ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియా కోవిడ్ -19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థసన్నద్థత పాకేజ్: ఫేజ్ 2 కు సంబంధించిన ఏర్పాట్ల విషయమై రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
పెద్ద ఎత్తున ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, కోవిడ్ కు సమర్ధ చికిత్సా సామర్ధ్యానికి సంబంధించి ముందస్తు సమర్ధ ఏర్పాట్లపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగింది.
Posted On:
15 JUL 2021 2:50PM by PIB Hyderabad
కేంద్ర ప్రభత్వం ఇటీవల ఆమోదించిన రు 23, 123 కోట్ల రూపాయల ఇండియా కోవిడ్ -19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన సన్నద్దత ప్యాకేజ్ ఫేజ్ 2 పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమీక్ష నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య కార్యదర్శులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశం నిర్వహించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , ఇండియా కోవిడ్ -19 అత్యవసర స్పందన, ఆరోగ్యవ్యవస్థల ముందస్తు సన్నద్ధత, రెండో దశను ఆమోదించింది. దీనికింద 2021-22 ఆర్దిక సంవత్సరానికి 23,123 కోట్ల రూపాయాలను కేంద్ర కేబినెట్ 2021 జూలై 8న ఆమోదించింది.
ఫేజ్ -2 ఎమర్జెన్సీ కోవిడ్ -19 రెస్పాన్స్ పాకేజ్ (ఇసిఆర్‌పి) లో సెంట్రల్ సెక్టర్ (సిఎస్), కేంద్ర ప్రాయోజిత పథకాలు (సిఎస్ఎస్) రెండూ ఉన్నాయి.
ఈ పథకం ఆరోగ్యవ్యవస్థ సన్నద్థతను మరింతవేగవంతంచేస్తుంది.అలాగే ముందస్తుగా వ్యాధి గుర్తింపు, చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలపైదృష్టి పెడుతుంది. చిన్న పిల్లల ఆరోగ్యసంరక్షణపై కూడా దృష్టిపెట్టి స్పష్టమైన ఫలితాలు సాధించడం దీని లక్ష్యం. ఇది ప్రజారోగ్య కార్యకలాపాలను గ్రామ, పెరి అర్బన్,గిరిజన ప్రాంతాలుగా వికేంద్రీకరించడానిక వీలుకలుగుతుంది.
ఈ సమీక్షా సమవేశం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఎప్పటికప్పుడు జారీచేస్తున్న మార్గదర్శకాలు, విధానాల విషయమై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గనిర్దేశనం చేయడం జరిగింది. ఇది, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాలను కోవిడ్-19 స్పందనకు తగినట్టుగా బలోపేతం చేయడానికి వీలు కలుగుతుంది. వీలైనంత త్వరగా తమ ఖర్చు ప్రతిపాదనలను పంపాల్సిందిగా ఈ సమావేశంలో రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం సత్వర అనుమతులు మంజూరుచేయడానికి వీలుకలుగుతందని తెలియజేయడం జరిగింది.
ఈ సమావేశంలో కింది అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
- కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ,కేసులు గుర్తించడం, చికిత్స అందించడం, ఐసొలేషన్‌లో ఉంచడం వంటి వ్యూహం మరింత పెంపు
- పరీక్షల సామర్ధ్యంపెంపు, అదనపు పడకలను చిన్నపిల్లల చికిత్స కోసం కేటాయించడం, ఉప జిల్లా స్థాయిలో తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు
-కీలక మందులు, పరీక్షా కిట్లు, పిపిఇలు అందుబాటులో ఉండేట్టు చూడడం.
ఆక్సిజన్ అందుబాటునుపెంచడం,ఇళ్లల్లో, గ్రామాలలో, కమ్యూనిటీ సెంటర్లలో, ఐసొలేషన్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు.
- నైపుణ్యం కలిగిన వైద్య, పారామెడికల్ సిబ్బంది పెంపు, నేషనల్ మెడికల్ కమిషన్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లను సంప్రదించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రూపొందించిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా నైపుణ్యం గల సిబ్బంది పెంపు
ఇసిఆర్‌పి రెండో దశకు సంబంధించి కింది లక్ష్యాలను ఈ సమీక్షా సమావేశంలో పునరుద్ఘాటించారు.
-దేశంలోని 736 జిల్లాలలో కోవిడ్-19 కు సంబంధించి చిన్న పిల్లల చికిత్సకు ప్రత్యేకంగా చిన్న పిల్లల చికిత్సా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది.
- ప్రతి రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలో చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ క్సలెన్స్‌ను ఆయా జిల్లాల పీడియాట్రిక్ విభాగాలకు టెలి, ఐసియుసేవలు, మెంటారింగ్, సాంకేతిక మద్దతు ను అందించేందుకు వీలెగాఏర్పాటు చేసేందుకు మద్దతు. (ఇది రాష్ట్ర మెడికల్‌కళాశాలల్లో కానీ లేదా రాష్ట్ర ఆస్పత్రులు లేదా కేంద్ర ఎఐఐఎంఎస్ , జాతీయ ప్రాధాన్యత గల సంస్థలలో వీటి ఏర్పాటుకు వీలు కల్పించవచ్చు)
-ఐసియు బెడ్ల పెంపు. ఇందులో 20 శాతం పడకలను రానున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల కోసం కేటాయించాలి.
-ప్రజారోగ్యవ్యవస్థలో వైద్య ఆక్సిజన్ అందుబాటును మరింత పెంచేందుకు కనీసం జిల్లాకు ఒకటి వంతున 1050 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్‌లు, మెడికల్ గ్యాస్‌పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటుకు మద్దతు.
- రోజుకు 5 లక్షల టెలి కన్సల్టేషన్ సర్వీసులను అందించేందుకు టెలి కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లను బలోపేతంచేయడం. స్పోక్‌లు, హబ్‌ల అందుబాటును పెంచడం.
- హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్.ఎం.ఐ.ఎస్)ను అన్ని జిల్లా ఆస్పత్రులలో అమలు చేసేందుకు రాష్ట్రాలకు మద్దతు. జాతీయ స్థాయిలో దీనిని మరింత బలోపేతం చేసేందుకు మద్దతు
-అంబులెన్సు సర్వీసులు మరిన్ని అందుబాటులో ఉంచి కోవిడ్ -19 పేషెంట్లను ఆస్పత్రికి తరలించడం, రెఫరల్ ఆస్పత్రులకు పంపడంలో జాప్యం లేకుండా చూడడం
- కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని మరింత పెంచడం, ఇందుకు సంబంధించిన పరీక్షా కేంద్రాల పెంపు, ఆరోగ్య సదుపాయాలను పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువ చేయడం.
-వైద్యవిద్యార్ధులైన యుజి, పిజి విద్యార్ధుల సేవలను, చివరి సంవత్సరం ఎం.బి.బి.ఎస్, బిఎస్‌సి , జిఎన్ెం నర్సింగ్ విద్యార్థుల సేవలను సమర్ధంగా వినియోగించుకోవడం
ఇసిఆర్‌పి-2 కింద ఐటి మౌలిక సదుపాయాల సన్నద్ధత తో పాటు వివిధ అంశాలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై వెంటనే సమీక్ష నిర్వహించుకోవాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది. టెలికన్సల్టేషన్ సేవలకు సంబంధించిన హబ్, స్పోక్ నమూనాను మరింత మెరుగు పరచాలని, జిల్లా స్తాయి హబ్‌ల ద్వారా కోవిడ్ కేర్ సెంటర్ లలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండేట్టుచూడాలని నిర్ణయించారు.చివరి సంవత్సరం చదువుతున్న ఎంబిబిఎస్ విద్యార్ధులు, యుజి ఇంటర్న్‌లు, పిజి విద్యార్ధుల సేవలను నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం,స్వల్ప కోవిడ్ లక్షణాలనున్న వారికి టెలి కన్సల్టేషన్ ద్వారా సేవలు అందించేందుకు ఉపయోగించుకోవచ్చు.
అలాగే పైనల్ ఇయర్ చదువుతున్న నర్సింగ్ విద్యార్ధులు (బిఎస్‌సి,జిఎన్ఎం)విద్యార్ధుల సేవలను పూర్తిస్థాయి కోవిడ్ నర్సింగ్ సేవలకు ప్రభుత్వ ఆస్పత్రులలో సీనియర్ ఫాకల్టీ పర్యవేక్షణలో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. వీరికి రెమ్యునరేషన్, ఇన్సెంటివ్ కు సంబంధించి ఇసిఆర్‌పి -2 కింద రాష్ట్రాలు అవసరమైనపుడు వాడుకునే అవకాశం ఉంది. జిల్లాలలోని కోవిడ్, నాన్‌కోవిడ్ సదుపాయాలు, హెల్త, వెల్‌నెస్ సెంటర్లు (హెచ్.డబ్ల్యుసిలు) ఈ సంజీవని ఒపిడిలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్‌సిలు) ఇతర హెల్త్‌కేర్ సదుపాయాలైన సబ్‌సెంటర్లు, ప్రైమరీ హెల్త్ కేర్‌సెంటర్లు, కమ్యూనిటి హెల్త్ కేర్ సెంటర్లను జిల్లా ఆస్పత్రులతో అనుసంధానం చేయాలి.
కోవిడ్ ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఔషధాల సేకరణ కీలకమైన అంశంగా ఇసిఆర్‌పి -2లో పేర్కొనడం జరిగింది. ఔషధాల సేకరణకుసంబంధించిన మార్గదర్శకాలు, బఫర్ స్టాక్‌లను ఇప్పటికే రాష్ట్రాలకు పంపడంజరిగింది. దీనిని ఇందుకోసం వాడుకోవచ్చు.స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలను మలచుకోవచ్చు. స్టాక్‌లు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తమ స్వంత అంచనాల ప్రతిపాదనలతో ముందుకు రావాలి.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు సంబంధించిన ఎ.ఎస్.ఎండి (ఎన్.హెచ్ెం ) శ్రీమతి వందన, అడిషనల్ సెక్రటరీ శ్రీ వికాస్ శీల్ గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1736075)
Visitor Counter : 197