యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహాలు చేసేందుకు భారత క్రీడాకారులకు వైఏఎస్‌ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సహాయం అందించింది: కేంద్ర క్రీడా మంత్రి

Posted On: 19 JUL 2021 4:49PM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్-2020 ఈవెంట్లలోని 18 క్రీడా విభాగాలైన ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, సెయిలింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ మరియు రెజ్లింగ్ పోటీల్లో భారత ఆటగాళ్లు, టీమ్‌లు పాల్గొంటున్నాయి.

ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి గరిష్ట కోటాను పొందటానికి మరియు పతకాలు సాధించే అవకాశాలను పెంచడానికి అవసరమయ్యే శిక్షణ, విదేశీ ఎక్స్‌పోజర్‌లు మరియు పోటీలకు ప్రభుత్వం అథ్లెట్లకు / జట్లకు నిరంతరం సహాయాన్ని అందిస్తోంది. ఎంపిక చేసిన అథ్లెట్లకు వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాల కోసం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ మరియు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌ సహాయం పథకం నుండి నిధులు సమకూరుతాయి. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టిఓపిఎస్‌) లో చేర్చబడిన అథ్లెట్లకు అవుట్ ఆఫ్ పాకెట్ అలవెన్స్ (ఓపిఎ) నెలకు రూ.50,000 / - ఇవ్వబడింది. కరోనా సంక్షోభ కాలంలో, అథ్లెట్లకు అవసరమైన క్రీడా పరికరాలు (బార్బెల్ రాడ్స్, వెయిట్స్‌, ఎక్సర్‌సైజ్‌ సైకిల్ మొదలైనవి), ఎయిర్‌ బుల్లెట్స్‌ , టార్గెట్ సిస్టమ్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ప్రాంతీయ కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అందించడం ద్వారా మద్దతు లభించింది. మరియు వారి శిక్షణ మరియు అభ్యాసాన్ని కొనసాగించడానికి వారి ఇళ్ళ వద్ద ఎన్జీఓలు సహయం అందిస్తారు.

భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్ అసోసియేషన్ మరియు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు అథ్లెట్లకు సాధ్యమైనంత సహకారాన్ని అందించినందున భారత క్రీడాకారులు తమ ఉత్తమ ప్రదర్శనలు ఇస్తారని మరియు దేశాన్ని గర్వించేలా చేస్తారని ప్రభుత్వం నమ్మకంగా మరియు ఆశాజనకంగా ఉంది.

ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

***



(Release ID: 1736984) Visitor Counter : 119