర్తు చేస్తూ కూడా చాలా సార్లు లేఖలు రాశారు.

ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన వార్తలో కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర నిల్వ ఉంచుకుందనటం నిరాధారమైన ఆరోపణ మాత్రమే. 13,000 వెంటిలేటర్లు కేంద్రం దగ్గరే ఉండిపోయాయనటం ఏ మాత్రమూ అర్థం లేని విషయం. రాష్ట్రాలనుంచి డిమాండ్ లేకపోవటం వలన తయారీదారులకు కూడా ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదు. డిమాంద్ కు అనుగుణంగా మాత్రమే వాటికి రూపకల్పన చేయాలని తయారీదారులకు సైతం ప్రభుత్వం సూచించింది. ప్రతి వెంటిలేటర్ నూ విడిభాగాలు పేర్చి, పరీక్షించి, నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు నిర్థారించుకున్న తరువాతనే రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు.

 

*****



(Release ID: 1738070) Visitor Counter : 82