ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల తాజా సమాచారం


ప్రైవేట్ టీకా కేంద్రాల టీకా మందు కొనుగోళ్ళపై కేంద్ర ఆరోగ్యమంత్రి సమీక్ష
కొన్ని రాష్ట్రాల్లో నిదానంగా టీకాల కొనుగోలు ఆందోళనకరం: మంత్రి

ప్రైవేట్ ఆస్పత్రుల టీకా కొనుగోళ్ళు, పంపిణీని రోజూ సమీక్షించాలని కొన్ని రాష్ట్రాలకు హితవు

Posted On: 14 JUL 2021 2:05PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ ఈరోజు 15 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల  ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ టీకా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రెండు కోవిడ్ టీకా మందు తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నోడల్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.  

సార్వత్రిక టీకాల కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఈ రాష్ట్రాలలు, కేంద్రపాలిత ప్రాంతాల లోని ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలు టీకామందు కొనుగోలు చేస్తున్న తీరు, పంపిణీ చేస్తున్న తీరుమీద ఈ సమీక్ష సాగింది. టీకా మందు ఆర్డర్ పెట్టటానికి కూడా కోవిన్ వేదికను వాడుకోవాలని రాష్ట్రాలకు మరోమారు విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు అవసరాలను తెలియజేయాలని సూచించారు.

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా టీకాల పంపిణీ చాలా నిదానంగా ఉండటం ఆందోళనకరమైన విషయమని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన ఈ దిగువ పేర్కొన్న అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

1.     అనేక ప్రైవేట్ టీకా కేంద్రాలు ఇప్పటివరకు తమకు ఎంత టీకా మందు అవసరమో ఇండెంట్ పెట్టనే లేదు. అనేక రాష్ట్రాలు తమ పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రులు టీకా మందు కొనుగోలు చేయటానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఇంకా ఉంది. అందుకే రాష్ట్రాలు ఈ పరిస్థితిని రోజువారీ వారికి కేటాయించిన మందు కోసం ఆర్డర్ పెట్టు కొనుగోలు చేయటాన్ని ప్రోత్సహించాలి. 

2.     చాలా సందర్భాలలో కోవిడ్ టీకా మందుకోసం రాష్ట ప్రభుత్వాల దగ్గర ఇండెంట్ పెట్టినప్పటికీ మొత్తానికి చెల్లింపులు చేయలేదు. కొన్ని చోట్ల అసలు చెల్లింపులే చేయలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ టీకా కేంద్రాలు తాము కావాలనుకుంటున్న పరిమాణానికి, దానికయ్యే ఖరీదుకు మధ్య తేడాను భర్తీ చేసి టీకా మందు తీసుకోవాలి.

3.     కొన్ని రాష్ట్రాలలో టీకా మందుకు డబ్బు చెల్లించినప్పటికీ ఇంకా మందు తీసుకొలేదు. అలాంటి చోట రాష్టాలు, ప్రైవేట్ టీకా కేంద్రాలు వెంటనే మందు తరలించుకుపోవాలి.  

4.     మరికొన్ని రాష్ట్రాలలో టీకా మందు తీసుకుపోయినప్పటికీ వాస్తవంగా ఇచ్చిన టీకాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలు సమీక్షించుకొని నిల్వ ఉన్న టీకా మంది త్వరగా పంపిణీ జరిగేలా చూసుకోవాలి.

ప్రైవేట్ టీకా కేంద్రాలలో టీకాల కార్యక్రమం నెమ్మదిగా సాగటాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, రాష్టాలు ఈ పరిస్థితిని రోజువారీ సమీక్షించాలని సూచించారు. టీకా తయారీ సంస్థలతో  ప్రైవేట్ టీకా కేంద్రాలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవటానికి , అవాంతరాలు తొలగించటానికి కూడా కృషి చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కేంద్రం ఎప్పుడెప్పుడు ఎన్ని టీకా డోసులు పంపుతున్నదో రాష్టాలకు ముందస్తు సమాచారం ఇస్తున్నట్టే రాష్టాలు కూడా అక్కడి ప్రజలతో ఈ సమాచారం పంచుకోవాలని కోరారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటివరకు ఐదు ప్రాంతీయ వర్క్ షాప్స్ నిర్వహించటం ద్వారా రాష్ట్రాల, ప్రైవేట్ టీకా కేంద్రాల నోడల్ అధికారులకు అవగాహన కల్పించింది.  కోవిన్ పోర్టల్ లో ఇండెంట్ పెట్టటం, అడిగిన డోస్ లకు తగిన చెల్లింపు చేయటం లాంటి విషయాలను వివరించారు. మరిన్ని శిక్షణాకార్యక్రమాలు అవసరమైతే తెలియజేయాలని కూడా రాష్ట్రాలను కోరారు. రాష్ట్రాలు కోరితే అలాంటి శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంత టీకా మంది అవసరమో తెలియజెప్పాల్సిన రాష్టాల బాధ్యతను, వెనువెంటనే అందజేయాల్సిన టీకా తయారీ సంస్థల బాధ్యతను ఈ సమీక్షా సమావేశంలో గుర్తు చేశారు.

****



(Release ID: 1735527) Visitor Counter : 206