మంత్రిమండలి

దుస్తులు / వస్త్రాలు, మేడ్-అప్స్ ఎగుమతిపై రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు, సుంకాల (ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్) తగ్గింపును కొనసాగించాలని నిర్ణయించిన - ప్రభుత్వం


ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. ప్రస్తుత రేట్లు - 2024 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు

స్థిరమైన, ఊహించదగిన విధాన పాలన కోసం - నిర్ణయం


ప్రపంచవ్యాప్తంగా పోటీపడే భారతీయ వస్త్రాల ఎగుమతులకు - ప్రోత్సాహం

అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తల ద్వారా ఎగుమతులకు - ప్రోత్సాహం

లక్షలాది ఉద్యోగాల కల్పన - ఆర్థికాభివృద్ధి

Posted On: 14 JUL 2021 3:56PM by PIB Hyderabad

దుస్తులు / వస్త్రాలు (చాప్టర్ - 61 & 62),  మేడ్-అప్స్ (చాప్టర్-63), ఈ అధ్యాయాలలో ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకం మరియు పన్నుల మినహాయింపు (ఆర్.ఓ.డి.టి.ఈ.పి) పథకం నుండి మినహాయించిన ఎగుమతులపై, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 2019 మర్చి, 8వ తేదీన జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్న రేట్లతో,  రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు, సుంకాల (ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్) తగ్గింపును  కొనసాగించడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి, ఆమోదం తెలిపింది.  ఈ పథకం 2024 మార్చి, 31వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పరిధిలోకి రాని ఇతర వస్త్ర ఉత్పత్తులు (అధ్యాయాలు-61, 62 & 63 మినహా), ఆర్.ఓ.డి.టి.ఈ.పి. కింద, వాణిజ్య శాఖ ఖారారు చేసిన ఇతర ఉత్పత్తులతో పాటు, ఈ ప్రయోజనాలను పొందటానికి, వాణిజ్య శాఖ, ఈ విషయమై, ప్రకటించే తేదీల నుండి అర్హత కలిగి ఉంటాయి.

ప్రస్తుతం ఏ ఇతర యంత్రాంగాల క్రింద రిబేట్ అమలు చేయని అన్ని ఎంబెడెడ్ టాక్స్ / సుంకాలను తగ్గించడం ద్వారా, దుస్తులు / వస్త్రాలు, మేడ్-అప్స్ కోసం ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. కొనసాగించడం వల్ల, ఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.  స్థిరమైన, ఊహించదగిన విధానం అమలు ను, ఏ చర్య,  నిర్ధారిస్తుంది, భారతీయ వస్త్ర ఎగుమతిదారులకు ఒక స్థాయిలో వ్యాపార అవకాశాలను అందిస్తుంది.  అదేవిధంగా, ఎగుమతులు చేయడానికి, అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు, లక్షలాది ఉద్యోగాల కల్పనకు కూడా, ఈ నిర్ణయం, దోహదపడుతుంది.

ఎగుమతి చేసిన ఉత్పత్తులకు పన్ను వాపసు

ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో ఒక స్థాయి చక్కటి అవకాశాన్ని కలుగజేయడానికి, పన్నులు, సుంకాలను ఎగుమతి చేయకూడదు, అనేది, ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన విధానం.  అదేవిధంగా, సాధారణముగా తిరిగి చెల్లించే దిగుమతి సుంకాలు, జి.ఎస్.టి. తో పాటు, ఎగుమతిదారులకు తిరిగి చెల్లించని కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు విధించే అనేక ఇతర పన్నులు / సుంకాలు కూడా ఉంటాయి. ఈ పన్నులు, సుంకాలు ఎగుమతి చేస్తున్న అంతిమ ఉత్పత్తి ధరలో పొందుపరచబడతాయి.  ఈ విధంగా పొందుపరచబడిన పన్నులు, సుంకాల కారణంగా, భారతీయ దుస్తులు, మేడ్-అప్స్ ధరలు పెరుగుతాయి. దాంతో, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడటం వారికి కష్టమౌతుంది.

పన్నులు, సుంకాలు తిరిగి చెల్లించబడని మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా పొందుపరిచిన పన్నులలో భాగమైన కొన్ని ఇతర పన్నులు, సుంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: -

వస్తువుల రవాణా, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగానికి ఉపయోగించే ఇంధనం పై కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు, సుంకాలు, ఇతర పన్నులు.

మండీ (సంత) పన్ను

ఉత్పత్తి వ్యవస్థ కు చెందిన అన్ని స్థాయిలలో విద్యుత్ ఛార్జీలపై సుంకం

స్టాంపు డ్యూటీ

పురుగుమందులు, ఎరువులు మొదలైన వాటిపై చెల్లించిన జి.ఎస్.టి.

నమోదుకాని డీలర్ల నుండి కొనుగోళ్లకు చెల్లించిన జి.ఎస్.టి.

బొగ్గు లేదా ఇతర ఉత్పత్తులపై సుంకం. 

ఎంబెడెడ్ పన్నులు, సెస్సులు మరియు సుంకాల వాపసు యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన వస్త్ర మంత్రిత్వ శాఖ మొదట 2016 లో రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ (ఆర్.ఓ.ఎస్.ఎల్) పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకంలో వస్త్రాలు, దుస్తులు, మేడ్-అప్స్ ల  ఎగుమతిదారులకు జౌళి మంత్రిత్వ శాఖ బడ్జెట్ ద్వారా పొందుపరిచిన పన్నులు మరియు సుంకాలను తిరిగి చెల్లించడం జరిగింది.  2019 లో, జౌళి మంత్రిత్వ శాఖ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ టాక్స్ అండ్ లెవీస్ (ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్) పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది.  ఈ పథకం కింద, ఎగుమతి చేసే ఉత్పత్తిలో ఉన్న ఎంబెడెడ్ టాక్స్, సుంకాల విలువ కోసం ఎగుమతిదారులకు డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ జారీ చేస్తారు.  పరికరాలు, యంత్రాలు లేదా ఏదైనా ఇతర వస్తువుల దిగుమతి కోసం ప్రాథమిక కస్టమ్స్ సుంకం చెల్లించడానికి ఎగుమతిదారులు ఈ స్క్రిప్ ను ఉపయోగించవచ్చు. 

ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత మహమ్మారి ఏర్పడ్డంతో, ఎగుమతిదారులకు కొంత స్థిరమైన విధాన పాలనను అందించాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది.  వస్త్ర పరిశ్రమలో, కొనుగోలుదారులు దీర్ఘకాలిక ఆర్డర్లు ఇస్తారు. దాంతో, ఎగుమతిదారులు తమ కార్యకలాపాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.  అందువల్ల, ఈ ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించిన పాలసీ విధానం స్థిరంగా ఉండాలి.  ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని,  ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని, 2024 మార్చి 31వ తేదీ వరకు స్వతంత్రంగా ఒక ప్రత్యేక పథకం గా  కొనసాగించాలని, జౌళి మంత్రిత్వ శాఖ, నిర్ణయించింది.

ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని కొనసాగించడం వల్ల, అదనపు పెట్టుబడులను సమీకరించడానికీ, లక్షలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడానికీ, సహాయపడుతుంది.

*****


(Release ID: 1735730) Visitor Counter : 216